India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
CWC ఛైర్మన్ కుష్వీందర్ వోహ్రాను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఢిల్లీలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకి శాలువా కప్పి సత్కరించి జ్ఞాపికను అందించారు. అనంతరం అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల గురించి మాట్లాడారు. పోలవరం పూర్తి చేయడానికి సహకరించాలని కోరారు.
ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు మంత్రి నారా లోకేశ్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉండి నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రితో చర్చించారు.
పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్ర సాయం కోరేందుకు వెళ్లిన మంత్రి నిమ్మల రామానాయుడును ఢిల్లీ ఆంధ్రభవన్‌లో కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, పలువురు టీడీపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువా కప్పి సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు.
కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలంలోని పోచవరంలో జరిగిన ఓ ఘటన కన్నీళ్లు పెట్టించింది. భారీ వర్షాలకు గ్రామంలోని దళిత సామాజిక వర్గానికి చెందిన శ్మశానవాటిక వరదనీటిలో మునిగిపోయింది. మంగళవారం గ్రామంలోని దళితవాడలో ఓ వ్యక్తి చనిపోగా.. మృతదేహాన్ని ఖననం చేసేందుకు మృతుడి బంధువులు ఇబ్బందులు పడ్డారు. మోకాళ్ల లోతు వరద నీటిలోనే శ్మశాన వాటికకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది.
పశ్చిమగోదావరి జిల్లాలో వర్షపాత వివరాలను మంగళవారం అధికారులు వెల్లడించారు. తణుకు 1.0, పెంటపాడు, గణపవరం, ఆచంట 0.8, ఉండి 0. 6,అత్తిలి 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లా మిగిలిన మండలాలో వర్షపాతం నమోదు కాలేదు. మొత్తం జిల్లాలో 4.2వర్షపాతం నమోదయింది. జిల్లా సగటు వర్షపాతం 0.2 మిల్లీ మీటర్లు అని అధికారులు తెలిపారు.
నరసాపురం ఎంపీడీవో అదృశ్యమై ఎనిమిది రోజులు దాటినా ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా ఫలించడం లేదు. ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఇంకా జీవించే ఉన్నారా? అనే దానిపై స్పష్టత రానట్లు తెలుస్తోంది. . సోమవారం కూడా ఏలూరు కాలువను పూర్తిగా గాలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో జీవించి ఉండవచ్చనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.
అధికవర్షాలు, వరదలతో జిల్లా వ్యాప్తంగా 37,182 హెక్టార్లలో నారుమడులు, వరి నాట్లు దెబ్బతిన్నాయని పగో జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. 154.46 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందన్నారు. 424 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. 43 గ్రామాలపై ప్రభావం అధికంగా ఉందన్నారు. మూడు పట్టణాల పరిధిలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయని పేర్కొన్నారు. 14 గృహాలు, 66 రహదారులు దెబ్బతిన్నాయన్నారు.
ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ వెట్రిసెల్వి సోమవారం పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరదల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా 5 కేంద్ర, రాష్ట్ర విపత్తు నివారణ బృందాలు, 12 బోట్లు వివిధ ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్లు సైతం సిద్ధంగా ఉన్నాయని, ప్రజలంతా ధైర్యంగా ఉండాలన్నారు.
పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో గోస్తని నదికి ఆదివారం అర్ధరాత్రి పడిన గండిని అధికారులు సోమవారం సాయంత్రానికి పూడ్చి వేశారు. అర్ధరాత్రి నుంచి గండికి అడ్డుకట్టు వేయడానికి రైతులు, కూలీలు, అధికార యంత్రాంగం ఎంతో కష్టపడింది. గండి పడటంతో సుమారు 500 ఎకరాల పైచిలుకు పూర్తిగా జలమయమై చెరువులను తలపిస్తుంది. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని అధికారులు హామీ ఇచ్చారు.
పాలకొల్లు, ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణ పనులపై సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించారు. సోమవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు ఆమె మాట్లాడుతూ.. ఆగస్టు 5 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి పనులను పూర్తి చేయాలన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రుల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
Sorry, no posts matched your criteria.