WestGodavari

News November 15, 2024

ప.గో: నేడు జిల్లాలో మోస్తరు వర్షాలు

image

అల్పపీడనం కారణంగా శుక్రవారం ఉమ్మడి ప.గో. జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే వరి కోతలు ముగించుకొని రోడ్లపై ధాన్యాం రాశులను రైతులను ఆరబెడుతున్నారు.
పంట చేతికి వచ్చే సమయం కావడంతో వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు భయాందోళన చెందుతున్నారు.

News November 15, 2024

ఏలూరు: భూసేకరణపై జిల్లా కలెక్టర్ సమీక్ష

image

ఏలూరు జిల్లాలో భూసేకరణ పనులను సంబంధిత ఆర్డీవోలు ఎప్పటికప్పుడు సంబంధిత తహశీల్దార్లతో సమీక్షించి వేగవంతం అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గురువారం జాతీయ రహదారులు, పరిశ్రమలు, ఫిషింగ్ ఔట్లెట్స్ ఏర్పాటు భూసేకరణ అంశాలపై ఆర్డీవోలు, తహశీల్దార్లు, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. భూసేకరణకు సంబంధించి కోర్టులలో ఉన్న కేసులు సత్వరమే పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.

News November 14, 2024

పేరుపాలెం బీచ్‌ను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌లు

image

లాల్ బహదూర్ శాస్త్రి ఐఏఎస్ ముస్సూరీకి చెందిన పదిమంది ట్రైనీ ఐఏఎస్‌లు గురువారం మొగల్తూరు మండలం బీచ్‌ను సందర్శించారు. వీరికి మొగల్తూరు మండల తహశీల్దార్ కిషోర్, ఎంపీడీవో, ఎంపీడీవో త్రిశూలపానీలు బీచ్ గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేరుపాలెం సముద్ర తీర ప్రాంతం పర్యాటకంగా ఎంతో రమ్యంగా ఉందని ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు.

News November 14, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో నేడు పెట్రోల్ , డీజిల్ ధరలు ఇలా

image

ఉమ్మడి ప.గో జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. గురువారం ఏలూరులో లీటరు పెట్రోల్ ధర రూ.109.97 ఉండగా డీజిల్ ధర రూ.97.76 ఉంది. అలాగే ప.గో జిల్లాలో డీజిల్ రూ.97.24 ఉండగా.. పెట్రోల్ ధర రూ.109.40 ఉంది.

News November 14, 2024

పెనుగొండ : కొండెక్కుతున్న ఉల్లి

image

ఉల్లిధర వినియోగదారులను కంటతడి పెట్టిస్తోంది. నెల నుంచి వారవారానికి ధర ఎగబడుతోంది. పెనుగొండ మార్కెట్‌లో ఉల్లి ధరలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పైగా కార్తీక మాసం కావడంతో ఈ వారం రోజుల్లోనే రూ. 70-80 కి చేరిందని వ్యాపారస్థులు చెబుతున్నారు. ఉల్లి దిగుమతి తగ్గడంతో ధరలు ఊపందుకున్నాయని అంటున్నారు.

News November 14, 2024

పెనుగొండ: ఏఆర్ కానిస్టేబుల్‌తో పాటు కుటుంబానికి జైలు శిక్ష

image

పెనుగొండకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ మహేంద్రకుమార్, అతని కుటుంబానికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. మహేంద్రకుమార్ భార్య చైతన్యను అదనపు కట్నం కోసం హింసిస్తూ ఉంటే అతని తల్లి, తండ్రి సహకరించేవారు. దీంతో 2020లో బాధితురాలు ఆచంట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం కోర్టు బుధవారం నిందితులకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.7 లక్షలు జరిమానా విధించి, ఆసొమ్మును చైతన్యకు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.

News November 14, 2024

ప్రతి బుధ, శనివారాల్లో సదరమ్ సర్టిఫికెట్లు జారీ: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో విభిన్న ప్రతిభావంతులను ఆదుకునేందుకు అధిక ప్రాధాన్యతనిస్తామని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ జిల్లాస్ధాయి కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. ప్రతి కార్యాలయంలో ఫిర్యాదుల పరిష్కార అధికారుల నియామకం జరుగుతుందన్నారు. అలాగే స్లాట్స్ ప్రకారం ప్రతి బుధ, శనివారాల్లో సదరమ్ సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు.

News November 13, 2024

ఎమ్మెల్సీ ఎన్నికలకు 20 పోలింగ్ కేంద్రాలు: కలెక్టర్

image

డిసెంబర్ 5న జరగనున్న ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు ఏలూరు జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం వివిధ రాజకీయ నాయకులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళి పాటించాలని కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుంచి 2659 మంది ఓటు హక్కు వియోగించుకోనున్నారు.

News November 13, 2024

ఏలూరు: బ్యాంకు అకౌంట్లో నుంచి రూ. 46.30 లక్షలు మాయం

image

ఏలూరు వాసి కె.శేషగిరి ప్రసాద్‌కు వచ్చిన ఒక్క ఫోన్ కాల్‌తో రూ.46.30 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుని కథనం..ఈనెల 8న తన అకౌంట్లోకి రూ.20 వేలు వచ్చాయి. కాసేపటికి ఓ వ్యక్తి ఫోన్ చేసి పొరపాటున వేశామని తిరిగి తనకు పంపాలన్నాడు. ఆయన మాటలు నమ్మిన శేషగిరి ఆ డబ్బును తిరిగి పంపాడు. ఈనెల10న ఖాతా చెక్ చేయగా రూ.46.30 లక్షలు కట్ అయినట్లు గుర్తించి, ఏలూరు 2 టౌన్ పోలీసులను ఆశ్రయించగా..వారు దర్యాప్తు చేపట్టామన్నారు.

News November 13, 2024

ప.గో: గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

image

57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్లను కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆవిష్కరించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లో ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించే వారోత్సవాలకు సంబంధించి గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా కేంద్ర గ్రంధాలయం సంస్థ కార్యదర్శి యం.శేఖర్ బాబు ఈ నెల 14వ తేదీన బాలల దినోత్సవంతో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.