India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్రకు నేడు విరామం ఇచ్చారు. తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేసిన ఆయన బుధవారం రాత్రి కూడా సైతం ఇక్కడే బస చేయనున్నారు. రోజంతా శిబిరంలో ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తిరిగి గురువారం ఉదయం యాత్ర ప్రారంభం కానుంది. శిబిరం నుంచి బయలుదేరి తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లనున్నారు.
శాసనమండలి ఛైర్మన్ కొయ్యె మోషేను రాజు తనయుడు చిట్టి రాజు ఈరోజు విడుదలైన 2024 సివిల్స్ ఫలితాల్లో 833వ ర్యాంక్ సాధించారు. సంతోషం వ్యక్తం చేసిన శాసనమండలి ఛైర్మన్ కుటుంబ సభ్యులు ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చిట్టి రాజును పట్టణంలోని పలువురు ప్రముఖులు అభినందించారు.
శాసనమండలి ఛైర్మన్ కొయ్యె మోషేను రాజు తనయుడు చిట్టి రాజు ఈరోజు విడుదలైన 2024 సివిల్స్ ఫలితాల్లో 833వ ర్యాంక్ సాధించారు. సంతోషం వ్యక్తం చేసిన శాసనమండలి ఛైర్మన్ కుటుంబ సభ్యులు ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చిట్టి రాజును పట్టణంలోని పలువురు ప్రముఖులు అభినందించారు.
తాను ఎక్కడ నుండి పోటీ చేస్తానన్న విషయంపై ఈ నెల 18వ తేదీ లోపు స్పష్టత వస్తుందని సస్పెన్స్‌కి తెరపడుతుందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు. మంగళవారం ఆయన నివాసంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయు విషయంపైన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి తన నుదుటిన ఏం రాశాడో అంటూ వ్యంగంగా స్పందించారు.
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర మంగళవారం ప్రారంభమైంది. సోమవారం రాత్రి నారాయణపురంలో బస చేసిన ఆయన ఈరోజు ఉదయం యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
సీఎం జగన్ బస్సుయాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశామని ఎస్పీ రజిత తెలిపారు. ఉండి కోట్ల ఫంక్షన్ హాల్‌లో యాత్రకు సంబంధించి పోలీసులకు అవగాహన కల్పించారు. పోలీసులు రోడ్డుకు ఇరువైపులా భద్రతా సిబ్బందితో ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో జిల్లాలోని ఆయా కేటగిరీల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం భద్రతకు సుమారు 1500 మంది పోలీసులను ఏర్పాటు చేశారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర మంగళవారం ఉంగుటూరు మండలం నారాయణపురం రాత్రి బస చేసిన చోట నుండి బయలుదేరి నిడమర్రు, గణపవరం, ఉండి మీదుగా భీమవరం చేరుకుంటుంది. ఈ సందర్భంగా భీమవరంలో బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం గరగపర్రు, పిప్పర, దువ్వ, తణుకు క్రాస్ మీదుగా ఈతకోటలో రాత్రికి సీఎం జగన్ బస చేస్తారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప.గో. జిల్లా నారాయణపురం నుంచి ప్రారంభం కానుంది. కాగా సీఎం జగన్ X (ట్విట్టర్) వేదికగా ‘DAY-16 పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధమా..?’ అంటూ పోస్ట్ చేశారు.
తెలుగు సినిమా హాస్యనటుడు M.S నారాయణగా పిలవబడే మైలవరపు సూర్యనారాయణది ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు. నేడు ఆయన జయంతి. ఎమ్మెస్ నారాయణ 1951 ఏప్రిల్ 16న జన్మించారు. ఆయన రచయితగా, దర్శకుడిగా, హాస్యనటుడిగా 17 సంవత్సరాలు సినీ రంగంలో సుమారు 700కు పైగా చిత్రాలలో నటించారు. అలాగే అనారోగ్య కారణాలతో 2015 జనవరి 23వ తేదీన హైదరాబాదులో మరణించారు.
ఏలూరు జిల్లాలో సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సుయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. సోమవారం రాత్రి భీమడోలు మండలం పూళ్ల గ్రామ సమీపంలో బస్సుయాత్ర వెనక వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా స్లో అయ్యాయి. దీంతో వెనక నుంచి బైక్‌పై వస్తున్న గుండు నరేశ్ కాన్వాయ్‌లోని కారును ఢీ కొట్టాడు. ప్రమాద తీవ్రతకు నరేశ్ కారు వెనకభాగం నుంచి లోపలికి చొచ్చుకెళ్లాడు. గాయపడిన అతణ్ని అంబులెన్సులో ఆశ్రం వైద్యశాలకు తరలించారు.
Sorry, no posts matched your criteria.