WestGodavari

News November 28, 2024

ఏలూరు: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

image

ఏలూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఎస్ఐ శివాజీ వివరాల ప్రకారం.. దెందులూరు మండలంలోని ఓ గ్రామంలో భార్యాభర్తలు అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంటి ఓనర్ కుమారుడు 9వ తరగతి చదువుతున్నాడు. అతను అద్దెకు దిగిన వారి నాలుగేళ్ల కుమార్తెపై నవంబర్ 25న అత్యాచారం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని జువైనల్ హోంకు తరలించారు.

News November 28, 2024

సమస్యైతే నాకే ఫోన్ చేయండి: చింతమనేని

image

‘ఇది మీ ప్రభుత్వం. మీ శ్రేయస్సు మాకు ముఖ్యం’ అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం వంగూరులో బడి బస్సు ఆలస్యంగా వెళ్లింది. దీంతో ఆయన బుధవారం రాత్రి విద్యార్థులతో మాట్లాడారు. ఏ విషయంలో ఎలాంటి అసౌకర్యం కలిగినా సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. వారు స్పందించకపోతే నేరుగా తనకు కాల్ చేస్తే నేరుగా వచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

News November 28, 2024

ఏలూరు: DSC అభ్యర్థులకు శుభవార్త

image

ఏలూరు జిల్లాలో DSC పరీక్షకు హాజరయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తామని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కృపావరం బుధవారం తెలిపారు. అర్హులైన విద్యార్థులు www.apcedmmwd.org వెబ్ సైట్ లో డిసెంబర్ 12 లోగ దరఖాస్తు చేయాలన్నారు. దరఖాస్తును ఆఫీస్ అఫ్ ది డైరెక్టర్, సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అఫ్ మైనారిటీస్ భవానీపురం విజయవాడకు పంపాలన్నారు. > shareit

News November 28, 2024

ఏలూరు: ఫెంగల్ తుఫాన్.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశామని జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ సాల్మన్ రాజు బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు శాఖ పరంగా సిద్ధంగా ఉన్నారన్నారు. ఏలూరు విద్యుత్ భవన్ నందు 24 గంటలు పనిచేసే విధంగా నెం. 9440902926 తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామన్నారు. కావున ప్రజలు ధైర్యంగా ఉండాలన్నారు.

News November 27, 2024

ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తాం: జేసీ

image

తుఫాను భయంతో ముందస్తు కోతలు, నూర్పిడి చేయొద్దని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి రైతులకు సూచించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని భరోసానిచ్చారు. జిల్లా బుధవారం జిల్లాలోని మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. తుఫాను హెచ్చరికల విషయమై రైతులెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. రైతులకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు.

News November 27, 2024

ఓం బిర్లాను కలిసిన RRR

image

దేశ రాజధాని ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణమ రాజు(RRR) మర్యాదపూర్వకంగా కలిశారు. పలు రాజకీయ విషయాలు పంచుకున్నారు. RRR వెంట ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉన్నారు. 

News November 27, 2024

నన్ను కొట్టిన వాళ్లంతా జైలుకు వెళ్తారు: RRR

image

ఉండి MLA, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమ రాజు(RRR) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గత ప్రభుత్వంలో నాపై కేసు పెట్టారు. విచారణలో భాగంగా కొందరు అధికారులు నన్ను కొట్టారు. ఇప్పుడు వాళ్లంతా జైలుకు వెళ్లడం ఖాయం. సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్ అరెస్ట్‌ను స్వాగతిస్తున్నా. ఈ కేసులో కీలకంగా ఉన్న సీఐడీ మాజీ చీఫ్ సునీల్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది. ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలి’ అని RRR కోరారు.

News November 27, 2024

ఉండి యువతికి కీలక ఉద్యోగం

image

దేశస్థాయిలో ప.గో జిల్లా యువతి సత్తా చాటారు. ఉండి పెదపేటకు చెందిన నిస్సీ ప్లోరా డిగ్రీ BSC చదివారు. తర్వాత ఆమె హార్టికల్చర్ విభాగంలో పీహెచ్‌డీ చేశారు. దేశంలోని 16 కీలక పోస్టులకు 16 వేల మంది పరీక్షలు రాశారు. ఈక్రమంలో నిస్సీ ఫ్లోరా ప్రతిభ చూపి అహ్మదాబాద్‌లోని నేషనల్ హార్టీకల్చర్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. నిస్సీ తండ్రి ఏసురత్నం రిటైర్డ్ టీచర్. తల్లి వర్జీనియా స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు.

News November 27, 2024

భీమవరం నుంచి మలేషియా పంపి మోసం

image

మలేషియా పంపి మోసం చేసిన ఘటన భీమవరంలో జరిగింది. ‘నేను భీమవరంలోని మోటుపల్లివారి వీధిలో ఉంటున్నా. ప్రకాశ్ నగర్‌కు చెందిన ఓ మహిళ రూ.1.50 లక్షలు తీసుకుని పంబ్లింగ్ పని కోసం నన్ను మలేషియా పంపింది. కానీ ఓ హోటల్లో పనికి పెట్టి జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. తిరిగి భీమవరం పంపాలని నా భార్య ఆ మహిళను కోరినా పట్టించుకోలేదు. తెలిసిన వాళ్ల ద్వారా భీమవరం వచ్చా’ అని బాధితుడు నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 27, 2024

ఆకివీడులో 40 అడుగుల బొప్పాయి చెట్టు

image

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు నగరపంచాయతీలో కాకరపర్తి వీధిలో సత్యనారాయణ పెరటిలో బొప్పాయి చెట్టు అబ్బుర పరుస్తుంది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ బొప్పాయి సాధారణంగా ఐదు నుంచి పది పన్నెండు అడుగులు ఎత్తు వరకు ఎదుగుతాయి అన్నారు. తన పెరటిలో నాటిన మొక్క సుమారు 40 అడుగులు వరకు పెరిగి అందరిని ఆశ్చర్య పరుస్తుంది అన్నారు. తాను ఐదు సంవత్సరాల క్రితం నాటినట్టు ఆయన తెలిపారు.