India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప.గో. జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు మంగళవారం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరసాపురం నియోజకవర్గంలో జనసేన విజయానికి ముందుండి పార్టీ శ్రేణులను నడిపించాలని ఆయనను పవన్ కోరారు. అనంతరం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై కూలంకుశంగా చర్చించారు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా సీ-విజిల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. కాగా ఇప్పటివరకు ప.గో. జిల్లాలో 64 ఫిర్యాదులు వచ్చాయి. అత్యధికంగా దెందులూరు నియోజకవర్గంలో 17, ఏలూరులో 5, కైకలూరులో 8, నూజివీడులో 11, పోలవరంలో 13, ఉంగుటూరులో 10 ఫిర్యాదులు అందాయి. అందిన ఫిర్యాదులన్నింటినీ అధికారులు పరిష్కరించారు. యాప్‌ను ప్రజలు ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తాను అందించిన సేవలను అధిష్ఠానం గుర్తించి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చిందని ప్రవాసాంధ్రుడు కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మంగళవారం ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు నాయకులు అభినందించారు.

ఏలూరు జిల్లాలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. మొన్నటి వరకు టీడీపీ నుండి ఎంపీ టికెట్ ఆశించిన గోరుముచ్చు గోపాల్ యాదవ్ మంగళవారం వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. బీసీలకు సీఎం జగన్ న్యాయం చేశారని ఆయన తెలిపారు.

ప.గో. జిల్లా పాలకోడేరు మండలకేంద్రానికి చెందిన పి.దుర్గా సూర్యనారాయణ రాజు అదే గ్రామానికి చెందిన ఓ దివ్యాంగురాలిని (యువతి) నమ్మించి గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని అతడిని కోరగా అతను నిరాకరించినట్లు దివ్యాంగురాలి తల్లి పార్వతి తెలిపింది. పోలీసులకు ఫిర్యాదుచేయగా..సదరు వ్యక్తిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

టీడీపీ ఏలూరు పార్లమెంట్ టికెట్ ఆశించిన గోరుముచ్చు గోపాల్ యాదవ్ ఆ పార్టీని వీడి మంగళవారం వైసీపీలో మంగళవారం చేరారు. ఈ సందర్భంగా ఏలూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ గోరుముచ్చు గోపాల్ యాదవ్‌కు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఏలూరు పార్లమెంటు సీటు ఇవ్వకపోవడం కారణంగానే వైసీపీ పార్టీలో చేరినట్లు సమాచారం.

ఏలూరు జిల్లాలో ఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. చింతలపూడి మండలం కంచనగూడెం SGT మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో చంచంరాజు టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన నేపథ్యంలో అతడిని సస్పెండ్ చేసినట్లు విద్యాశాఖ జిల్లా అధికారి ఎస్.అబ్రహం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఎన్నికల నియమ నిబంధనలను అతిక్రమించరాదని ఆయన సూచించారు.

ఇంటి ఆవరణలో పార్కింగ్ చేసిన తన కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని పాలకొల్లుకు చెందిన బీజేపీ నాయకుడు రావూరి సుధ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 22న రాత్రి 11 గంటల సమయంలో ఇంటి వద్ద కారు పార్కింగ్ చేశామన్నారు. మరుసటిరోజు ఉదయం చూసేసరికి వెనుక భాగంలో అద్దం పూర్తిగా ధ్వంసమై ఉందన్నారు. పార్కింగ్ స్థలంలో వరుసగా కార్లు ఉన్నా తన కారునే టార్గెట్ చేసి ధ్వంసం చేశారన్నారు.

ఏలూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. పెదవేగి మండలం వేగివాడ సెంటర్‌లో సత్యనారాయణ అనే వ్యక్తికి చెందిన హోటల్‌కు సోమవారం కొందరు వచ్చి టిఫిన్ చేశారు. బిల్ మొత్తం రూ.150 కాగా.. వారు రూ.15 ఫోన్ పేలో చెల్లించి వెళ్లిపోయారు. దీంతో సత్యనారాయణ బైక్‌పై సోదరి, కుమార్తెతో వారివెంటే వెళ్లారు. తిరిగి వస్తుండగా చక్రాయగూడెం సమీపంలో కారు ఢీకొని సత్యనారాయణ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు రాస్తారోకో చేపట్టారు.

ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్-మోనిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి ముందస్తు ఆమోదం పొందాలని కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రసారం చేసే ప్రకటనలకు జిల్లా ఎంసీఎంసీ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుందన్నారు. పెయిడ్ న్యూస్, రాజకీయ ప్రకటనలను తనిఖీ చేసేందుకు జిల్లా స్థాయిలో ఎంసీఎంసీ కమిటీని నియమించామన్నారు.
Sorry, no posts matched your criteria.