India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజాగళం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం పాలకొల్లులోని S.కన్వెన్షన్‌లో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 30 మందిని మాత్రమే సమావేశానికి అనుమతించారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం, పాలకొల్లులో TDP అధినేత చంద్రబాబు పర్యటనతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ.. పార్టీ నాయకుల్లో జోష్ నింపుతూ ప్రసంగం సాగించారు. నరసాపురం MLA ముదునూరి ప్రసాదరాజు మహాముదురు, ఇసుక అక్రమరవాణా ద్వారా రూ.30 కోట్లు దోచేశారని ఆరోపించారు. పార్టీ శ్రేణులు నరసాపూర్ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోవాలని పిలుపునిచ్చారు. బాబు పర్యటన TDP విజయానికి తోడ్పడుతోందా.
– మీ కామెంట్..?
ఉండి నియోజకవర్గానికి 1952 నుంచి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. కాగా 1970లో జరిగిన ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన కె.ఆండాళమ్మ విజయం సాధించింది. నియోజకవర్గ చరిత్రలో ఆమె ఒక్కరే మహిళా MLAగా గెలిచి రికార్డు సొంతం చేసుకున్నారు. మరో విశేషం ఏంటంటే ఆమె ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలవగా ప్రత్యర్థిగా ఉన్న జి.ఎస్.రాజు సైతం ఇండిపెండెంట్‌గా ఉండటం విశేషం.
ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలోని ఓ మహిళతో అదే గ్రామానికి చెందిన ఆకుల సాయి కొద్దిరోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. ఇంటిచుట్టూ తిరుగుతూ వేధించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేయగా.. లైంగిక వేధింపులతో పాటు కుల దూషణ కేసు నమోదుచేసినట్లు ఎస్సై దుర్గా మహేశ్వరరావు తెలిపారు.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏ పార్టీలో చేరుతారనే ఉత్కంఠకు నేటితో తెరపడింది. పాలకొల్లు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. అయితే.. రఘురామ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? ఒకవేళ బరిలో ఉంటే లోక్‌సభకా..? అసెంబ్లీకా ..? అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. ‘కూటమి నుంచి పక్కా బరిలో ఉంటా. రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది’ అని అన్న రఘురామకు ఏ టికెట్ ఇస్తారో వేచి చూడాలి.
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామ శివారులో శుక్రవారం ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన స్కూల్ బస్సుగా స్థానికులు గుర్తించారు. ప్రమాద సమయంలో ఆ బస్సులో పిల్లలు ఉన్నారా..? లేరా..? అనే వివరాలేవి తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ప.గో జిల్లాలోని 7 నియోజకవర్గాలలో ఏడాదిగా ఓటర్ నమోదు కార్యక్రమాలను నిర్వహించగా.. 14,63,014 మంది కొత్తగా నమోదయ్యారని కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం తెలిపారు. గత ఎన్నికల్లోని పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే రూరల్‌లో ఎక్కువ శాతం, అర్బన్‌లో తక్కువ శాతం నమోదవుతూ వచ్చిందని అన్నారు. మే 13న ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
మిసెస్ ఇండియా పోటీల్లో ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన రుద్రరాజు ఛాయాదేవి సత్తా చాటారు. గత నెల 30న ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో జరిగిన ఈ పోటీల్లో మిసెస్ ఇండియా(క్లాసిక్)గా ఎంపికయ్యారు. ఈమె ప్రాథమిక విద్యాభ్యాసం అంతా గుండుగొలనులోనే సాగగా.. వివాహానంతరం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. MBA చదివిన ఛాయాదేవి ప్రస్తుతం శ్రీవిహారి సర్వీసెస్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఏలూరు జిల్లా బుట్టాయగూడేనికి చెందిన వైసీపీ ST సెల్ జిల్లాధ్యక్షుడు కొవ్వాసు నారాయణరావు అనారోగ్యంతో శుక్రవారం (నేటి) ఉదయం మరణించారు. ప్రస్తుతం అచ్చియ్యపాలెం సొసైటీ అధ్యక్షుడిగాను ఉన్నారు. గతంలో డీసీసీబీ డైరెక్టర్‌గా పనిచేశారు. పోలవరం వైసీపీ అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నించిన ఆశావహుల్లో ఈయన కూడా ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని ఏలూరు ఒకటో అదనపు జిల్లా జడ్జి జి.రామగోపాల్ తిరుపతి ఐదవ, ఫ్యామిలీ కోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. భీమవరం మూడో అడిషనల్ జిల్లా జడ్జిగా పనిచేస్తున్న పి.శ్రీసత్యదేవి స్పెషల్ సెషన్స్ జడ్జి ఎస్సీ, ఎస్టీ కోర్టు విశాఖపట్టణానికి బదిలీ అయ్యారు.
Sorry, no posts matched your criteria.