India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైసీపీలో యాదవ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించామని ఆ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలో యాదవ సంఘ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేటెడ్ పదవులిచ్చి సీఎం జగన్ గౌరవించారన్నారు. అప్సడా వైస్ ఛైర్మన్ రఘురామ్ నాయుడు, సంపత్ కుమార్ పాల్గొన్నారు.
అనుమానంతో భార్య, పిల్లలను లోపల ఉంచి ఇంటికి నిప్పుపెట్టాడో భర్త. ఈ ఘటన భీమడోలులో జరిగింది. SI సుధాకర్ వివరాల ప్రకారం.. అర్జావారిగూడెంకు చెందిన నాగరాజు-వెంకటలక్ష్మికి 2009లో పెళ్లైంది. ఇద్దరు పిల్లలు. నాగరాజు అనుమానంతో భార్యను వేధిస్తుండేవాడు. ఈనెల 15న భార్య, పిల్లలను ఇంట్లో వేసి నిప్పు పెట్టాడు. వారు కేకలేస్తూ తలుపులు పగులగొట్టుకొని బయటకు వచ్చారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
కొవ్వూరు రోడ్డు, రైలు వంతెనపై నుంచి గోదావరిలో దూకి యువతి మృతి చెందింది. రాజమండ్రి శాటిలైట్ సిటీ ఏరియాకు చెందిన భార్గవి(26) ఓ బ్యాంకులో పనిచేస్తోంది. కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటోంది. ఈ క్రమంలో గురువారం ఇంటి నుంచి బయల్దేరి వెళ్లిన భార్గవి తిరిగి రాలేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదావరిలో ఎవరో దూకినట్లు సమాచారం అందడంతో గాలింపు చర్యలు చేపట్టగా ఆమె మృతదేహం లభ్యమైంది.
ఉమ్మడి ప.గో.లో ‘ఉండి’ హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా.. ఇక్కడ టీడీపీ టికెట్‌పై మాత్రం క్లారిటీ రావడం లేదు. ఉండిలో ఎంపీ రఘురామ తరఫున శుక్రవారం నామినేషన్ దాఖలు కాగా.. రామరాజు 22న నామినేషన్ వేస్తానని ప్రకటించారు. నిన్న కేడర్ రామరాజు సమావేశం కాగా.. అంతలోనే చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చిందని, శనివారం ఆయనను కలిసిన తర్వాత నిర్ణయం వెల్లడిస్తానని రామరాజు నేతలకు తెలిపారు.
ఎంసీఎంసీ కమిటీల ముందస్తు అనుమతి లేకుండా ప్రింట్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించకూడదని ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో పలు సందర్భాల్లో ప్రింట్ మీడియాలో అభ్యంతరకరమైన, తప్పుదారి పట్టించే ప్రకటనలు ప్రచురితమైనట్లు ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టామన్నారు.
ఏలూరు జిల్లా పోక్సో కోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. గోపాలపురం మండలం పెద్దగూడెంకు చెందిన సంపత్‌రావు(81) అనే వృద్ధుడు 2017లో ఆరేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు అతడికి జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధించిందని, బాలికకు రూ.2,50,000 పరిహారం చెల్లించాలని ఆదేశించిందని పోలీసులు పేర్కొన్నారు.
ఉండి నియోజకవర్గ MLA అభ్యర్థిగా ఎంపీ రఘురామకృష్ణరాజు తరుఫున నామినేషన్ దాఖలు చేశారు. RRR సతీమణి రమాదేవి ఉండి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ ఆదిత్యకు ఈరోజు ఒక సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆమె వెంట రఘురామకృష్ణరాజు తనయుడు భరత్, తదితరులు ఉన్నారు. రఘురామకు ఎక్కడి టికెట్ కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ వీడకపోవడంతో ఆయన తన సతీమణి, కుమారుడితో నామినేషన్ దాఖలు చేయించినట్లు తెలుస్తోంది.
నరసాపురం పార్లమెంట్ (09) పరిధిలో 2వ రోజు నలుగురు అభ్యర్థులు 6 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. YCP తరఫున గూడూరి ఉమా బాల 2 సెట్లు, YCP తరపు గూడూరి జగదీష్ కుమార్ 1 సెట్, స్వతంత్ర అభ్యర్థిగా మహబూబాబాద్‌కు చెందిన గోటేటి లక్ష్మీ నరసింహారావు 2 సెట్లు, స్వతంత్ర అభ్యర్థిగా తణుకుకు చెందిన ఉందుర్తి ప్రసన్నకుమార్ 1 సెట్ నామినేషన్ దాఖలు చేశారన్నారు.
పోలింగ్ దృష్ట్యా ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 సెక్షన్ 135B (1) ప్రకారం ఏపీ దుకాణములు, సంస్థల చట్టం-1988 సెక్షన్ 31(2) ప్రకారం మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఏలూరు ఉప కార్మిక కమిషనర్ పి.శ్రీనివాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పై నిబంధన జిల్లాలోని వ్యాపారులు అందరూ తప్పనిసరిగా పాటించాలని కోరారు. అతిక్రమించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. SHARE IT..
ఉమ్మడి ప.గో. జిల్లాలో తొలి రోజు ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి అత్తిలి మండలం ఆరవల్లికి చెందిన సత్తి సూర్యనారాయణరెడ్డి ఒక సెట్ దరఖాస్తును కలెక్టరు సుమిత్‌కుమార్‌కు అందజేశారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడా నామినేషన్లు దాఖలు కాలేదని తెలిపారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎక్కువ మంది నేడు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు.
Sorry, no posts matched your criteria.