WestGodavari

News July 4, 2024

విజయవాడ-నరసాపురం రైళ్లు రద్దు

image

విజయవాడ జోన్ పరిధిలోని రైల్వే లైన్ల నిర్వహణ పనుల్లో భాగంగా వచ్చే నెల ఆగష్టున పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఆగస్టు 3 నుంచి 10వ తేదీ వరకు నరసాపురం – విజయవాడ, ఆగస్టు 5 నుంచి 12 వరకు విజయవాడ -నరసాపురం, ఆగస్టు 4 నుంచి 10 వరకు నరసాపురం- గుంటూరు రైళ్లను రద్దు చేస్తు న్నట్లు చెప్పారు.

News July 4, 2024

ఏలూరులో ‘వందేభారత్’ హాల్ట్ ఇవ్వాలని ఎంపీ వినతి

image

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డు ఛైర్మన్ & సీఈఓ జయ వర్మ సిన్హాను బుధవారం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కలిశారు. న్యూఢిల్లీలోని రైల్ భవన్‌లో వందేభారత్ రైళ్లకు ఏలూరులో హాల్ట్ కోరుతూ వినతిపత్రం అందించారు. భద్రాచలం – కొవ్వూరు రైల్వే లైన్‌ను పనులు వేగవంతం చేయాల్సిందిగా కోరారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించిట్లు తెలిపారు.

News July 4, 2024

ఏలూరు: వాట్సప్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు.. అందిన పింఛన్

image

ఏలూరు జిల్లా పోలవరానికి చెందిన వెంకట రమణమూర్తి 29వ తేదీన ప్రమాదానికి గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్ ఆయనకు అందలేదు. వాట్సాప్ ద్వారా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించడంతో ఈ రోజు ఆయనకు పింఛను అందజేశారు. కలెక్టర్‌కి వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు.

News July 3, 2024

ఏలూరు: కుమార్తెను చూడటానికి వెళ్తూ తల్లి మృతి

image

కుమార్తెను చూసేందుకు వెళ్తూ రైలులోంచి జారి పడి తల్లి మృతి చెందిన ఘటన ఏలూరులో జరిగింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. వేలేరుపాడు మండలం కోయమాదారం గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మ(60) కుమార్తె నెల్లూరులో ఉంటోంది. బుధవారం ఆమెను చూసేందుకు వెళ్తూ ఏలూరు రైల్వే స్టేషన్‌లో యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కబోతూ జారి పడి మృతి చెందింది. దీనిపై రైల్వే ఎస్ఐ డి.నరసింహారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 3, 2024

పోలవరంలో మరోసారి చిరుత కలకలం

image

ఏలూరు జిల్లా పోలవరంలో మరోసారి చిరుత కలకలం రేపింది. అటవీ శాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. సున్నాలుగండికి చెందిన మడకం పుల్లారావు తన పశువుల పాకలో కట్టేసిన మేక కనిపించడం లేదని సమీప అటవీ ప్రాంతంలో వెతికారు. తల లేకుండా మొండెంతో ఉన్న మేక కళేబరం కనిపించింది. పాదముద్రల ఆధారంగా చిరుత దాడి చేసి చంపినట్లు అధికారులు ధ్రువీకరించారు. కొద్దిరోజుల కింద కూడా ఇదే మండలంలో చిరుత మేకను చంపేసిన విషయం తెలిసిందే.

News July 3, 2024

ఏలూరు: రెండేళ్ల తర్వాత దొరికిన బాలుడు

image

ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ బాలుడి ఆచూకీ రెండేళ్ల తర్వాత తెలిసింది. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం మర్లగూడెంకు చెందిన మహాలక్ష్మి కుమారుడు నందకిశోర్ చదవడం ఇష్టంలేక 2022లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గతంలోనూ అలానే వెళ్లి తిరిగి వచ్చేసేవాడు. కానీ.. రెండేళ్ల కింద వెళ్లిన నందకిశోర్ తిరిగి రాలేదు. అతడు కోల్‌కతాలో ఉన్నట్లు 4 రోజుల కింద తెలియగా.. తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.

News July 3, 2024

ఏలూరు: జాతీయ అవార్డులకు దరఖాస్తు

image

ఏలూరు జిల్లాలోని అర్హత కలిగిన ఉపాధ్యాయులు జాతీయ అవార్డులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని బుధవారం విద్యాశాఖ అధికారి ఎన్. అబ్రహం తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దరఖాస్తు చేసుకోవడానికి http://natioonlawardstoteachers.education.gov.in వెబ్సైట్ నందు అప్లికేషన్స్ పొందుపరిచామన్నారు. జూలై 15 వరకు అవకాశం ఉందని తెలిపారు.

News July 3, 2024

తణుకు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం తణుకు రైల్వే అవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిడదవోలు నుంచి వేండ్ర వరకు టికెట్ తీసుకున్న సుమారు 60 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి కాల్దరి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News July 3, 2024

ఉండ్రాజవరం: వివాహిత బలవన్మరణం.. నిందితుడికి నాలుగేళ్ల జైలు

image

ఉండ్రాజవరం మండలం వేలివెన్ను కొత్తపేటకు చెందిన సిర్రా లక్ష్మణరావు 2020 మార్చిలో చర్చిలో ఉన్న వివాహితను పిలిపించి.. అసభ్యకరంగా తిట్టి, కొట్టి.. ఉరేసుకుని చనిపోతే మంచిదని దూషించాడు. ఆ అవమానం భరించలేక ఆమె ఉరి వేసుకుంది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు లక్ష్మణరావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.మంగళవారం తుది విచారణ అనంతరం నాలుగేళ్లు జైలు శిక్ష వేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

News July 3, 2024

ప.గో జిల్లాలో ఆశాజనకంగా చేపల ధరలు

image

చేపల ధరలు సంవత్సరం తర్వాత ఆశాజనకంగా మారాయి. రోహూ, కట్లా జాతులకు టన్నుకు రూ.15వేలు పెరిగింది. గతేడాది మార్చిలో కనీసం ఖర్చులు రాని పరిస్థితి నుంచి ప్రస్తుతం లాభాలను స్వీకరించే స్థాయికి రైతులు చేరుకున్నారు. ఉమ్మడి ప.గో జిల్లాలో 2.80 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు విస్తరించి ఉంది. అందులో 1.40 లక్షల ఎకరాల్లో తెల్ల చేపలు, 30 వేల ఎకరాల్లో ఫంగస్‌ రకానికి చెందిన చేపలు, లక్ష ఎకరాల్లో రొయ్య సాగు చేస్తున్నారు.