WestGodavari

News April 15, 2024

ప.గో.: తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గురుకులానికి స్థానం

image

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి డాక్టర్.బీఆర్.అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చోటుదక్కింది. 3600 ప్రాజెక్టులను వీడియోల ద్వారా తల్లిదండ్రులకు వివరించడం, 500 అంబేడ్కర్ చిత్రపటాలు గీయడం వంటి వేర్వేరు విభాగాల్లో గురుకుల పాఠశాల విద్యార్థులు ఈ ఘనత సాధించారు. ఈ మేరకు ప్రిన్సిపల్ రాజారావు ఆదివారం ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.

News April 14, 2024

ప.గో.: సీఎంపై దాడి.. మంత్రి వనిత రియాక్షన్ ఇదే..

image

సీఎం జగన్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ గోపాలపురం నియోజకవర్గం యర్నగూడెం గ్రామంలో వైసీపీ నాయకులు నిర్వహించిన నిరసన ర్యాలీలో మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఇది హేయమైన చర్య అని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు గన్నమని వెంకటేశ్వరరావు, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News April 14, 2024

ప.గో. జిల్లాలో సీఎం జగన్ పర్యటన వాయిదా

image

భీమవరంలో 15వ తేదీన జరగాల్సిన సీఎం పర్యటన వాయిదా పడిందని.. 16వ తేదీన ఉంటుదని వైసీపీ నాయకులు తెలిపారు. విజయవాడలో సీఎంపై జరిగిన దాడి నేపథ్యంలోనే వాయిదా పడిందని చెప్పారు. కాగా 16న జరిగే బస్సుయాత్ర, బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News April 14, 2024

దాడి చేసిన ఎవరినీ వదిలి పెట్టబోం: హోంమంత్రి వనిత

image

విజయవాడలో సీఎం జగన్ మీద జరిగిన దాడి పూర్తిగా ప్రతిపక్షాల కుట్రేనని హోంమంత్రి వనిత ఆరోపించారు. శనివారం రాత్రి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దాడికి కారణం అయిన ఏ ఒక్కరిని విడిచి పెట్టబోమని, ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని, దేవుడి ఆశీసులు జగన్‌కు, వైస్సార్సీపీ ప్రజా ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.

News April 14, 2024

ప.గో జిల్లాలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

image

ఇంటర్‌లో అనుకున్న మార్కులు రాలేదని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ప.గో జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. యలమంచిలి మండలం దొడ్డిపట్ల శివారు కుమ్మరిపాలెంకు చెందిన విద్యార్థిని(16) పాలకొల్లులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసింది. 450 మార్కులు వస్తాయని భావించిన ఆమె.. 380 రావడంతో మనస్తాపానికి గురైంది. పేరెంట్స్ ధైర్యం చెప్పినా పట్టించుకోకుండా ఉరేసుకుంది. చికిత్స పొందుతూ మృతి చెందింది.

News April 14, 2024

ప.గో.: సీఎం జగన్‌పై దాడిని ఖండిస్తున్నాం: ప్రభుత్వ విప్ 

image

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన దాడి పిరికిపందల చర్య అని, ఈ దాడిని ఖండిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమ కోసం చేపట్టిన బస్సు యాత్రలో ప్రతిపక్షాలు ఆయనపై దాడికి దిగడం శోచనీయమని అన్నారు.

News April 13, 2024

ప.గో.: సిట్టింగ్‌లకు నో టికెట్.. హీటెక్కిన రాజకీయం

image

2019లో గెలుపొందిన పలువురు MLAలకు ఈ సారి టికెట్ రాకపోవడంతో ఉభయ గోదారిలో రాజకీయం వేడెక్కింది. చింతలపూడిలో YCP MLA ఎలీజాను మార్చగా ఆయన కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకొన్నారు. పి.గన్నవరం YCP MLA చిట్టిబాబుకు సైతం టికెట్ ఇవ్వకపోగా ఆయనా కాంగ్రెస్‌లో చేరారు. ఇక ఉండిలో TDP సిట్టింగ్ MLAలకు ఆ పార్టీ తొలుత టికెట్ ఇచ్చినా.. ఇతరులకు కేటాయిస్తారనే టాక్‌తో సందిగ్ధత నెలకొంది.

News April 13, 2024

ఏలూరు: ఇంటర్ బాలికకు పెళ్లి.. అడ్డగింత

image

ఏలూరు జిల్లా భీమడోలులో బాల్యవివాహాన్ని అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాలికకు భీమవరానికి చెందిన ఓ యువకుడితో వివాహం జరుగుతుందన్న సమాచారం మేరకు జిల్లా డీసీపీయూ అధికారులు, భీమడోలు అంగన్వాడీ, ఐసీడీఎస్ సిబ్బంది రంగంలోకి దిగారు. శుక్రవారం బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికను ఏలూరు ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి తరలించామని శనివారం వెల్లడించారు.

News April 13, 2024

ఏలూరు జిల్లాలో బాలికపై అత్యాచారయత్నం

image

ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం జగ్గవరం గ్రామంలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పోలీసుల వివరాల ప్రకారం.. జగ్గవరానికి చెందిన ఏడేళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన లక్ష్మణరావు ఇంటికి తీసుకువెళ్లి చీమలు తొలగిస్తానని చెప్పి ఆమె దుస్తులు తీసేసి అత్యాచారానికి యత్నించాడు. ఇంటికి వచ్చిన బాలిక శరీరంపై గాయాలు గుర్తించిన తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు లక్ష్మణరావుపై కేసు నమోదు చేశారు.

News April 13, 2024

తల్లీ, కుమార్తె మృతదేహాలు లభ్యం

image

ఆర్థిక ఇబ్బందులతో భీమవరానికి చెందిన కిషోర్‌కుమార్‌(32), అతని భార్య యోచన(24) కుమార్తె నిధిశ్రీ(2)తో చించినాడ వశిష్ఠ వంతెనపై నుంచి గోదావరిలో దూకిన విషయం తెలిసిందే. గురువారం కిషోర్‌ మృతదేహం.. శుక్రవారం తల్లీ, కుమార్తె మృతదేహాలు దొరికాయి. పాలకొల్లులో పోస్టుమార్టం చేశారు. మరణంలోనూ పేగు బంధాన్ని వీడలేక యోచన చున్నీతో కుమార్తెను కట్టేసుకొని దూకినట్లు తెలుస్తోంది. వీరు కొద్దిరోజులుగా అమలాపురంలో ఉన్నారు.