India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు జిల్లా నూజివీడు మండలం బోర్వంచకు చెందిన సతీష్ కుమార్ (29) ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. కొద్దిరోజుల క్రితం రెడ్డిగూడెం మండలానికి చెందిన ఓ యువతి పరిచయమైంది. కాగా ఈ నెల 13న ఉరేసుకొన్నాడు. అంత్యక్రియల తర్వాత సతీష్- యువతి చాటింగ్ వెలుగులోకి వచ్చింది. కుమారుడి మృతికి యువతి, శ్రీకాంత్, మల్లికార్జున రెడ్డి వేధింపులే కారణమని తల్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో మృతదేహం వెలికితీసి పంచనామా నిర్వహించారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రూప్‌చంద్, శీలావతి చేపల రేట్లు పెరగడంతో చేపల మార్కెట్లు కళకళలాడుతున్నాయి. సాధారణంగా కేజీ రూప్‌చంద్ చేపల పెంపకానికి రైతుకు అన్నీ కలిపి రూ.90 నుంచి రూ.95 వరకు ఖర్చవుతుంది. మార్కెట్‌లో ధర పెరగడంతో కేజీ చేప ధర రూ.114 పలుకుతోంది. దీంతో రూ.15 నుంచి రూ.20 గిట్టుబాటు అవుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ఫిర్యాదులకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక గోదావరి సమావేశ మందిరంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జిదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
ఏలూరు జిల్లాలో అర్హత కలిగిన ఉపాధ్యాయులు జాతీయ అవార్డులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచినట్లు విద్యాశాఖ అధికారి అబ్రహం తెలిపారు. http://natioonlawardstoteachers.education.gov.in వెబ్‌సైట్ నందు అప్లికేషన్స్ పొందుపరిచామన్నారు. ఆగస్టు 18 వరకు అవకాశం ఉందని తెలిపారు. SHARE IT..
పదో తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. భీమవరం డివిజన్‌లో 66, ఏలూరు డివిజన్‌లో 48 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం-రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం-రూ.10 వేలు+అలవెన్సులు ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
☞ SHARE IT..
ఏలూరు జిల్లాలో ఘోరం జరిగింది. లింగపాలెం మండలం పాశ్చానగరంలో CRPF కానిస్టేబుల్ సీహెచ్.బాలాజీ 2 నెలల పసిబాబును హతమార్చాడు. పాత కేసు విషయంలో సోమవారం ఏలూరు కోర్టుకు వచ్చిన బాలాజీ.. అక్కడ భార్య, ఆమె తండ్రిని చితకబాదాడు. అనంతరం పాశ్చానగరంలోని ఇంటికెళ్లి మరదలు, అత్తను తీవ్రంగా కొట్టి, మరదలి 2 నెలల బాబు పీక నులుమి చంపాడు. దీంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. ధర్మాజీగూడెం పోలీసులు కేసు నమోదు చేశారు.
ప.గో.జిల్లా తాడేపల్లిగూడెం వాసి సత్యశ్రీనివాస్ బర్త్‌డే సందర్భంగా తల్లిదండ్రులు, సోదరితో కలిసి ద్వారకాతిరుమలకు దర్శనానికి కారులో వెళ్లారు. తిరిగి వస్తుండగా నల్లజర్ల మండలం అచ్చన్నపాలెంలో మూవీ చూశారు. సోదరిని అత్తవారింట్లో దించి వస్తానని వారిని అక్కడే ఉండమని చెప్పాడు. ఈ క్రమంలో తల్లి సుబ్బలక్ష్మి, తండ్రి బసవరాజు రోడ్డు దాడుతుండగా వారిని కారు ఢీకొంది. ఆసుపత్రికి తరలిస్తుండగా సుబ్బలక్ష్మి చనిపోయింది.
మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో ఆదివారం పురుషోత్తం(19) అనే యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. ఆ యువకుడి ఫొటో బయటకు వచ్చింది. స్నేహితులతో సరదాగా సముద్రం వద్దకు వెళ్లిన పురుషోత్తం నీటిలో గల్లంతవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
భీమవరంలో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద వరద నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. పట్టణంలోని డిమార్ట్ సమీపంలో, బస్టాండ్ ప్రాంతం, మెంటేవారితోట ప్రాంతాల్లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్‌ల ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో 2 అడుగుల మేర నీరు నిలిచిపోతుంటుందని, నడిచి వెళ్లే అవకాశం కూడా ఉండదని వాపోతున్నారు.
ఏలూరు జిల్లా దెందులూరు మండలం ముప్పవరం శివారులోని ఫ్యాక్టరీలో ఆదివారం ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు మాంజీ(24) భార్యపై అనుమానంతో ఫ్యాక్టరీలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మాంజీ స్వస్థలం బిహార్‌లోని గాయ్‌ఘాట్.
Sorry, no posts matched your criteria.