India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోక్సో కేసులో ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లు ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఇటీవల తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించి పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాక్షులను విచారించి వాదనలు వినిపించారు. ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.3 లక్షల పరిహారం ఇవ్వాలని తీర్పు వెలవడినట్లు ఎస్పీ తెలిపారు.
ఏలూరు జిల్లా భీమడోలులో ఓ కి‘లేడీ’ని పోలీసులు అరెస్ట్ చేశారు. DSP శ్రావణ్ వివరాల ప్రకారం.. గుండుగొలనులోని YSR కాలనీకి చెందిన శ్రీదేవి విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో దొంగతనాల బాట పట్టింది. కాలనీలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతోంది. దీనిపై ఫిర్యాదులు అందగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. రూ 4,47,000/- విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఉమ్మడి ప.గో.లో వైసీపీ కీలక నేతలంతా రాజీనామాలు చేయడం ఆ పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే ఏలూరు జిల్లాలో మాజీ మంత్రి ఆళ్ల నాని, మేయర్ నూర్జహాన్ సహా 19 మంది కార్పొరేటర్ల రాజీనామా చేశారు. తాజాగా జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త ప్రసాదరావు సైతం రాజీనామా చేశారు. ఈ ఎఫెక్ట్ జిల్లా వైసీపీలో ఏ మేర ఉంటుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది. మీ కామెంట్..?
భార్యను చంపి ఆపై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉండి మండలం కలిగొట్లలో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన చిరంజీవికి భూపతి సత్యవతి(36)తో15 ఏళ్ల క్రితం పెళ్లైంది. భార్యపై అనుమానంతో తరచూ గొడవలు పడుతుండేవాడు. ఈ క్రమంలో భార్య నిద్రిస్తున్న సమయంలో ఆమె ముఖంపై దిండు వేసి హత్యచేసి బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం ఎలుకల మందు తాగాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మంకీ ఫాక్స్ అనుమానిత లక్షణాలతో ఈ నెల 2న తణుకు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వ్యక్తికి అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి అతనికి మంకీ పాక్స్ లేదని నిర్ధారించారని అత్తిలి PHC వైద్యాధికారి నాగరాజు గురువారం తెలిపారు. అతను చర్మ సంబంధితమైన వ్యాధితో ఇబ్బందులు పడుతున్నాడని, అది అంటు వ్యాధి కూడా కాదని వివరించారు.
భీమవరంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో బొక్కవారిపాలెంకు చెందిన బొక్క లక్ష్మీ శ్రీగణేశ్(13) మృతి చెందాడు. గణేశ్ సైకిల్‌పై మంచినీరు తెచ్చేందకు వెళ్తుండగా.. పాలకొల్లు వైపు నుంచి భీమవరం వస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. గణేశ్ తలపై నుంచి వ్యాన్ వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్ స్కూల్ బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
నరసాపురం మాజీ ఎమ్మెల్యే రుద్రరాజు సత్యనారాయణ రాజు(98) గురువారం మధ్యాహ్నం భీమవరం పట్టణంలో కన్నుమూశారు. 1967 లో సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి పరకాల శేషావతారంపై 4305 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన తుది శ్వాస విడిచే వరకు సీపీఎం లోనే ఉన్నారు. ఆయన స్వగ్రామమైన యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ప్రతి విద్యార్థి జీవితంలో ఒక గురువు ప్రభావం ఉంటుంది. విద్యార్థి భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఆ గురువు ఒక టార్చ్ బేరర్‌లా ఉంటాడు. అలాంటి గురువులను స్మరించుకునే ఈ రోజు గురుపూజోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రోజు పలువురు ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో సత్కరించనున్నారు. మరి మీ విద్యార్థి జీవితంలో మీకిష్టమైన ఉపాధ్యాయుడు ఎవరని భావిస్తున్నారో కామెంట్ చేయండి.
ఉండి మండలం కలుగొట్లలో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చిరంజీవి- సత్యవతి దంపతులు. అయితే కుటుంబ కలహాలతో బుధవారం రాత్రి రాడ్డుతో భార్య సత్యావతిపై చిరంజీవి దాడి చేశాడని తెలిపారు. అనంతరం చిరంజీవి పురుగుల మందు తాగడంతో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
గోదావరి వరదతో వేలేరుపాడు మండలములోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించేందుకు 15 మోటర్ బోట్లు, 30 ట్రాక్టర్లు ఏర్పాటు చేశామని ఆర్డీవో ఆదయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ముంపు ప్రజలను తరలించడానికి 24 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం, 20 మంది స్పెషల్ పార్టీ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి రెడీగా ఉన్నారన్నారు. మరింత సహాయార్థం టోల్ ఫ్రీ నెం. 8919936844 ఏర్పాటు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.