WestGodavari

News July 21, 2024

ఏలూరు: వ్యక్తి దారుణ హత్య.. ఎందుకంటే..?

image

ద్వారకాతిరుమల మండలం ఐ.ఎస్.జగన్నాథపురానికి చెందిన పాతకోకల లాజరు అనే వ్యక్తి దారుణ <<13673804>>హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. జి.కొత్తపల్లికి చెందిన కొక్కిరపాటి సుబ్బారావుతో లాజర్ పెద్దకూతురిని ఇచ్చి వివాహం చేశారు. గొడవలు కాగా ఆమె తండ్రివద్దే ఉంటోంది. ఈ క్రమంలో కువైట్ వెళ్లాలని శుక్రవారం ఆమె బయలుదేరగా..విషయం తెలిసిన భర్త ఇంటికొచ్చి మామతో గొడవపడ్డాడు. ఇనుపరాడ్డుతో కొట్టి చంపాడు. కేసు నమోదైంది.

News July 21, 2024

ప.గో.: ఆందోళనలో ఆక్వా రైతులు

image

కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గి చేపలు, రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ లోటు ఏర్పడుతోంది. ఫలితంగా చేపలు, రొయ్యలు నీటిపై తేలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ప.గో. జిల్లాలో 2.6 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. చెరువుల్లో ఆక్సిజన్ శాతం పెంచడానికి ఏరియేటర్లు తిప్పడంతో పాటు మందులు వాడుతున్నారు. అదనపు ఖర్చులు అవుతున్నాయని వాపోతున్నారు.

News July 21, 2024

ప.గో.: వరద సహాయక చర్యలపై మంత్రి ఆరా

image

భారీ వర్షాలతో ముంపు బారిన పడిన ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ అధికారులను ఆదేశించారు. ప.గో.జిల్లాలో జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలపై కలెక్టర్‌ నాగరాణి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు.

News July 21, 2024

కామవరపుకోట: తండ్రిని హత్యచేసిన కొడుకు

image

కామవరపుకోట మండలం తడకలపూడి పంచాయతీ వేంపాడుకు చెందిన నాగబోయిన శ్రీనివాసరావు(50), కుమారుడు కార్తిక్‌తో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తండ్రి పేరిట ఉన్న రెండెకరాల పొలం అమ్మి.. తనకు సొమ్ము ఇవ్వాలని కార్తిక్ తరచూ గొడవ పడుతుండేవాడు. శనివారం ఇద్దరూ మరోమారు గొడవ పడ్డారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కొడుకు నేల పీటతో తండ్రి తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదైంది.

News July 21, 2024

ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ధాత్రి రెడ్డి

image

ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పి.ధాత్రి రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగానే పాడేరు సబ్‌కలెక్టర్‌గా పనిచేస్తున్న ధాత్రిరెడ్డి ఏలూరు జేసీగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ జేసీగా పనిచేస్తున్న బి.లావణ్యవేణి సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకురాలిగా నియమితులయ్యారు.

News July 21, 2024

22 వరకు అంగన్వాడీలకు సెలవు: జిల్లా పీడీ

image

భారీ వర్షాలు, వరదల కారణంగా ఏలూరు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు ఈనెల 22 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్టు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏలూరు జిల్లా పీడీ పద్మావతి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతలకు అవసరమైన అత్యవసర సేవలు అందించేందుకు అంగన్వాడీ కార్యకర్తలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవులు ఇస్తున్నామని పేర్కొన్నారు.

News July 21, 2024

ముంపు ప్రాంతంలో నేడు ఏలూరు ఎంపీ పర్యటన

image

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని వరద ప్రభావిత గ్రామాల్లో ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయ వర్గ ప్రతినిధులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 6 గంటలకు ఏలూరు నుంచి బయలుదేరి జంగారెడ్డిగూడెం చేరుకుంటారు. అక్కడి నుంచి 10 గంటలకు వేలేరుపాడు చేరుకుని ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తారు.

News July 21, 2024

నాట్లు వాయిదా వేసుకోండి: వ్యవసాయ అధికారి

image

నాట్లు వేయని రైతులు కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని ప.గో జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేశ్వరరావు సూచించారు. శనివారం ఉండి మండలంలోని పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. నారుమడులు దెబ్బతింటే తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంచుకొని మళ్లీ నారుమడులు వేసుకోవాలని సూచించారు.

News July 21, 2024

ఏలూరు జిల్లాలో NDRF బృందాలు

image

ప్రకృతి వైపరీత్యాల సమయంలో విపత్తు నివారణ దళం సేవలు ప్రముఖమైనవని ఏలూరు జిల్లా అధికారులు అన్నారు. తుఫానులు, వరదల సమయంలో ప్రాణ నష్టాలను నివారించడంలో వీరి పాత్ర కీలకమన్నారు. ప్రస్తుతం గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం కలుగకుండా వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు 2 NDRF బృందాలను పంపించినట్లు తెలిపారు.

News July 20, 2024

కే.ఆర్.పురం ఐటీడీఏ పీవోగా హరిత

image

కే.ఆర్.పురం ఐటీడీఏ పీఓ గా హరిత IAS నియమితులయ్యారు. 2018 IAS బ్యాచ్‌కు చెందిన హరిత గతంలో ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APUFIDC) మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం బదిలీపై ఏలూరు జిల్లా కే.ఆర్.పురం ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా రానున్నారు. హరిత స్వస్థలం చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని దామలచెరువు గ్రామం.