India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎంపీ రఘురామను లోక్‌సభ బరిలో నిలుపుదామా..? అసెంబ్లీ సీటు కేటాయిద్దామా..? అంటూ ‘కూటమి’ మల్లగుల్లాలు పడుతోంది. శుక్రవారం చంద్రబాబు, పవన్, పురందీశ్వరి భేటీలో RRR టికెట్‌పై చర్చ జరిగినట్లు సమాచారం. ‘నరసాపురం MP టికెట్ RRRకు కేటాయించి.. అక్కడి BJP ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మకు ఉండి అసెంబ్లీ టికెట్ ఇద్దాం’ అని చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలిసింది. అధిష్ఠానంతో చర్చిస్తామని BJP నేతలు చెప్పినట్లు సమాచారం.
ఉమ్మడి ప.గో. జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. 14న పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ప.గో. జిల్లాలో 2 మండలాల్లో, ఏలూరు జిల్లాలోని 5 మండలాల్లో వడగాలులు ఉండనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారిన అనపర్తి, ఉండి టికెట్లపై త్వరలో క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో లోకేశ్, జనసేన అధినేత పవన్, బీజేపీ స్టేట్ చీఫ్ పురందీశ్వరి, సిద్ధార్థ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ప్రచార శైలి, భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. వీటితో పాటు అనపర్తి, ఉండి టికెట్లపైనా ఈ భేటీలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు.. పాసైన వారి సంఖ్య ఇలా ఉంది.
➠ ఫస్ట్ ఇయర్: ప.గో జిల్లాలో 15,645 మందికి గానూ 10,843 మంది (69%).. ఏలూరు జిల్లాలో 13,078 మందికి గానూ 9,421 మంది (72%) పాసయ్యారు.
➠ సెంకడ్ ఇయర్: ప.గో జిల్లాలో 13,161 మందికి గానూ 10,470 మంది (80%).. ఏలూరు జిల్లాలో 11,539 మందికి గానూ 9,211 మంది (80%) పాసయ్యారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా 69 శాతం(ఉత్తీర్ణత)తో రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో 80 శాతంతో 9వ స్థానంలో ఉంది.
➠ ఏలూరు జిల్లా ఫస్ట్ ఇయర్‌లో 72 శాతంతో 6వ స్థానంలో ఉండగా.. సెకండ్ ఇయర్‌లో 80 శాతం (ఉత్తీర్ణత)తో 8వ స్థానంలో నిలిచింది.
ప.గో జిల్లాలో ఉండి టికెట్ పంచాతీ రాజకీయ కాక రేపుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి మరోసారి పిలుపు వచ్చింది. రామరాజుకు CBN నచ్చజెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధినేతను కలవడానికి రామరాజు అతికొద్ది మంది అనుచరులతో కలిసి బయలుదేరినట్లు సమాచారం.
ప.గో జిల్లా యలమంచిలి మండలం చించినాడ గోదావరి వంతెనపై నుంచి రెండేళ్ల చిన్నారి సహా దంపతులు దూకి గల్లంతైన విషయం తెలిసిందే. కుటుంబ యజమాని బొంతు కిషోర్ మృతదేహాన్ని గురువారం సాయంత్రం గుర్తించారు. భార్య యోచన, కుమార్తె శ్రీనిధి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఆర్థిక సమస్యల కారణంగానే ఈ దంపతులు పాపతో సహా గోదావరిలో దూకినట్లు తెలుస్తోంది. భీమవరానికి చెందిన వీరు 3 నెలల కింద అమలాపురానికి జీవనోపాధి నిమిత్తం వెళ్లారు.
ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ బాలికల జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 14న నిర్వహించనున్నట్లు బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కె.కృష్ణారెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే బాలికల జట్టును ఏలూరు కస్తూరిబా బాలికల పాఠశాలలో ఉదయం 9 గంటలకు, బాలుర జట్టును తాడేపల్లిగూడెం కడకట్ల మునిసిపల్ హైస్కూల్ ఆవరణలో సాయంత్రం 4 గంటలకు ఎంపిక చేస్తామన్నారు.
ఈనెల 15న (సోమవారం) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమవరం రానున్నారు. ఆయన చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా భీమవరం చేరుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.
ఎన్నికల నేపధ్యంలో ఈవీఎం, వీవీపాట్స్ ర్యాండమైజేషన్ ప్రక్రియ రాజకీయ పార్టీల సమక్షంలో ఈనెల 12న (శుక్రవారం) నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ర్యాండమైజేషన్ నిర్వహణకు సంబంధిత అధికారులు, సిబ్బందికి విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. జిల్లాలోని 1743 పోలింగ్ స్టేషన్లకు 4184 బ్యాలెట్ యూనిట్లు, 4184 కంట్రోల్ యూనిట్లు, 4534 వీవీప్యాట్స్ సిద్ధం చేస్తున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.