India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భద్రాచలం వద్ద గోదావరి 2వ ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ.. వరద ప్రభావం తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటువంటి ప్రాణనష్టానికి ఆస్కారం లేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పునరావాస, వైద్య శిబిరాల్లో అన్ని వసతులతో కూడిన సౌకర్యాలు ఉండాలన్నారు. ఫిర్యాదులకు తావు లేకుండా పనిచేయాలన్నారు.
భద్రాచలం వద్ద గోదావరి నదికి 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి కుక్కునూరు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. గోదావరి వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్నదని ప్రజలు తమ ఇళ్లను విడిచి పునరావాస కేంద్రాలకు రావాలన్నారు. అధికారులకు సహకరించాలని కోరారు. అనంతరం కుక్కునూరులో ఏర్పాటు చేసిన వైద్య కేంద్రాన్ని జేసీ పరిశీలించారు.
ఏలూరులోని డీఎల్టీసీ, సత్రంపాడు ఐటీఐ కళాశాలలో సెప్టెంబరు 10వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అధికారులు బుధవారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో 150 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీలలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు వారు అర్హులు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు జాబ్ మేళా ఉంటుందన్నారు.
మరో 2 రోజుల్లో అల్పపీడనం రూపంలో ప్రమాదం పొంచి ఉందని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను హెచ్చరించారు. బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గట్లు బలహీనంగా ఉన్న ప్రదేశాలను గుర్తించి పటిష్ఠ పరచడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఏఈలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు.
పశ్చిమ మధ్య బంగాళఖాతంలో రానున్న 24గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఆస్కారం ఉందని వివరించింది. ఈ క్రమంలో ఏలూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రతీరం వెంబడి 35-45 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు.
గోదావరి నీటిమట్టం మంగళవారం అనూహ్యంగా పెరిగింది. రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 40 అడుగులకు చేరింది. బుధవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నాయి. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి 4,56,011 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. స్పిల్‌వే ఎగువన 29.830 మీటర్లు, దిగువన 20.340 మీటర్ల నీటి మట్టం నమోదైనట్లు ఈఈలు మల్లికార్జునరావు, వెంకటరమణ తెలిపారు.
ఉమ్మడి ప.గో.జిల్లా స్థాయి క్రీడా జట్ల ఎంపిక పోటీల్లో భాగంగా 4న జరగాల్సిన ఎంపిక పోటీలను వర్షం, వరదల కారణంగా వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పెదవేగిలోని గురుకుల విద్యాలయంలో బాల, బాలికలకు సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్, అథ్లెటిక్స్, సెపక్ తక్రా, కుస్తీ పోటీలను వాయిదా వేశామన్నారు. మిగిలిన పోటీలను ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 6వ తేదీ నుంచి 21వ తేదీ సోమవారం వరకు యధాతథంగా జరుగుతాయన్నారు.
ఏలూరు జిల్లాలోని ముంపు మండలాల్లో (పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు) నేడు సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక మిగతా మండలాల్లో అవసరం మేర సెలవు ఇవ్వాలని MEOలకు, పాఠశాల హెచ్ఎంలకు డీఈవో అబ్రహం బుధవారం సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా పాఠశాలలు నడపడానికి, విద్యార్థులకు అసౌకర్యంగా ఉంటే మాత్రమే పాఠశాలలకు సెలవు ఇవ్వాలన్నారు. అవసరమైతేనే ఈ నిర్ణయం తీసుకోవాలన్నారు.
బాలికపై అఘాయిత్యానికి యత్నించిన నిందితుడిపై మంగళవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు నరసాపురం పట్టణ SI జయలక్ష్మి తెలిపారు. వివరాలు.. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి(50) తన ఇంటి ముందు ఆడుకుంటున్న బాలిక(9)ను ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు వేసే ప్రయత్నం చేశారు. ఆ బాలిక తప్పించుకొని ఇంటికి వెళ్లి తల్లితో చెప్పింది. దీంతో బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏలూరు జిల్లాలో ఇంతవరకు 26,398 మెట్రిక్ టన్నుల ఇసుకను వినియోగదారులకు అందించినట్లు మైనింగ్ డీడీ రవికుమార్ మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇసుక బుకింగ్ సెంటర్ల ద్వారా 1,825 మెట్రిక్ టన్నులు వినియోగదారులకు సరఫరా చేశామని అన్నారు. మొత్తం 133 ఆర్డర్లకు ఇసుక సరఫరా అయ్యిందన్నారు. వినియోగదారుల నుంచి 2 ఫిర్యాదులు రాగా.. వాటిని పరిష్కరించామని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.