India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆలపాటి నరసింహామూర్తి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు గురువారం దెందులూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఉమ్మడి ప.గో.జిల్లాలో బీసీవై తరఫున పోటీ చేయనున్న అసెంబ్లీ అభ్యర్థుల రెండో విడత జాబితా..ఎంపీ అభ్యర్థుల తొలి విడత జాబితాను గురువారం పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడిగంట వెంకటేశ్వరరావు, ఏలూరు ఎంపీగా బైరబోయిన మాల్యాద్రి నియమితులయ్యారు. సామాజిక న్యాయానికి, అన్ని వర్గాల సమతుల్యతకు పెద్ద పీట వేస్తూ.. అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు.
జగన్మోహన్ రెడ్డి బస చేసిన తణుకు మండలం తేతలి గ్రామంలోని శిబిరం వద్ద సందడి నెలకొంది. మరికొద్ది కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తల తాకిడి పెరిగింది. జగన్ మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ప.గో.జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమై ఈనెల 25 వరకు కొనసాగనుంది.. ఈ క్రమంలో ఈ నెల 19న ఆరిమిల్లి రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, ముదునూరి ప్రసాద్ రాజు, నిమ్మల రామానాయుడు, కాంగ్రెస్ నుంచి కొలుకులూరి అర్జునరావు, నరసింహారాజు, ఆచంటలో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఈనెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నారు.
సార్వత్రిక ఎన్నికల లో భాగంగా ఏలూరు జిల్లాలో ఈనెల 18వ తేదీ నుండి నామినేషన్ స్వీకరణకు సర్వం సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ చెప్పారు. ఏలూరు కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు కార్యాలయ పనిదినాలలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారన్నారు.
సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర గురువారం షెడ్యూల్ అధికారికంగా పార్టీ నాయకులు ప్రకటించారు. తణుకు మండలం తేతలి గ్రామ శివారులో బస చేసిన ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. తణుకు, పెరవలి, సిద్ధాంతం, రావులపాలెం, ఆలమూరు, కడియం మీదుగా కడియపులంక చేరుకుని అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు.
తాడెపల్లిగూడెం పట్టణంలోని ఏపీ నిట్ పూర్వ విద్యార్థి గోవాడ నవ్యశ్రీ సివిల్స్ 2023 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 995వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. నాలుగో సారి రాసిన సివిల్స్ పరీక్షలో విజయం సాధించడంతో పాటు ఐఆర్ఎస్ ర్యాంకు అధికారిగా ఉద్యోగం సాధించే అవకాశం ఉన్నట్టు నిట్ వర్గాలు తెలిపాయి. ఆమెను నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్ మూర్తి, అధ్యాపకులు అభినందించారు.
గోపాలపురం మండలం బీమోలు గ్రామంలో పండగ నాడు విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో బిల్డింగ్ పైన పనులు చేస్తున్న కార్మికుడు ప్రమాదశాత్తు బిల్డింగ్ పై నుంచి కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. హుటాహుటిన క్షతగాత్రుణ్ణి గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు యాసిన్ (40)గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేశారు.
ప.గో. జిల్లా కాళ్ల మండలం సీసలికి చెందిన గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష UPSC ఫలితాల్లో అద్భుత ప్రతిభ చాటారు. జాతీయ స్థాయిలో 198 ర్యాంకు సాధించి ఔరా అనిపించారు. గతంలో గ్రూప్-1 పరీక్షల్లో ఉత్తమ ర్యాంకు సాధించగా.. డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. కాగా ఈమె తండ్రి రామాంజనేయులు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి ఉష గృహిణి.
ఏలూరు జిల్లా పెదపాడు పోలీసు స్టేషన్ పరిధిలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు సాక శివకు పదేళ్ల జైలు శిక్ష, రు.2500/- జరిమానా విధించినట్లు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.వి.రామాంజనేయులు తెలిపారు. 2021 ఆగస్టులో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారని, సాక్షులను విచారించిన కోర్టు ఈ రోజు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించిందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.