India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని వరద ప్రభావిత గ్రామాల్లో ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయ వర్గ ప్రతినిధులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 6 గంటలకు ఏలూరు నుంచి బయలుదేరి జంగారెడ్డిగూడెం చేరుకుంటారు. అక్కడి నుంచి 10 గంటలకు వేలేరుపాడు చేరుకుని ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తారు.
నాట్లు వేయని రైతులు కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని ప.గో జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేశ్వరరావు సూచించారు. శనివారం ఉండి మండలంలోని పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. నారుమడులు దెబ్బతింటే తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంచుకొని మళ్లీ నారుమడులు వేసుకోవాలని సూచించారు.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో విపత్తు నివారణ దళం సేవలు ప్రముఖమైనవని ఏలూరు జిల్లా అధికారులు అన్నారు. తుఫానులు, వరదల సమయంలో ప్రాణ నష్టాలను నివారించడంలో వీరి పాత్ర కీలకమన్నారు. ప్రస్తుతం గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం కలుగకుండా వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు 2 NDRF బృందాలను పంపించినట్లు తెలిపారు.
కే.ఆర్.పురం ఐటీడీఏ పీఓ గా హరిత IAS నియమితులయ్యారు. 2018 IAS బ్యాచ్‌కు చెందిన హరిత గతంలో ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APUFIDC) మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం బదిలీపై ఏలూరు జిల్లా కే.ఆర్.పురం ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా రానున్నారు. హరిత స్వస్థలం చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని దామలచెరువు గ్రామం.
ఏపీలో 62 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ సీ.వీ ప్రవీణ్ ఆదిత్యను ఏపీ మారిటైమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నికల విధుల్లో భాగంగా ప్రవీణ్ ఆదిత్య ప.గో జిల్లాకు బదిలీపై వచ్చారు. ఎన్నికలు ముగియడంతో బదిలీల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ప.గో జిల్లా తణుకు మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న CH.శ్రీను(47) శనివారం మృతి చెందాడు. పైడిపర్రులోని శ్మశానం వద్ద విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీను కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వెంకటరావు డిమాండ్ చేశారు.
వర్జినియా పొగాకు ఆల్ టైం రికార్డ్ ధర పలికింది. గోపాలపురంలోని వేలం కేంద్రంలో శనివారం నిర్వహించిన కొనుగోళ్లలో కేజీ పొగాకు రూ.400 పలికింది. రోజురోజుకి ధర పెరుగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జంగారెడ్డిగూడెం-1, 2, కొయ్యలగూడెం వేలం కేంద్రాలలో కిలో పొగాకు రూ.399 పలికింది.
☞ నరసాపురంలో వ్యక్తిని కత్తితో నరికేసిన మహిళ
☞ వేలేరుపాడులో మంత్రి కొలుసు పర్యటన
☞ నిండుకుండలా ఎర్రకాలువ
☞ కామవరపుకోటలో వ్యక్తి అనుమానాస్పద మృతి
☞ చింతలపూడిలో పామాయిల్ తోట నేలమట్టం
☞ చాట్రాయిలో కౌలు రైతు ప్రాణం తీసిన కరెంట్
☞ నిడదవోలులో సగంవరకు మునిగిన ఇండ్లు
☞ ప.గో జిల్లాలో 22వరకు చేపల వేట నిషేధం
☞ ద్వారకాతిరుమలలో దారుణ హత్య
☞ కూటమి సర్కారుపై కొట్టు సత్యనారాయణ ఫైర్
ప.గో జిల్లా నరసాపురం మండలం వేములదీవిలోని సర్దుకొడప గ్రామంలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చినమైనవానిలంకకు చెందిన మైల చంద్రశేఖర్(38)ను సర్దుకొడపకు చెందిన మహిళ ఆమె ఇంటిలోనే కత్తితో తలపై నరికింది. చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా.. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చంద్రశేఖర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో సముద్రం అల్ల కల్లోలంగా మారింది. కెరటాలు ఎగసిపడుతున్నాయి. ప.గో. జిల్లాలోని చినలంక, పీఎం లంక, పేరుపాలెం, కేపీపాలెం వద్ద సముద్రం ఉద్ధృతంగా కనిపిస్తోంది. అల్పపీడనం హెచ్చరికతో మత్స్యశాఖ అధికారులు ఈ నెల 22 వరకు వేట నిషేధ ఆజ్ఞలు జారీ చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన బోట్లన్నీ తీరానికి చేరుకుంటున్నాయి. కొన్ని నరసాపురం వద్దకు రాగా మరికొన్ని అంతర్వేదిలో ఆగాయి.
Sorry, no posts matched your criteria.