India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సోమవారం రాత్రి ముగిసిన వెంటనే ఆయన ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద రాత్రి బస చేస్తారు. ఈ నేపథ్యంలో నారాయణపురంలో సీఎం బసకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో ఆ చుట్టుపక్కల పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సోమవారం రాత్రి ముగిసిన వెంటనే ఆయన ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద రాత్రి బస చేస్తారు. ఈ నేపథ్యంలో నారాయణపురంలో సీఎం బసకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో ఆ చుట్టుపక్కల పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర ఉమ్మడి ప.గో షెడ్యూల్ విడుదలైంది. మంగళవారం 9AMకు ఉంగుటూరు మండలం నారాయణపురం నుంచి రాచూరు, నిడమర్రు, గణపవరం, కొలమూరు, ఉండి మీదుగా భీమవరం చేరుకుంటారు. 4.30PMకు భీమవరంలో బహిరంగ సభ. అనంతరం రోడ్ షో కొనసాగుతుంది. గరగపర్రు, ఉందుర్రు క్రాస్, సీహెచ్ అగ్రహారం, ముదునూరు, రావిపాడు, దువ్వ, తణుకు, ఖండవల్లి మీదుగా తూర్పు గోదావరి జిల్లా ఈతకోట చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
ప.గో జిల్లా పెనుమంట్ర మండలం నెగ్గిపూడి గ్రామంలో వెలిసిన శ్రీరామాలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇక్కడ మునులు, ఋషులు తపస్సు ఆచరించారని ఆలయ పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఏటా శ్రీరామనవమి అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని, దాదాపు 2వేల మందికి అన్నసమారాధన చేస్తారని తెలిపారు. ఆలయం వద్ద చలువ పందిరి, ఇతర ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
ప.గో. జిల్లా ఉండి నియోజకవర్గ టీడీపీ టికెట్‌పై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. అక్కడి నుంచి సిట్టింగ్ MLA మంతెన పోటీచేస్తారా..? లేక ఎంపీ రఘురామకృష్ణ బరిలో ఉంటారా అన్నది తెలియరావడం లేదు. ఇదిలా ఉండగా ఈ నెల 22న నామినేషన్ వేస్తానని RRR ప్రకటించారు. కానీ ఏ స్థానం నుంచి వేస్తారో చెప్పలేదు. మరోవైపు ఆకివీడులో రామరాజు ప్రచారం కొనసాగిస్తున్నారు.
– ఇంతకీ ఉండి టికెట్ ఎవరికి దక్కుతుంది..? మీ కామెంట్..?
ప్రస్తుత సీజన్‌లో నూజివీడు మామిడిని కెనడా, అమెరికా దేశాలకు ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏలూరు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రామ్మోహన్ తెలిపారు. నూజివీడు మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన మామిడి రైతు ఎం.బీ.వీ రాఘవరావు, మామిడి తోటను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ నెల 16వ తేదీన 1.2 టన్నుల మామిడి పండ్లను కెనడాకు, ఈ నెల 25న అమెరికాకు ఎగుమతి చేయనున్నట్టు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం (నేడు) భీమడోలు మండలం గుండుగొలను వద్ద రాత్రి 7 గంటలకు రోడ్డు షో మొదలు పెడతారని ఎమ్మెల్యే వాసు బాబు తెలిపారు. అనంతరం భీమడోలు, పూళ్ల, కైకరం మీదగా నారాయణపురం చేరుకొని రాత్రి అక్కడ బస చేస్తారన్నారు. అనంతరం మంగళవారం నారాయణపురం, నిడమర్రు, భువనపల్లి, గణపవరం సరిపల్లె మీదుగా భీమవరం చేరుకుంటారన్నారు.
శుభలేఖలు పంచడానికి వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటన నరసాపురం మండలంలో జరిగింది. వివరాలు.. నరసాపురం శ్రీహరిపేటకు చెందిన మురపాక సంతోష్‌కుమార్ (37) తన అన్న కుమారుడి వివాహం సందర్భంగా బంధువులకు శుభలేఖలు పంచేందుకు ఆదివారం బైక్‌పై జగన్నాథపురం బయలుదేరాడు. పాలకొల్లు సమీపంలోని పెంకుళ్లపాడు టిడ్కో గృహాల సముదాయం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మరణించాడు.
భీమవరంలో మంగళవారం నిర్వహించనున్న ‘మేమంతా సిద్ధం’ భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. భీమవరంలోని స్థానిక బైపాస్ రోడ్డులోని మెంటేవారితోట ప్రాంతంలో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బహిరంగ సభ అనంతరం సీఎం జగన్ రోడ్డుషో ద్వారా తూర్పుగోదావరి జిల్లాకు పయనమవుతారన్నారు.
మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో 85 ఏళ్లకు పైబడిన, 40% పైబడి వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. కాగా ఆయా కేటగిరీల వారి వివరాల సేకరణకు ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్నట్లు ఏలూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ముక్కంటి తెలిపారు. ఈ వివరాలను సెక్టార్ అధికారులు ఈ నెల 18 నుంచి 20 వరకు మరోమారు తనిఖీ చేసిన తర్వాత జాబితా రూపొందిస్తారన్నారు.
Sorry, no posts matched your criteria.