India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏలూరు జిల్లాలో వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చింతలపూడి మార్కెట్ యార్డ్ వెనుక రమేశ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. ఆయన మృతి చెంది వారం రోజులు అయినట్లు కుటుంబీకులు అభిప్రాయపడుతున్నారు. రమేశ్ చింతలపూడి జీబీజీ రోడ్‌లో సెలూన్ షాప్ నిర్వహిస్తున్నట్లు బంధువులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం నియోజకవర్గానికి 1955 నుంచి 2019 వరకు మొత్తం 16సార్లు ఎన్నికలు జరిగాయి. ఓ ఎన్నికలో కేవలం 24 ఓట్ల తేడాతో MLA పీఠం చేజిక్కింది. 1999లో టీడీపీ నుంచి పోటీ చేసిన వంకా శ్రీనివాసరావు.. కాంగ్రెస్‘ఐ’ అభ్యర్థి బి.దుర్గారావుపై 24 ఓట్ల అతి స్వల్ప మెజార్టీతో MLAగా గెలిచారు. 1955లో పి.కోదండరామయ్య(కాంగ్రెస్) ఎస్.అప్పారావు(సీపీఐ)పై 492 ఓట్ల మెజార్టీతో MLAగా ఎన్నికయ్యారు.

ప.గో జిల్లాలో ఓ రైతు లేగ దూడ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిపారు. పాలకోడేరు మండలం గోరగనమూడికి చెందిన రైతు పంపన రామకృష్ణకు చెందిన లేగ దూడ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఆయన గ్రామంలోని పెద్దలను పిలిచి వారి సమక్షంలో కేక్ కట్ చేశారు. వారందరికీ పంచి పెట్టారు. ఆవు దూడ నా బిడ్డ లాంటిదని రామకృష్ణ తెలిపారు. విస్సకోడేరు సర్పంచ్ బొల్ల శ్రీనివాస్, గొరగనమూడి మాజీ సర్పంచ్ పాపారావు తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఆదివారం అర్ధరాత్రి నాగేశ్వరరావు(60) అనే వ్యక్తిపై <<12964707>>యాసిడ్ దాడి<<>> జరిగిన విషయం తెలిసిందే. స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందాడు. భార్యను కాపురానికి పంపడం లేదని అల్లుడు హరీశ్ మామ నాగేశ్వరరావుపై యాసిడ్ పోసినట్లు తెలుస్తోంది. హరీశ్ పరారీలో ఉండగా.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఏలూరు జిల్లాలో ఓ వైద్యుడు మత్తు ఇంజక్షన్స్ ఇస్తూ చోరీలకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. చొదిమెళ్లకు చెందిన భానుసుందర్ MBBS చదివాడు. తపాలా శాఖలో రిటైర్డ్ ఉద్యోగి మల్లేశ్వరరావు(63)తో సన్నిహితంగా ఉండేవాడు. గత DEC 24న మల్లేశ్వరరావు ఇంట్లో ఉండగా.. భానుసుందర్ వెళ్లి మత్తు ఇంజక్షన్ ఇచ్చి డబ్బు, నగలతో ఉడాయించాడు. ఇలాంటి కేసులు ఆ వైద్యుడిపై చాలానే ఉండగా.. మల్లేశ్వరరావు మృతితో అతడి తతంగం బయటపడింది.

సీ-విజిల్ యాప్‌లో ఇప్పటివరకు అందిన 181 ఫిర్యాదులలో 95 ఫిర్యాదులను పరిష్కరించామని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. మరో 86 ఎన్నికలకు సంబంధం లేని ఫిర్యాదులు రాగా వాటిని తిరస్కరించామన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో మొత్తంగా రూ.81.76 లక్షల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులు సీజ్ చేశామన్నారు. జిల్లాలో నిరంతరంగా సర్వేలైన్స్ బృందాలు పనిచేస్తున్నాయన్నారు.

అభిమానాన్ని పెళ్లి కార్డుల రూపంలో చూపుడం ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. ప.గో జిల్లా ఆచంటలో ఓ యువకుడు TDPపై అభిమానాన్ని చాటుకున్నాడు. పెళ్లి కార్డుపై ‘ఓట్ ఫర్ టీడీపీ’ అంటూ ఆచంట నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఫొటోలు ముద్రించుకున్నాడు. కార్డు వెనుక వైపు ‘మన ఆచంట- మన పితాని’ అని రాసి ఉన్న ఈ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నరసాపురం సిట్టింగ్ MP రఘురామకృష్ణరాజు పోటీపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. కూటమి అభ్యర్థిగా నరసాపురం నుంచే పోటీ చేస్తానని ఆయన పలుమార్లు అన్నప్పటికీ బీజేపీ అధిష్ఠానం శ్రీనివాసవర్మ పేరు ప్రకటించింది. దీంతో RRR కేడర్ సందిగ్ధంలో పడింది. అయితే.. ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. నరసాపురం MPగా కాకుంటే ప.గో జిల్లాలో MLAగానైనా పోటీ చేస్తానని చెబుతున్నారు. దీంతో జిల్లాలో RRR సీటు పొలిటికల్ హీట్ పెంచుతోంది.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ మావోయిస్టును పోలీసులు పట్టుకున్నారు. గతంలో ఝార్ఖండ్‌కు చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా.. రాహుల్ కేసరి అనే మావోయిస్టు తప్పించుకున్నాడు. కొద్దిరోజులు అతడు HYDలో తలదాచుకొని, 15 రోజుల కింద భీమవరం వచ్చి వలస కార్మికులతో తాపీ పనులు చేస్తున్నాడు. ఫోన్ ఆధారంగా భీమవరం వచ్చిన ఝార్ఖండ్ పోలీసులు అతడిని వలపన్ని పట్టుకున్నారు.

ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం అయ్యప్పరాజు గూడెం గ్రామానికి చెందిన బండారు లక్ష్మణరావు (52) శనివారం రాత్రి విద్యుత్ షాక్‌కు గురై మరణించాడు. ధర్మాజీగూడెం పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.