India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప.గో జిల్లా పెనుగొండలో వెలిసిన వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సాలూరి కోటేశ్వరరావు (కోటి) ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం కోటిని సన్మానించారు. అమ్మవారి ప్రసాదం, ఫొటో అందజేశారు.
ప.గో జిల్లా మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్‌కు ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు విచ్చేశారు. ఒక పక్క చిరు జల్లులు పడ్డా వాటిని లెక్క చేయకుండా కుటుంబ సభ్యులతో కలిసి సందడిగా గడిపారు. సముద్ర స్నానాలు చేసి ఇసుక తిన్నెలపై ఆడుకుంటూ కనిపించారు.
ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఏలూరు జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఏలూరు మండలం కొత్తూరు ఇందిరమ్మ కాలనీకు చెందిన రాజు విహారి (32) భార్య ఏడాది క్రితం అతణ్ని వదిలేసి వెళ్లిపోయింది. మనస్తాపంతో రాజు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మంటలతోనే కొంతదూరం నడిచి బంధువుల ఇంటి వద్ద పడిపోయాడు. విజయవాడ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ తనయుడి పెళ్లికి డిప్యూటీ సీఎం, పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీతో పవన్ చర్చించారు. సంబంధిత ఫొటోలను జనసేన ‘X’లో పోస్ట్ చేసింది.
ఏలూరు ఆశ్రం ఆసుపత్రి స్థాపించి నేటికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పేదలకు ఏడాది పాటు ఉచిత వైద్య సేవలు అందించనున్నామని డైరెక్టర్ గోకరాజు రతీదేవి చెప్పారు. ఉమ్మడి ప.గో.జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే 100 ఉచిత శస్త్ర చికిత్సలు, మరో 100 ఉచిత డెలివరీలు నిర్వహిస్తామన్నారు.
చెట్టుకొమ్మ విరిగిపడి మహిళ మృతిచెందిన ఘటన జంగారెడ్డిగూడెంలో జరిగింది. SI జ్యోతిబసు తెలిపిన వివరాలు.. స్థానిక రాజీవ్ నగర్‌కు చెందిన గుత్తుల వీరమణి (54) శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వస్తున్న క్రమంలో రోడ్డుపక్కన ఉన్న జామాయిల్ చెట్టుకొమ్మ విరిగి ఆమెపై పడింది. తొలుత స్థానిక ప్రాంతీయాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. కేసు నమోదైంది.
ఉమ్మడి ప.గో జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తమ కుమార్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించినట్లు ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలు, సాక్షుల విచారణ, ఖైదీలను ఆన్‌లైన్ ద్వారా ప్రవేశపెట్టడం, యన్- స్టెప్ ద్వారా సమన్లు అమలు చేయడం మొదలైన విషయాలపై సూచనలు చేశారన్నారు.
ఏలూరు టీడీపీ కార్యాలయంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విద్యుత్ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఏలూరు కేంద్రంగా పరిశ్రమల జోన్ వస్తుందని, దానికి కావాల్సిన విద్యుత్ ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. జిల్లాలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు.
పెరవలి మండలం ఖండవల్లిలోని పౌల్ట్రీ వద్ద చెట్టు విరిగి పడటంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చాగల్లుకు చెందిన కువలేశ్ ఇరగవరం మండలం పేకేరులోని బంధువుల ఇంటికెళ్లాడు. తిరిగి బైక్‌పై ఇంటికి వస్తుండగా ఖండవల్లి వద్ద చెట్టు విరిగి అతడిపై పడింది. తలకు తీవ్ర గాయాలైన కువలేశ్‌ను తణుకు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప.గో, ఏలూరు జిల్లాల ఎస్పీలు అజిత వేజెండ్ల, మేరీ ప్రశాంతి బదిలీ అయ్యారు. కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్న ఆద్నాన్ నయీం అస్మీ పశ్చిమ గోదావరి జిల్లాకు.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ASPగా ఉన్న ప్రతాప్ శివకిషోర్ ఏలూరు ఎస్పీగా నియమితులయ్యారు. కాగా.. ప.గో ఎస్పీ అజిత వేజెండ్ల విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్-1గా వెళ్తున్నారు.
Sorry, no posts matched your criteria.