India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాలిక(16)పై లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు నమోదుచేసినట్లు SI ప్రియ కుమార్ గురువారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలానికి చెందిన ఓ బాలిక ఈ నెల 23న అర్ధరాత్రి దాటిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో రవి అనే యువకుడు ఆమెను తన ఇంట్లోకి లాక్కెళ్లి లైంగికంగా వేధించాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదుచేశామన్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పురుషులు, స్త్రీల బీచ్ కబడ్డీ జట్ల ఎంపికలు ఈనెల 27 వీరవాసరంలోని మద్దాల రామకృష్ణమ్మ జడ్పీ హై స్కూల్‌లో జరగనున్నాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ సహాయక కార్యదర్శి పి.మల్లేశ్వరరావు తెలిపారు. ఈ ఎంపికలలో పాల్గొనే క్రీడాకారులు పురుషులు 85 కేజీల లోపు, స్త్రీలు 75 కేజీల లోపు ఉండాలని సూచించారు. ఒరిజినల్ ఆధార్ కార్డును వెంట తీసుకొని రావాలన్నారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 2,832 క్యూసెక్కుల గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు విడుదల చేసినట్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డీఈఈ పెద్దిరాజు గురువారం తెలిపారు. పట్టిసీమలో నీటిమట్టం 22.987 మీటర్లు నమోదు కాగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 8 పంపులు 8 మోటార్లతో నీటిని వదిలినట్టు వివరించారు. కృష్ణా డెల్టా, ఉమ్మడి పశ్చిమ డెల్టాల సాగునీటి అవసరాల నేపథ్యంలో నీరు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం సంక్షేమ వసతి గృహాల అత్యవసర మరమ్మతులపై ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మొత్తం 46 ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉండగా.. వాటిలో 35 వసతి గృహాలు ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరమ్మతులు చేపట్టుటకు సుమారు రూ.2.65 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి వరద ఉద్ధృతి గురువారం మధ్యాహ్నానికి 48 అడుగులకు చేరుకోవడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు లోతట్టు ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మండలాల్లోని అధికారులు, సంబంధిత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని 20 మండలాల పరిధిలోని 38 వేల ఎకరాల్లో పంట నీట మునిగినట్టు వ్యవసాయాధికారులు గుర్తించారు. రూ.41.51 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్టు అంచనా. 614 మంది రైతులు సాగు చేస్తున్న 500 ఎకరాల్లోని ఉద్యానవన పంటలకు రూ.4.06 కోట్లు నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. పొలాల్లోని ముంపునీరు తగ్గి క్షేత్ర స్థాయిలో పరిశీలన ప్రారంభమైతే పంట నష్టం మరింత పెరుగుతుందని రైతులు అంటున్నారు.
ఉద్యాన విశ్వవిద్యాలయం రెండేళ్ల హార్టీకల్చర్ డిప్లమా కోర్సుల ప్రవేశానికి ఈ నెల 26న హార్టీసెట్- 2024 పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు రాని వారు పరీక్షా కేంద్రం వద్ద ఐడీ ప్రూఫ్‌తో డూప్లికేట్ హాల్ టికెట్లు పొందవచ్చని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ శ్రీనివాసులు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు.
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి వలవల బాబ్జీ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఎర్రకాలువ ముంపు రైతాంగం దుస్థితిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారని బాబ్జీ తెలిపారు. రైతులు అధైర్య పడవద్దని సూచించారన్నారు. రవికుమార్, సత్యనారాయణ, శ్రీనివాస్ ఆయన వెంట ఉన్నారు.
ఏలూరు మండలం కొత్తూరులో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లుగా చలామణీ అవుతూ డబ్బులు వసూలు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. DSP శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. కర్రీ పాయింట్ నిర్వహిస్తున్న అప్పలనాయుడు వద్ద ఈ నెల 22న నలుగురు వ్యక్తులు రూ.10వేలు డిమాండ్ చేసి తీసుకున్నారు. తాజాగా విషయం వెలుగులోకి రాగా ముంగర వెంకట దుర్గ, బుక్కిరి దేవిప్రసాద్, అగ్గాల ఉమామహేశ్వరి, పులిగ రాంబాబులను రిమాండ్‌కు తరలించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ఢిల్లీలో జగన్ దొంగ దీక్షలు చేస్తున్నారని దెందులూరు MLA చింతమనేని ప్రభాకర్ రావు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ చేసిన అవినీతి, అరాచక పాలనను ప్రజలు తిరస్కరించడంతో జగన్ ఓర్వలేక శవ రాజకీయాలు చేస్తున్నాడన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు.
Sorry, no posts matched your criteria.