India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నరసాపురం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తూ అదృశ్యమైన ఎం. వెంకటరమణారావు కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్టు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు, గాలింపు చర్యలకు తన ప్రత్యక్ష పర్యవేక్షణలో నలుగురు డీఎస్పీలు, నలుగురు సీఐలు,15 మంది ఎస్ఐలు, 150 మంది సిబ్బంది పని చేస్తున్నారన్నారు. అదృశ్యమైన ఎంపీడీవో సమాచారాన్ని 94407 97400, 94406 27051, 94910 63910 నంబర్లకు తెలియజేయాలని కోరారు.
ప.గో జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని మత్స్య శాఖ సంయుక్త సంచాలకుడు ఆర్వీఎస్ ప్రసాద్ మత్స్యకారులకు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో సముద్ర అలలు ప్రమాదకరంగా ఉంటాయని తెలిపారు. తదుపరి ప్రకటన వెలువడే వరకూ చేపల వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు.
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు మున్సిపాలిటీ మంచినీటి సరఫరా విభాగ పథకంను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పాలనలో రాష్ట్రంలో తాగునీటి వ్యవస్థ విధ్వాంసానికి గురైందన్నారు. దాదాపు 56 మున్సిపాలిటీల్లో పనులు ప్రారంభంకాక కలుషిత నీటితో ప్రజలు అనారోగ్యం పాలయ్యారని తెలిపారు. తాగునీటి కోసం కేటాయించిన రూ.5,350 కోట్ల నిధులను దారి మళ్లించారని ఆరోపించారు.
ఏలూరు జిల్లాలో ప్రస్తుత వర్షాలు, రాబోయే 3 రోజుల్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు ఏపీఈపీడీసీఎల్ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలపై 94409 02926 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లాలో సమస్యల పరిష్కారానికి సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. SHARE IT..
పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం ఉదయం 8.30 గంటల నుంచి 5.30 వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. తాడేపల్లిగూడెం 95.8, పెంటపాడు 71.6, పాలకొల్లు 62.2, నరసాపురం 54.6, భీమవరం 50.4, ఉండి 48.2, ఇరగవరం 46.4, పాలకోడెరు 45.2, మొగల్తూరు 34.6, అత్తిలి 33.2, ఆకివీడు 33.0, పెనుగొండ 32.4, గణపవరం 31.6, వీరవాసరం 31.4మి.మీ వర్షపాతం నమోదైంది. 20 మండలాల్లో 831.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.
దహన సంస్కారాలకు డెడ్‌బాడీని తరలిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటన ప.గో జిల్లా పాలకోడేరు మండలం కొండేపూడిలో గురువారం జరిగింది. గ్రామంలో ఓ వృద్ధుడు మరణించగా, మృతదేహన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లే క్రమంలో కాలువ దాటాల్సి వచ్చింది. వర్షాలకు ఉద్ధృతంగా ఉన్న ఆ కాలువ మీదుగా నాటు పడవలో డెడ్‌బాడీ తీసుకెళ్తుంటే ఒక్కసారిగా అది బోల్తా పడింది. అందరూ క్షేమంగా బయటపడగా.. కాలువపై వంతెన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం నారాయణపురంలోని కట్ట మైసమ్మ గుడి వద్ద వరద భారీగా ప్రవహిస్తుంది. 5 కార్లు, 4 ఆటోలు, 10 బైకులు సహా దాదాపు 30 మంది ఆ వరదలో చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సహాయక చర్యల కోసం ఉన్నతాధికారులతో మాట్లాడి హెలికాప్టర్‌ను రప్పించారు. ఆ హెలికాప్టర్ సహాయంతో బయటకు తరలిస్తున్నారు.
వేలేరుపాడు మండలం మాధవరం వాగులో కారు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ముందుగా బాలుడు జగదీశ్ కుమార్ క్షేమంగా బయటపడ్డాడు. కొద్దిసేపటికే మిగతా నలుగురు రామారావు, జ్యోతి, కుందనకుమార్, సాయి జ్యోతి బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై CMO ఆరా తీసింది. అవసరమైతే హెలికాప్టర్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపాలని కలెక్టర్, జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వెంటనే ఆయన ఆచూకీ కనుక్కోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన అదృశ్యానికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఒక ఫోన్లో డిప్యూటీ సీఎంకు రాసిన లేఖను పంపారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆచంటలో వాడకంలో లేని చేతి పంపు బోరు నుంచి మంగళవారం వింత శబ్దాలు వచ్చిన విషయం తెలిసిందే. బుధవారం నిపుణుల సమక్షంలో దానికి మూత వేసి, ఇసుక, బ్యాలెట్ పౌడర్‌తో పూడ్చి వేశారు. వాడకంలో లేకపోవడం, ఈ భూమిలోపల హైడ్రో కార్బన్ వాయువు ఉండడంతో జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రక్రియను ఓఎన్‌జీసీ విపత్తుల నివారణ నరసాపురం ఇన్‌ఛార్జ్ రవి,అగ్నిమాపక అధికారి వైవీ జానకీరామ్ పర్యవేక్షించారు.
Sorry, no posts matched your criteria.