India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నరసాపురం- డోన్‌ల మధ్య నడిచే ఎరిక్సన్ రైలును ఈ నెల 21 నుంచి పునరుద్ధరించనున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాక్ మరమ్మతు పనులు కారణంగా ఈ రైలు 3 నెలలుగా నిలిపివేశారు. 17282 నంబర్‌తో నరసాపురంలో ఉదయం 6 గంటలకు బయలుదేరి విజయవాడ- గుంటూరు మార్కాపురం, నంద్యాల మీదుగా రాత్రి 9 గంటలకు డోన్ చేరుకుంటుంది. జిల్లా నుంచి శ్రీశైలం వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐ.ఎస్.జగన్నాథపురం గ్రామంలో శనివారం దారుణం జరిగింది. పాతకోకల లాజరు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడు కొక్కిరిపాటి సుబ్బారావు హత్య చేసి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
5 రోజుల క్రితం కనిపించకుండా పోయిన నరసాపురం MPDO వెంకటరమణారావు ఆచూకీ ఇంకా దొరకలేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, పోలీసుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏలూరు కాలువ వద్ద ఆయన ఫోన్ సిగ్నల్ చివరగా కట్ అవడంతో కాలువను జల్లెడపడుతున్నా.. ఇంతవరకు ఆనవాళ్లు కనిపించలేదు. ఒకవేళ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటికే మృతదేహం తేలే అవకాశం ఉందని భావిస్తున్నారు. శుక్రవారం 50 మంది NDRF, SDRF బృందాలు కాలువలో గాలించారు.
ప.గో. జిల్లాకు చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం HYD వెళ్లింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తూ తన పిల్లలు బాలిక(11), బాలుడు(12)ని చదివిస్తోంది. 2018లో బాలికపై స్థానికుడు బ్రహ్మం(24) ఇంట్లోకి ప్రవేశించి బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. తాజాగా నిందితునికి పదేళ్ల జైలు, రూ.5లక్షలు ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది.
రైల్వే లైన్ల మరమ్మతుల్లో భాగంగా ఇటీవల నిలుపుదల చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 21 నుంచి నరసాపురం- గుంటూరు, 22 నుంచి గుంటూరు- నరసాపురం రైళ్లు యథావిధిగా నడుస్తాయని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున అన్ని పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు ప.గో., ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారులు నాగమణి, అబ్రహం ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు ఆర్వో చంద్రశేఖర్ బాబు చెప్పారు.
వర్షాలు తగ్గుముఖం పట్టడంతో జిల్లాలోని అన్ని గ్రామాలలో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఏలూరు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. వర్షాల కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధులకు గురికాకుండా 1450 తాగునీటి ట్యాంకులను శుభ్రపరచి స్వచ్ఛమైన నీరు అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఉన్న 1400 మంది క్లాప్ మిత్రాల సేవలను గ్రామాల్లో వినియోగిస్తున్నట్లు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టులో శుక్రవారం సాయంత్రం వరకు నమోదైన నీటిమట్టం వివరాలను ఈఈ పెద్దిరాజు 6 గంటలకు వెల్లడించారు. స్పిల్ వే ఎగువన 28.890 మీటర్లు, స్పిల్ వే దిగువన 19.250 మీటర్లు, కాపర్ డ్యామ్ ఎగువన 29.100 మీటర్లు, కాపర్ డ్యామ్ దిగువన 1.740 మీటర్లు, కాపర్ డ్యాముల మధ్య 18.820 మీటర్ల నీటిమట్టం నమోదయినట్లు ఈఈ ప్రకటించారు.
పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టరేట్ల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ప.గో కలెక్టర్ సి.నాగరాణి, ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఆదివారం సాధారణ సెలవు కావడంతో తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. SHARE IT..
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వానలకు ఏలూరు జిల్లా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యింది. పలు గ్రామాలు జలదిగ్భందమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ఉమ్మడి ప.గో జిల్లాకు హెచ్చరికలు జారీ చేసింది. శనివారం సైతం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. SHARE IT..
Sorry, no posts matched your criteria.