India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పొగాకు, కొబ్బరికి బోర్డులు ఉన్నట్లుగా, పామాయిల్ బోర్డు ఏర్పాటుకు కృషిచేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఏలూరులో వరి, పామాయిల్ రైతులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పామాయిల్‌కు బేసిక్ ధరగా రూ.17,000 నిర్ణయించమని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుదామన్నారు. ఆ ధర నుంచి ఏటా మరింత పెంచేలా ప్రయత్నిస్తానన్నారు.
తల్లికి వందనం పథకం కింద టీడీపీ ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేలు చొప్పుల తల్లుల ఖాతాలో జమచేయనుంది. దారిద్ర్య రేఖ దిగువన ఉండి, 1 నుంచి 12 తరగతి చదువుతున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో 2.42లక్షల మందికి ఈ సొమ్ము అందనున్నట్లు డిఈవో జి.నాగమణి తెలిపారు.
సముద్ర తీర మండలాల్లోని మత్స్యకారులకు వేట నిషేధ భృతి అందని ద్రాక్షగా మారింది. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు రెండు నెలలపాటు సముద్రంలో వేట నిషేధం అమలులో ఉంటుంది. ఈ కాలంలో మత్స్యకారుల ఉపాధి నిమిత్తం ప్రభుత్వం నెలకు రూ.10 వేలు చొప్పున రెండు నెలలకు రూ.20 వేలు ఇవ్వాలి. వేట నిషేధ గడువు ముగిసినా భృతి అందకపోవడంతో సొమ్ముల కోసం వీరంతా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గాలంకి శ్యామ్ యాక్సిడెంట్‌లో మృతి చెందాడు. అతని తల్లితో కలిసి విజయవాడలోని తన సోదరిని చూసేందుకు వెళ్తుండగా మృత్యువు కబలించింది. ప్రమాదంలో మృతుని తల్లి నాగమణికి తీవ్ర గాయాలయ్యాయి. శ్యామ్ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(SEB)లో పని చేస్తున్నాడు. కృష్ణా జిల్లా పెదఅవుటుపల్లి వద్ద వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో మృతి చెందారు.
పాలకొల్లులో గురువారం సాయంత్రం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆయన కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా టిడ్కో ఇళ్ల కాలనీలో మౌలిక సమస్యలు, బొండాడ వెంకటరాజు గుప్తా, ఎన్టీఆర్ కళాక్షేత్రం, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, హెల్త్ పార్క్, హిందూ స్మశానవాటిక పనులపై ఆరా తీశారు.
దేశానికి విశేష సేవలు అందించి రిటైర్డ్ అయ్యి భీమవరం తిరిగి వచ్చిన జావాన్ దాసరి దుర్గా రమేశ్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జవాన్ రమేశ్ MRO కార్యాలయంలోని క్విట్ ఇండియా స్తూపం వద్ద నివాళులర్పించారు. 2001 నుంచి 2024 వరకు జమ్మూ-కశ్మీర్, రాజస్థాన్, హిమాచల్ బార్డర్‌లో ఎన్‌సీవో హెడ్‌గా దేశ రక్షణలో సేవలందించిన ఆయన.. తిరిగి భీమవరం చేరుకున్నారు.
ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా గురువారం రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. ఆన్‌లైన్ సేవల్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖలో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దీంతో క్రయ, విక్రయదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. గురువారం మంచి రోజు రావడంతో పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. శుక్రవారం సెంటిమెంట్‌తో పాటు శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ఇబ్బందులు తప్పేలాలేవు.
ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలోని తేలప్రోలు రైల్వే గేటు సమీపంలో గురువారం ఓ వ్యక్తి రైలులోంచి జారిపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే SI నరసింహారావు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో భద్రపరిచి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గాలంకి శ్యామ్ యాక్సిడెంట్‌లో మృతి చెందాడు. మహిళకు తీవ్ర గాయాలు కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉంది. శ్యామ్ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(SEB)లో పని చేస్తున్నాడు. ఆయన ఏలూరు నుంచి విజయవాడకు బైక్‌పై వెళ్తుండగా.. కృష్ణా జిల్లా పెదఅవుటుపల్లి వద్ద వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భారతీయ రైల్వే సంస్థ (ఐఆర్సీటీసీ) దేశంలోని పర్యాటక ప్రదేశాలు, పుణ్య క్షేత్రాల సందర్శనకు భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ పేరుతో ప్రత్యేక రైళ్లు నడుపుతుందని ఏరియా మేనేజర్ ఎం. రాజు తెలిపారు. దీనికి సంబంధించి భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జ్యోతిర్లింగ దివ్య దక్షిణయాత్ర పేరుతో ఆగస్టు 4న ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.