India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప.గో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒకటి నుంచి 19 ఏళ్ల వయసు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని దిశానిర్దేశం చేశారు.

భీమవరం కలెక్టరేట్‌లో పీఎం శ్రీ, మనబడి మన భవిష్యత్తు పథకాల పురోగతిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం సమీక్షించారు. విద్యా, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో మాట్లాడిన ఆమె.. జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక వసతుల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీల్లో భాగంగా ఐజీ అశోక్ కుమార్ పరిపాలన, రికార్డుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా మహిళా రక్షణ, పోక్సో, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు తీరును విశ్లేషించారు. నేరాల నియంత్రణకు రాత్రిపూట గస్తీని మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

భీమవరం పాత బస్టాండ్ వద్ద నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్‌ను గురువారం జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేదలకు రూ.5లకే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. క్యాంటీన్‌లోని భోజన పంపిణీ, తాగునీరు, సర్వింగ్ ప్రాంతాలను పరిశీలించిన ఆయన.. వాష్ ఏరియాను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు.

అప్సడ (APSADA) రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో రైతులను ఇబ్బంది పెట్టినా, అవినీతికి పాల్పడినా సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. అధికారులతో నిర్వహించిన గూగుల్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. రైతులను అనవసరంగా వీఆర్వోల వద్దకు పంపవద్దని ఆదేశించారు. విధి నిర్వహణలో పారదర్శకత ఉండాలని, రైతుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో అందే వీర వెంకట సత్య తాతారావు (56) గుండెపోటుతో బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. బుధవారం ఉదయం ఆసుపత్రికి వచ్చిన ఆయన ఆరోగ్యం బాగాలేదని ఈసీజీ తీయించుకొని కారులో తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో గుండెపోటు వచ్చింది. దీంతో తాతారావును తణుకు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

యనమదుర్రులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌ను జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన నాణ్యత, కొలతలు, ధరల ప్రదర్శనతో పాటు భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని, ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘనపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.

కాళ్ల(M) పెదమిరం క్యాంప్ కార్యాలయంలో శివరాత్రి ఉత్సవాలపై సంబంధిత అధికారులతో గూగుల్ మీట్‌ను బుధవారం కలెక్టర్ నాగరాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాలైన 2 ప్రముఖ పంచారామ క్షేత్రాలు భీమవరం సోమేశ్వర స్వామి, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయాలకు లక్షలాది సంఖ్యలో భక్తులు హాజరు అవుతారని, వారందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అని ఏర్పాట్లు చేయాలన్నారు.

తణుకు మండలం వేల్పూరు డంపింగ్ యార్డులో సుమారు 50 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, మృతదేహం మూడు రోజుల క్రితానిదిగా, పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉందని తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌ఛార్జ్ ఎస్ఐ జనా సతీష్ పేర్కొన్నారు.

జిల్లా కేంద్రం భీమవరంలో డయాలసిస్ కేంద్రం లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న సెంటర్‌ను తొలగించడంతో చికిత్స కోసం పాలకొల్లు, ఆకివీడు వెళ్లాల్సి వస్తోంది. దూర ప్రయాణం భారమై ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్నామని, వెంటనే పట్టణంలో తాత్కాలిక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.