India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భద్రాచలంలో నీటిమట్టం పెరిగిందని, రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయిన నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప.గో కలెక్టర్ CH.నాగరాణి సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్.. గోదావరి వరద పరిస్థితిపై సమీక్షించారు. భద్రాచలం నుంచి వదులుతున్న నీటితో వశిష్ట గోదావరి నీటిమట్టం గంట గంటకూ పెరుగుతుందన్నారు. ముంపు బాధితులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.
కాలువలో స్నానానికి దిగి వ్యక్తి గల్లంతైన ఘటన ప.గో జిల్లా యలమంచిలి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. యలమంచిలి లంక గ్రామానికి చెందిన పి.ఆనందరావు(43) సోమవారం మధ్యాహ్నం నక్కల కాలువ రేవులో స్నానానికి దిగి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న సిబ్బంది కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. నరసాపురం ఆర్డీవో అచ్యుత్ అంబరీష్, పాలకొల్లు ఫైర్ ఆఫీసర్ జానకీరామ్ పర్యవేక్షించారు.
ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వైసీపీ అధినేత జగన్‌ను <<13680466>>అసెంబ్లీలో<<>> పలకరించిన విషయం తెలిసిందే. అసెంబ్లీకి రోజూ రావాలని జగన్‌ను కోరానని రఘురామ తెలిపారు. ప్రతిపక్షం సభలో లేకపోతే బాగుండదని చెప్పానన్నారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారన్నారు.
గోదావరికి వరదలు, కొండ వాగులు విరుచుకుపడుతున్న దృష్ట్యా జిల్లా అధికారులు పోలవరం మండలానికి ప్రత్యేక పోలీసు బలగాలను పంపినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. ఏజెన్సీ గ్రామాల్లో కొండ వాగులు ప్రవహించే కాజ్‌వేల వద్ద, అఖండ గోదావరి కుడి గట్టు బలహీనంగా ఉన్న ప్రదేశాల్లో వారిని బందోబస్తుగా నియమిస్తామని చెప్పారు. వర్షాల నేపథ్యంలో శిథిలమైన పాఠశాల భవనాలు, పాత ఇళ్ల గురించి వివరాలు తెలుసుకుంటున్నామన్నారు.
అధిక వర్షాలు, వరదలపై జిల్లా యంత్రాగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఢిల్లీ నుంచి ఆయన కలెక్టర్ ప్రశాంతితో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. వర్షాలు, వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల వద్ద ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
మాజీ సీఎం వైఎస్.జగన్‌పై దెందులూరు MLA చింతమనేని ప్రభాకర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజలను మభ్యపెట్టేందుకు రాష్ట్రంలో జరగని హత్యలను జరిగినట్లుగా ఆరోపిస్తున్నారని, సొంత చిన్ననాన్నను హత్య చేసిన వ్యక్తిని వెనకేసుకొని సాగుతా ఉన్నావ’ని జగన్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ‘నీకు అర్హత లేదని ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశార’న్నారు.
నరసాపురం MPDO వెంకటరమణారావు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆయనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన కాల్స్, వారి ఖాతాలకు బదిలీ అయిన సొమ్ముపై పోలీసులు దృష్టిసారించారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పలుసార్లు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. సైబర్ నేరగాళ్ల బెదిరింపులతో MPDO నుంచి 2 దఫాల్లో మొత్తం రూ.3.2 లక్షలు వారి ఖాతాలకు జమ అయినట్లు సమాచారం. ఈ ముఠా చేతిలో ఇదేరీతిలో పలువురు మోసపోయినట్లు తెలుస్తోంది.
ప.గో. జిల్లా ఉండికి చెందిన సినీ సంగీత దర్శకుడు గడి సతీష్ బాబు (50) శనివారం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై మృతిచెందారు. కాగా ఈయన గతంలో భీమవరంలోని ఓ ఆర్కెస్ట్రా బృందంలో కీబోర్డు ప్లేయర్‌గా పనిచేశారు. 2001లో సంగీత దర్శకుడు మణిశంకర్ వద్ద శిష్యుడిగా చేరి బెంగుళూరులో స్థిరపడ్డారని ఆయన సోదరుడు నరేంద్ర తెలిపారు. 150కి పైగా చిత్రాలకు రీ- రికార్డింగ్ చేయడంతో పాటు 6 కన్నడ చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.
భారీ వర్షాలకు ఉమ్మడి ప.గో. జిల్లా అతలాకుతలం అవుతోంది. వరినాట్లు నీటమునగడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడికక్కడ కాలువలు, నదులు ఉద్ధృతంగా ప్రవహించడంతో పలుప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అధికారులు సహాయక చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా..
☛ జంగారెడ్డిగూడెంలోని ఎర్రకాలువ
☛ భీమవరంలోని యనమదుర్రు డ్రైన్
☛ గోపాలపురం మండలం కొవ్వూరుపాడు – సాగిపాడు గ్రామాల మధ్య అల్లిక కాలువలు ఉగ్రరూపం దాల్చాయి.
భారీ వర్షాలు, వరదల కారణంగా సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ‘మీకోసం’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. మండల, డివిజన్ స్థాయిలో జరగాల్సిన ‘మీ కోసం’ ప్రోగ్రాంను కూడా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని కలెక్టర్ కోరారు.
Sorry, no posts matched your criteria.