WestGodavari

News July 7, 2024

ఏలూరు: డిప్యూటీ తహశీల్దార్‌పై కత్తితో దాడి

image

ఏలూరు అమీనాపేట ప్రాంతంలో రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, ఏలూరు మండల డిప్యూటీ తహశీల్దార్‌ లామ్‌ విద్యాసాగర్‌పై నగరానికి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. శనివారం ఇంటి నుంచి కార్యాలయానికి బైక్‌పై వెళ్తుండగా ఇన్నోవా కారులో వచ్చిన సదరు వ్యక్తి తహశీల్దార్‌ను అడ్డుకొని దాడి చేసినట్లు చెబుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News July 7, 2024

ప.గో.: DRDA, మెప్మా అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

ప.గో. జిల్లాలోని DRDA, మెప్మా అధికారులతో కలెక్టర్ సి.నాగరాణి శనివారం కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా శాఖల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలంతా ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు జీవనోపాధి మార్గాలను ఎంచుకొనేలా చొరవ చూపాలన్నారు. లేస్ పార్క్ ఉత్పత్తులను సొసైటీల ద్వారా మార్కెటింగ్ సహాయం తీసుకొని రానున్న రెండు నెలలల్లో బలోపేతం చేయాలని ఆదేశించారు.

News July 6, 2024

ఏలూరు జిల్లాలో హార్ట్ ఎటాక్‌తో VRA మృతి

image

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని దేవులపల్లి VRA పసుపులేటి మోహన్‌రావు శుక్రవారం అర్ధరాత్రి హార్ట్ ఎటాక్‌తో మృతి చెందారు. సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మోహన్‌రావు సేవలు మరువలేనివని అన్నారు.

News July 6, 2024

ప.గో: రోడ్డు ప్రమాదం.. భర్త పరిస్థితి విషమం

image

నల్లజర్ల జాతీయ రహదారిలో ఫ్లైఓవర్‌పై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం.. రహదారిపై ఆగి ఉన్న లారీని వెనకనుంచి ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది వెంటనే TPG ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2024

ఏలూరు: GOOD NEWS.. ‘కియా ఇండియా’లో జాబ్స్

image

డిప్లొమా, బీటెక్‌ పూర్తిచేసిన అభ్యర్థులకు కియా ఇండియా సంస్థలో ట్రైనింగ్‌, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గంటా సుధాకర్‌ తెలిపారు. 2019-2024లో డిప్లొమా, బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించిన 18-25 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.15,500 ఉపకార వేతనం ఉంటుందన్నారు.

News July 6, 2024

ప.గో: ‘నేడే.. మర్చిపోకుండా టీకాలు వేయించండి’

image

ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా జూనోసిస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహించనున్నారు. జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల నివారణ కోసం రేబిస్ టీకాలు వేయనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా పెంపుడు జంతువులకు టీకాలు వేయించాలని కోరారు. రేబిస్ లక్షణాలున్న పెంపుడు జంతువు కరిస్తేనే కాకుండా వాటి చొంగ వల్ల కూడా రేబిస్ సోకుతుంది.

News July 6, 2024

ప.గో: పెన్షన్ సొమ్ము పరారైన ఉద్యోగి.. పట్టించిన ఫోన్

image

పాలకొల్లులోని లంకలకోడేరు సచివాలయం-2లో గ్రేడ్-5 సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న బి.రాము ఈ నెల ఒకటో తేదీన పింఛన్ సొమ్ము రూ.2.50 లక్షలతో పరారైన విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. సెల్ సిగ్నల్ ద్వారా HYDలో రామును పట్టుకుని అధికారుల ముందు శుక్రవారం హాజరుపర్చారు. ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా గతంలో చాలా డబ్బు పోగొట్టుకున్నాడు. విచారణలో సీఐ సతీష్, ఎస్ఐ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News July 6, 2024

గోదావరిలో పెరుగుతున్న వరద నీరు

image

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప నదులు, కొండవాగులు పొంగి వరద ప్రవాహం పెరిగింది. శుక్రవారం నాటికి పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే ఎగువన 26.470 మీటర్లు, స్పిల్వే దిగువన 16.350 మీటర్లు, ఎగువ కాపర్ డ్యామ్ ఎగువన 26.530 మీటర్లు, దిగువ కాపర్ డ్యామ్ దిగువన 15.330 మీటర్ల నీటిమట్టం నమోదైనట్లు ప్రాజెక్టు ఈఈలు మల్లికార్జునరావు, వెంకటరమణ తెలిపారు.

News July 6, 2024

ప.గో: ఉరేసుకుంటున్నానంటూ ప్రియుడికి వీడియో కాల్

image

నిడదవోలుకు చెందిన 22ఏళ్ల యువతి తాడేపల్లిగూడెంలో నర్సుగా పనిచేస్తుంది. కపిలేశ్వరపురానికి చెందిన రాజేశ్, సదరు యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రాజేశ్‌కి ఏడాది కింద పెళ్లైంది. అయినా వీరి ప్రేమ కొనసాగింది. తనను 2వ పెళ్లి చేసుకోవాలని యువతి రాజేశ్‌ను కోరగా.. పెద్దలు అంగీకరిస్తే చేసుకుంటానన్నాడు. ఆమె బంధువులు తిరస్కరించగా.. ప్రియుడికి వీడియో కాల్ చేసి ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించింది.

News July 6, 2024

జగన్ పాలనలో ఇరిగేషన్ శాఖ 20 ఏళ్లు వెనక్కి: మంత్రి

image

మాజీ సీఎం జగన్ పాలనలో నీటి ప్రాజెక్ట్‌లు అన్ని ఇబ్బందుల్లో పడ్డాయని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం సీఈ, ఎస్ఈలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల జగన్ పాలన‌లో జలవనరుల శాఖ 20 ఏళ్లు వెనక్కు వెళ్లిందని చెప్పారు. వర్షాకాలానికి ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలను జగన్ ప్రభుత్వం తీసుకోలేదని అన్నారు.
– మంత్రి వ్యాఖ్యలపై మీ కామెంట్..?