WestGodavari

News June 10, 2024

అప్పుడు కృష్ణంరాజు.. ఇప్పుడు భూపతిరాజు

image

నరసాపురం MPగా తొలిసారి ఎన్నికైన భూపతిరాజు శ్రీనివాసవర్మను కేంద్ర మంత్రి పదవి వరించింది. ఈ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. సినీ నటుడు కృష్ణంరాజు(BJP) తొలిసారి కాకినాడ MPగా గెలవగా.. 1999లో నరసాపురం నుంచి గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. పాలకొల్లుకు చెందిన దర్శకుడు దాసరి నారాయణరావు, మొగల్తూరుకు చెందిన మెగాస్టార్ చిరంజీవి, నరసాపురం కోడలు నిర్మలా సీతారామన్ రాజ్యసభ నుంచి ఎన్నికై కేంద్ర మంత్రిగా చేశారు.

News June 10, 2024

నేడే ‘కల్కి’ ట్రైలర్.. ప.గో జిల్లాలో థియేటర్లు ఇవే

image

ప్రభాస్‌ అభిమానులు‌ ఎంతో‌ ఆతృతగా ఎదురుచూస్తోన్న ‘కల్కి 2898-AD’ ట్రైలర్‌ నేడు విడుదలకానుంది. ఉమ్మడి ప.గో జిల్లా అభిమానుల కోసం పలు థియేటర్లలో‌ సోమవారం 6PMకు ట్రైలర్‌ విడుదల చేస్తున్నారు. భీమవరం-విజయలక్ష్మి, ఏలూరు-శ్రీ బాలాజీ, తణుకు-లక్ష్మీ, తాడెపల్లిగూడెం-లక్ష్మీనారాయణ, నరసాపురం- శ్రీ రాజరాజేశ్వరి, జంగారెడ్డిగూడెం- రాజరాజేశ్వరి థియేటర్‌లలో‌ ట్రైలర్‌ స్కీనింగ్ చేస్తారు. SHARE IT..

News June 9, 2024

ప్రశాంతంగా ముగిసిన లాసెట్ ఎగ్జామ్

image

రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశానికి గానూ నిర్వహించే లాసెట్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం శ్రీవాసవి ఇంజినీరింగ్ కళాశాలలో 250 మందికి గానూ 205 మంది పరీక్షకు హాజరైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రత్నాకరరావు తెలిపారు. పరీక్షా కేంద్రం కో-ఆర్డినేటర్ నటరాజ్, సిస్టమ్ అడ్మిన్ సురేష్ పరీక్షా నిర్వహణను పర్యవేక్షించారు.

News June 9, 2024

నరసాపురం MP భూపతిరాజు శ్రీనివాసవర్మ నేపథ్యం

image

భూపతిరాజు శ్రీనివాసవర్మ 1967లో భీమవరంలో జన్మించారు. తండ్రి సూర్యనారాయణరాజు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఈయన BJYM జిల్లా అధ్యక్షుడు(1991-95), BJP ప.గో జిల్లా సెక్రెటరీ(1997-99), నరసాపురం పార్లమెంట్ కన్వీనర్(1999-2001), BJP నేషనల్ కౌన్సిలర్ మెంబర్(2001-03)గా చేశారు. 2009లో ఎంపీగా పోటీ, బీజేపీ ఉమ్మడి ప.గో జిల్లా అధ్యక్షుడు(2010-18), 2020 నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.

News June 9, 2024

లింగపాలెం: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

మండలంలోని బోగోలు గ్రామంలో ఆదివారం ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్‌గా స్థానికులు గుర్తించారు. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 9, 2024

నూజివీడులో సర్పంచ్ అనుమానాస్పద మృతి

image

మండలంలోని తూర్పు దిగవల్లి సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతిచెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..‌ సుమారు రూ.30 కోట్ల వరకు ఎన్నికల బెట్టింగ్ కట్టాడని, అనంతరం కనిపించకుండా పోయాడని అన్నారు. నేడు మల్బరీ షెడ్‌లో అనుమానస్పదస్థితిలో శవమై కనిపించినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు అనుమానస్పదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 9, 2024

జీలుగుమిల్లి: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

మండలంలోని ధర్భగూడెం గ్రామంలో వీర భద్రస్వామి అనే వ్యక్తి ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ చంద్రశేఖర్ మృతుని వివరాలను సేకరిస్తున్నారు. అనుమానాస్పద స్థితి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం తరలించారు. 

News June 9, 2024

వీరవాసరంలో యువతి మిస్సింగ్.. కేసు నమోదు

image

మండలంలోని బలుసు గొయ్యపాలెం గ్రామానికి చెందిన సిరి సుష్మ శనివారం నుంచి కనబడడం లేదని ఆమె తండ్రి సువర్ణ రాజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సుష్మ శనివారం సాయంత్రం నుంచి కనకబడకపోవడంతో వారి బంధువులు, స్నేహితుల వద్ద కూడా లేదని ఫిర్యాదు చేశారన్నారు. అనంతరం ఘటనపై మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. 

News June 9, 2024

వీరవాసరంలో యువతి మిస్సింగ్.. కేసు నమోదు

image

మండలంలోని బలుసు గొయ్యపాలెం గ్రామానికి చెందిన సిరి సుష్మ శనివారం నుంచి కనబడడం లేదని ఆమె తండ్రి సువర్ణ రాజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సుష్మ శనివారం సాయంత్రం నుంచి కనకబడకపోవడంతో వారి బంధువులు, స్నేహితుల వద్ద కూడా లేదని ఫిర్యాదు చేశారన్నారు. అనంతరం ఘటనపై మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. 

News June 9, 2024

మొగల్తూరు: మురుగు కాలువలో మృతదేహం లభ్యం

image

పట్టణంలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతిపై శనివారం కేసు చేశామని ఎస్సై వెంకటరమణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మొగల్తూరుకు చెందిన  పాపయ్య(47) ఆ గ్రామానికి చెందిన ఓ రైతుకు మంగళగుంటపాలెంలో ఉన్న చెరువులో పని చేసేందుకు ఈ నెల 6న వెళ్లారు. ఆ రోజు నుంచి ఇంటికి తిరిగి రాలేదు. ఆయన ఆచూకీ కోసం గాలిస్తుండగా.. మంగళగుంటపాలెం సమీపంలోని మురుగు కాలువలో ఈ నెల 8న మృతదేహం లభ్యమైంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు.