India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఏలూరు జిల్లా సమన్వయాధికారి భారతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పెదవేగి, చింతలపూడి, ఆరుగొలను, నరసాపురం, న్యూ ఆరుగొలను గురుకుల పాఠశాలల్లో చేరేందుకు పెదవేగిలోని గురుకుల పాఠశాలకు ఈ నెల 22న ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏలూరు వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా అఫిడవిట్‌లో చరాస్తులు రూ.1,39,96,885, స్థిరాస్తులు రూ.55,60,650 ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన సతీమణి పేరిట చరాస్తులు రూ.72,69,897, స్థిరాస్తులు రూ.5,92,29,200గా పొందుపరిచారు. అప్పులు ఆయన పేరిట రూ.27,51,846, భార్య పేరున రూ.9,45,100 ఉన్నాయన్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారం ప్రారంభమైంది. తొలిరోజు ఏలూరు జిల్లాలో ఆరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి పశ్చిమలో రాజకీయ సందడి తారస్థాయికి ఉంది. అన్ని పార్టీల అభ్యర్థుల హోరాహోరీ ప్రచారం, పాదయాత్రలతో పొలిటికల్ హీట్ పెరిగింది.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వర్జీనియా పొగాకు ధరలు గురువారం పుంజుకున్నాయి. A-గ్రేడ్ ధరలు గురువారం కిలో రూ.250 మార్క్‌ను క్రాస్ చేసింది. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రంలో గరిష్ఠ ధర రూ.255, జంగారెడ్డిగూడెం కేంద్రం-1లో రూ.257, జంగారెడ్డిగూడెం కేంద్రం-2లో రూ.251, కొయ్యలగూడెంలో రూ.255, గోపాలపురంలో రూ.254 ధర పలికింది.
నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభమైనప్పటికీ ప.గో. జిల్లాలోని ఉండి నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఎవరనేది స్పష్టత లేకుండా ఉంది. ఓ వైపు నియోజకవర్గంలోని ఆకివీడులో మంతెన రామరాజు ప్రచారం కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎంపీ RRR ఈ నెల 22న నామినేషన్ వేస్తానని.. ఏస్థానం నుంచి అనేది తర్వాతనే చెబుతానని ఇటీవల ప్రకటించారు. దీంతో క్షేత్రస్థాయి నాయకులు తమ నాయకుడికి టికెట్ వస్తుందో లేదోనన్న సంశయంలో ఉన్నారు.
– మీ కామెంట్..?
ఎన్నిక ఏదైనా ప.గో. జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే నాయకులకు ఓ సెంటిమెంట్ కొనసాగుతూ వస్తోంది. ప్రచారం ప్రారంభించేందుకు ముందు నాయకులు మండలంలోని నందమూరులో కొలువైన వెంకన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. స్వామి ఆశీస్సులు ఉంటే విజయం తథ్యమని విశ్వాసం. మాజీ CM జలగం వెంగళరావు గతంలో ఏడాదికి ఒకసారైనా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకునేవారు.
– మీ ప్రాంతాల్లో ఇలా ఏదైనా సెంటిమెంట్ ఉందా..?
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 145.6 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకోగా.. దాని విలువ ₹.4,340 ఉంటుందన్నారు. అలాగే FST వారు స్వాధీనం చేసిన నగదు ₹.6,52,000 ఉన్నట్లు తెలిపారు.
సీఎం జగన్ బస్సు యాత్రలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. గతంలో లేని విధంగా సీఎం కాన్వాయ్ లో డ్రోన్ బేస్డ్ సెక్యూరిటీ సర్వేలెన్స్ సిస్టం ఏర్పాటు చేశారు. గురువారం తణుకు నుంచి ప్రారంభమైన జగన్ బస్సు యాత్రలో ఈ విధానం ఏర్పాటు చేశారు. సీఎం పర్యటించే కాన్వాయ్ కు ముందుగా రెండు కిలోమీటర్ల మేర ఫొటోలు, వీడియోలః ద్వారా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఈ సిస్టం ద్వారా కలుగుతుంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. 21వ తేదీన భీమవరం, నరసాపురం.. 22వ తేదీన తాడేపల్లిగూడెం, ఉంగుటూరు.. 30వ తేదీన పోలవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్ కుమార్ గురువారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భీమడోలు మండలం ఏం.ఏం పురం గ్రామానికి చెందిన వట్టి పవన్ కుమార్ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా భుజాన వేసి సాదరంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో, ఆయన ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తానని వట్టి పవన్ కుమార్ స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.