WestGodavari

News December 14, 2024

ఏలూరు DLTCలో 17న జాబ్ మేళా

image

ఏలూరు DLTC ఐటీఐ కాలేజీలో డిసెంబర్ 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు DLTC సహాయ సంచాలకులు ఎస్.ఉగాది రవి తెలిపారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. సుమారు 100 ఖాళీలకు ఈ జాబ్ ఫెయిర్ జరుగుతుందన్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డీగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు ఉన్న 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు. నిరుద్యోగులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News December 14, 2024

బియ్యం, కందిపప్పు, వంటనూనె ప్రత్యేక కౌంటర్లు కొనసాగించాలి: జేసీ

image

జిల్లాలో బియ్యం, కందిపప్పు, వంటనూనె ప్రత్యేక కౌంటర్లను మరికొంత కాలం కొనసాగించాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని వ్యాపార సంఘాలు, కిరాణా వ్యాపారస్తులతో నిత్యవసర సరుకుల ధరలపై సమీక్ష నిర్వహించారు. తణుకు పట్టణంలో ప్రత్యేక కౌంటర్‌లో మినప్పప్పు కూడా హోల్‌సేల్ ధరలకు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

News December 13, 2024

నరసాపురం: ‘డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్’

image

ఉన్నత న్యాయ స్థానాల ఆదేశాల మేరకు డిసెంబర్ 14వ తేదీన నరసాపురం కోర్ట్ సముదాయాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు నరసాపురం 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి. విజయదుర్గ తెలిపారు.ఈ మేరకు శుక్రవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఆయా కోర్టులలో ఉన్న రాజీపడతగిన అన్ని క్రిమినల్ కేసులు, కుటుంబ తగాదాలు, సివిల్ భూ తగాదాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద నష్ట పరిహార కేసులు మొదలగునవి రాజీ చేసుకోవచ్చన్నారు

News December 13, 2024

పోక్సో నేరస్థుడికి జీవిత ఖైదు: ఎస్పీ

image

దెందులూరుకు చెందిన ఆంథోనీ రాజ్ (51)కు జీవిత ఖైదు విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జ్ సునంద శుక్రవారం తీర్పునిచ్చారని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 2022 అక్టోబరు 8 న గ్రామానికి చెందిన ఓ బాలికపై సదరు నిందితుడు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు నేరం రుజు కావడంతో జీవిత ఖైదు తో పాటు రూ.5000 జరిమానా విధిస్తూ జడ్జ్ తీర్పునిచ్చారన్నారు.

News December 13, 2024

ఏలూరు: ‘1800 ఖాళీలకు జాబ్ మేళా’

image

నూజివీడు IIIT కాలేజీలో డిసెంబర్ 20న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి ఆఫీసర్ జితేంద్ర శుక్రవారం చెప్పారు. సంబంధించిన గోడపత్రికను మంత్రి పార్థసారథి ఆవిష్కరించారని, సుమారు 1800 ఖాళీలకు మంత్రి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు.10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డీగ్రీ, పీజీ, బీటెక్ వంటి విద్యార్హతలతో 18 నుండి 30 ఏళ్లు లోపు వారు ఏపీలో ఎక్కడి వారైనా జాబ్ మేళాకు హాజరు కావొచ్చన్నారు.

News December 13, 2024

ఉమ్మడి ప.గో. రైతులకు ఇది తెలుసా?

image

ప.గో.జిల్లాలో మామిడి, కొబ్బరి పంటకు ఇన్సూరెన్స్ ఉంటుందని మీకు తెలుసా? మామిడి ఎకరాకు రూ.2250 చెల్లిస్తే రూ.45 వేలు.. ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.3.50 కడితే రూ.900 చొప్పున PM ఫసల్ బీమా యోజన కింద రైతులకు పరిహారం అందిస్తారు. డిసెంబర్15 నుంచి మే31 మధ్యలో వర్షాలు, ఉష్ణోగ్రతల మార్పులతో పంటకు నష్టం జరిగితే పరిహారం వస్తుంది. ఆధార్, బ్యాంక్ పాసుబుక్, 1బీ పత్రాలతో డిసెంబర్ 15లోగా మీసేవలో నమోదు చేసుకోవాలి.

News December 13, 2024

నరసాపురం: నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్టర్‌ సస్పెండ్

image

వివాదాస్పద భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారనే అభియోగంపై నరసాపురం ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్టర్ ఎంవీటీ ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ గురువారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరులో ఉన్న ఓ భూమికి అడంగళ్ రికార్డులు లేకుండా కోర్టు వ్యవహారంలో ఉండగా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఫిర్యాదులు అందడంతో ప్రాథమిక దర్యాప్తు చేయగా.. ఈ మేరకు సస్పెండ్ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

News December 13, 2024

ప.గో జిల్లాలో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభం: కలెక్టర్

image

ప.గో జిల్లాలో శుక్రవారం నుంచి 2025 జనవరి 8 వరకు నిర్వహించే రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. షెడ్యూల్ ప్రకారం.. భీమవరం డివిజన్‌లో 119, నరసాపురం డివిజన్ 111, తాడేపల్లిగూడెం డివిజన్‌లో 90 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయన్నారు. వీటిలో డివిజన్ల వారీగా భీమవరం 6, నరసాపురం 12, తాడేపల్లిగూడెంలో 7 సదస్సులు ప్రారంభిస్తున్నామన్నారు.

News December 13, 2024

ఏలూరు జిల్లా వ్యాప్తంగా 96 అర్జీల పరిష్కారం: జేసీ

image

ఏలూరు జిల్లాలో గత రెండు రోజుల్లో నిర్వహించిన 64 గ్రామ రెవిన్యూ సదస్సుల్లో 854 అర్జీలు రాగా వాటిలో అక్కడికక్కడే 96 అర్జీలు పరిష్కరించామని జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి తెలిపారు. గురువారం జరిగిన సదస్సులకు 487 అర్జీలు రాగా 71అర్జీలు పరిష్కరించామన్నారు. వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 12, 2024

వైసీపీకి భీమవరం మాజీ MLA రాజీనామా?

image

ప.గో జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలినట్లు సమాచారం. భీమవరం మాజీ MLA గ్రంధి శ్రీనివాస్ ఆ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఓటమి నుంచి పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నారు. అయితే ఆయన భవిష్యత్ కార్యాచరణ తెలియాల్సి ఉంది.