India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పశ్చిమగోదావరి జిల్లాలో 3 మండలాల్లో ముగ్గురు వ్యక్తులు విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. దేవరపల్లి మండలం యాదవోలు శివారులో యాదాల దిలీప్(30), నల్లజర్ల మండలం అయ్యవరంలో వెంకటేశ్వరరావు, ఉండ్రాజవరం మండలం కె.సావరంలో నాగేంద్ర మృతి చెందారు. దీంతో ఘటనా స్థలాలకు చేరుకున్న పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు చివరకు ఐదుగురే మిగిలారు. ఉపఎన్నికల్లో ఒక నామినేషన్ ఉపసంహరణ అనంతరం ఐదుగురు అభ్యర్థులు పోటీలో నిలిచినట్లు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ గురువారం తెలిపారు. 1.గంధం నారాయణరావు, 2.దీపక్ పులుగు, 3.నాగేశ్వరరావు కవల, 4.నామన వెంకట లక్ష్మీ, 5.బొర్రా గోపీ మూర్తి అభ్యర్థులు బరిలో నిలిచినట్లు చెప్పారు. 5న పోలింగ్, 9న ఓట్ల లెక్కింపు జరుగుతుందని వివరించారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన నేతలు తిరిగి ఆ పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా తాళ్లపూడి ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు గురువారం వైసీపీలోకి చేరారు. నిడదవోలు 28వ వార్డు కౌన్సెలర్ ఆకుల ముకుందరావు, 10వ వార్డు కౌన్సిలర్ అరుగోలను వెంకటేశ్వరరావు మళ్లీ పార్టీ అధినేత సమక్షంలో సొంత గూటికి చేరారు.
కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తండ్రి భూపతి రాజు సూర్యనారాయణ రాజు గురువారం మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఓ ప్రైవైట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారని కుటంబ సభ్యులు తెలిపారు. సూర్యనారాయణ రాజు మృతికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి, ముఖ్య నాయకులు, తదితరులు సంతాపం తెలిపారు.
పోలీసులకు ఏలూరులో ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఏలూరు రేంజ్ పరిధిలో ఆసక్తి ఉన్న పోలీసులు పాల్గొననున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం క్రీడా మైదానంలో కబడ్డీ తదితర పోటీలకు సంబంధించి సాధన చేస్తున్నారు. 22వ తేదీ శుక్రవారం స్పోర్ట్స్ మీట్ ప్రారంభం అవుతుంది.
జిల్లాలో డిసెంబర్, 5వ తేదీన నిర్వహించనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి చెప్పారు. గురువారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్‌తో కలిసి ఆమె సమీక్షించారు. డిసెంబర్ 5వ తేదీన జిల్లాలోని 20 పోలింగ్ కేంద్రాలలో పొలింగ్ జరుగుతుందన్నారు. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 9వ తేదీన వెలువడతాయని ఆమె తెలిపారు.
శాసనమండలిలో భూ సమస్యలపై తూ.గో, ప.గో జిల్లాల పట్టభధ్రుల MLC వెంకటేశ్వరరావు గళం వినిపించారు. ఆన్‌లైన్‌లో భూమి రకం, విస్తీర్ణాలు తప్పుల తడకగా చూపిస్తున్నాయని అన్నారు. అంతే కాకుండా తక్కువ భూమి ఉన్న వారికి ఎక్కువ భూమి చూపిస్తూ ఉండడంతో వారు సంక్షేమ పథకాలు కోల్పోతున్నారని ఆయన వివరించిన తీరు ఆకట్టుకుంది. రైతులు అధికారుల చుట్టూ తిరిగినా సమస్య తీరడం లేదన్నారు. దీనికి పరిష్కారం చూపాలని కోరారు.
అసెంబ్లీలో తాడేపల్లిగూడెం MLA బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో నేతలపై అక్రమ కేసుల పెట్టిన వ్యవహారంపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపించాలన్నారు. చంద్రబాబు నాయుడుని జైలులో పెట్టిన సమయంలో జైలులో సీసీ కెమెరాలు అమర్చి, వైసీపీకి చెందిన కీలక నేత ఆ వీడియోలు తన ఫోనులో చూసుకొనే విధంగా ఏర్పాట్లు చేశారని ఆరోపించారు. కారకులను శిక్షించాలని అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేశారు.
అరెస్ట్ భయంతో తిరుపతిలో సూర్యప్రభాశ్(20) ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జరిగింది. ఇతను ప.గో, ఏలూరులో దొంగతనాలు చేసి కేసులు నమోదవ్వగా తిరుపతికి పారిపోయాడు. లక్కవరం ఎస్సై రామకృష్ణ, జంగారెడ్డిగూడెం క్రైం ఏఎస్సై సంపత్ కుమార్ సిబ్బందితో తిరుపతికి వెళ్లారు. పోలీసులను గమనించి అతను గడియ పెట్టుకొని..అరెస్ట్ చేస్తారనే భయంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. రుయాకు తరలిస్తుండగా మృతి చెందాడు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో బుధవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడం జరిగిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన గవర్నర్ చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తామని హామీ ఇచ్చారని RRR తెలిపారు.
Sorry, no posts matched your criteria.