WestGodavari

News July 5, 2024

జగన్‌పై ఈసీ చర్యలు తీసుకోవాలి: మంత్రి నిమ్మల

image

EVM బద్దలు కొట్టడం తప్పు కాదని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడటం దారుణమని జలవనరుల శాఖ మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలను బద్దలు కొట్టడమంటే ప్రజాస్వామ్యాన్ని బద్దలు కొట్టడమేనని వ్యాఖ్యానించారు. ఈవీఎంల ధ్వంసంపై, జగన్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకునేలా ఈసీ సుమోటోగా కేసును టేకప్ చేయాలని కోరారు.
– మంత్రి వ్యాఖ్యలపై మీ కామెంట్..?

News July 5, 2024

ప.గో.: నర్సు ఆత్మహత్యాయత్నం

image

ప.గో. జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం కడగట్ల ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి మమత ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. మమత స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. యువతి స్వగ్రామం నిడదవోలు. ఆమె ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిని పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై సుధాకర్ పరిశీలించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

News July 5, 2024

ఏలూరులో అర్ధరాత్రి అగ్నిప్రమాదం

image

ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక బిర్లా భవన్ సెంటర్‌లో ఉన్న ఓ మెడికల్ షాప్ దగ్ధం అయింది. ఈ ఘటనలో షాపులోని మందులన్నీ కాలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందా..? మరేదైనా కారణమా..? తెలియాల్సి ఉంది.

News July 5, 2024

కుటుంబ తగాదాలు.. గోదావరిలో దూకి సూసైడ్

image

దేవరపల్లికి చెందిన ఆటో డ్రైవర్ మెరిపో కిషోర్(33) గురువారం రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన కిశోర్.. రోడ్డు కం రైలు వంతెనపై మోటారు సైకిల్, చెప్పులు విడిచిపెట్టి నదిలో దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు జాలర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా.. అతడి మృతదేహం లభ్యమైంది.

News July 4, 2024

ఖత్తర్‌లో మృతిచెందిన ప.గో. జిల్లావాసి

image

ప.గో. జిల్లా పోడూరు మండలం గుమ్ములూరు గ్రామానికి చెందిన షేక్ బాషా, కుమారుడు వలీ ఉపాధి నిమిత్తం ఖత్తర్ దేశం వెళ్లారు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి వారు నివసిస్తున్న గదిలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో షేక్ బాషా (46) మృతి మృతి చెందగా కుమారుడు వలీ చేతులు కాలిపోగా అక్కడే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News July 4, 2024

ప.గో.: టెండర్లకు ఆహ్వానం: జాయింట్ కలెక్టర్

image

తాడేపల్లిగూడెంలోని పురుగు మందుల పరీక్ష ల్యాబ్‌కు కావలసిన మెటీరియల్‌ను సరఫరా చేసేందుకు ఆసక్తి కలిగిన వారి నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ప.గో. జిల్లా JC ప్రవీణ్ ఆదిత్య అన్నారు. కలెక్టరెట్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఆసక్తి గల బిడ్డర్లు ఈఎండీ మొత్తం రూ.2 లక్షల నగదును జూలై 16 మధ్యాహ్నం 12 గంటలలోపు డీడీ లేదా బ్యాంక్ చెక్ రూపంలో కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలన్నారు.

News July 4, 2024

గోపాలపురం: ACCIDENT.. యువకుడు మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన గోపాలపురం మండలం దొండపూడిలో గురువారం జరిగింది. స్థానికుల వివరాలు.. మండలంలోని ఊట్లగూడేనికి చెందిన సురేశ్(27), స్నేహితుడు రాంప్రసాద్‌తో కలిసి బైక్‌పై గోపాలపురం వెళ్తున్నారు. దొండపూడి వద్ద ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టాడు. ఇద్దరికీ గాయాలవగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సురేశ్ మరణించాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు SI సతీశ్ చెప్పారు.

News July 4, 2024

పెదపాడులో ప్రమాదం.. వ్యక్తి మృతి

image

పెదపాడు మండలం కొక్కిరపాడు సాయిబాబా గుడి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 16 నంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొంది. ఘటనలో పెదపాడు మండలం పాతముప్పర్రు గ్రామానికి చెందిన గుళ్లంకి ఉమ(26) గా గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 4, 2024

నల్లజర్లలో దారుణం.. రక్తపు మడుగులో వ్యక్తి

image

నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. గ్రామంలోని తమిరిసి వెంకటేశ్వరరావు (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. గ్రామంలోని ప్రధాన సెంటర్లో మదర్ థెరిసా విగ్రహం ఎదుట వెంకటేశ్వరరావు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు నల్లజర్ల పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో 200 మీటర్ల నుంచి రక్తపు మరకలు ఉండడంతో హత్యగా భావిస్తున్నారు.

News July 4, 2024

విజయవాడ-నరసాపురం రైళ్లు రద్దు

image

విజయవాడ జోన్ పరిధిలోని రైల్వే లైన్ల నిర్వహణ పనుల్లో భాగంగా వచ్చే నెల ఆగష్టున పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఆగస్టు 3 నుంచి 10వ తేదీ వరకు నరసాపురం – విజయవాడ, ఆగస్టు 5 నుంచి 12 వరకు విజయవాడ -నరసాపురం, ఆగస్టు 4 నుంచి 10 వరకు నరసాపురం- గుంటూరు రైళ్లను రద్దు చేస్తు న్నట్లు చెప్పారు.