WestGodavari

News July 3, 2024

నిడదవోలు: నేటి నుంచి రైళ్ల దారి మళ్లింపు

image

పెద అవుటుపల్లి-గన్నవరం మధ్య ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా నేటి నుంచి నడిచే పలు రైళ్లను నిడదవోలు-గుడివాడ- విజయవాడ మార్గంలో నడుపుతున్నట్లు ద.మ. రైల్వే విజయవాడ డివిజన్ పిఆర్ నుస్రత్ మంద్రుపాకర్ తెలిపారు. విశాఖపట్నం-కొల్లాం మధ్య నడిచే నిడదవోలు- గుడివాడ- విజయవాడ రైలు మార్గంలో నడపనున్నట్లు తెలిపారు. ధన్బాద్-తాంబరం ఎక్స్ప్రెస్, బరోని-మంగుళూరు సెంట్రల్ ఎక్స్ ప్రెస్ నిడదవోలు- విజయవాడ మార్గంలో నడుస్తాయన్నారు.

News July 3, 2024

గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి

image

ఏలూరు జిల్లా: పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం ఉదయం నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి, MLa చిర్రి బాలరాజు, ఉంగుటూరు MLA ధర్మరాజు, ఐటీడీఏ పీఓ ఏం. సూర్యతేజ తదితరులు ఉన్నారు.

News July 3, 2024

‘కల్కి’ బుజ్జి కారులో రఘురామ సందడి

image

కల్కి 2898 AD’ సినిమాలో ప్రభాస్‌ నడిపిన ప్రత్యేక కారును భీమవరం ఏవీజీ సినిమాస్‌ మల్టీప్లెక్స్‌లో ఆవరణలో మంగళవారం ప్రదర్శించారు. వీక్షకులు భారీగా తరలివచ్చి ఈ కారు ఎదుట సెల్ఫీలు తీసుకున్నారు. అలాగే ఈ కారులో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సందడి చేశారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన కల్కి చిత్రం ఘనవిజయం సాధించడంతో మూవీ టీంకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

News July 3, 2024

స్టడీ సెంటర్లకు దరఖాస్తు చేసుకోండి: అబ్రహం

image

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి, ఇంటర్మీడియట్ కొత్త స్టడీ సెంటర్లకు దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.అబ్రహం తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి apopenchool.ap.gov.in వెబ్‌సైట్ నందు అప్లికేషన్స్ పొందుపరిచామన్నారు. ఇప్పటికే పర్మిషన్ పొంది ఉన్న స్టడీ సెంటర్లలోనూ రెన్యువల్ చేసుకోవాలని ఆయన సూచించారు.

News July 2, 2024

డిప్యూటీ CM ఆదేశాలు.. భీమవరం యువతి ఆచూకీ లభ్యం

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో విజయవాడ పోలీసులు యువతి మిస్సింగ్ కేసును ఛేదించారు. దాదాపు 9నెలల తరువాత యువతి ఆచూకీ లభ్యమైంది. భీమవరానికి చెందిన శివకుమారి తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ఫిర్యాదు చేయడంతో విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఓ యువకుడితో జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకువస్తున్నారు.

News July 2, 2024

ఏలూరు: ఆసుపత్రి పైనుంచి పడి రోగి మృతి

image

ముసునూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన వేమూరి సత్యనారాయణ(40) అనే వ్యక్తి అనారోగ్య కారణాలతో ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే.. సత్యనారాయణ ఆసుపత్రి భవనంపై నుంచి కింద పడి ఉండటాన్ని అక్కడి వారు మంగళవారం గుర్తించారు. వెంటనే మండల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 2, 2024

పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనలో నిపుణుల బృందం

image

పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం మూడవ రోజు పర్యటించింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకొని ముందుగా ECRF (Gap-2)లో సేకరించిన మట్టి, రాతి నమూనాలను పరిశీలించారు. మ్యాప్ పాయింటింగ్ ద్వారా సంబంధిత ఇరిగేషన్ అధికారులు సేకరించిన నమూనాల నాణ్యతను బృందానికి అధికారులు వివరించారు.

News July 2, 2024

ప.గో.: డ్యూటీకి రాని కార్యదర్శి.. ఆగిన పింఛన్

image

ప.గో. జిల్లా పాలకొల్లు మండలం లంకలకోడేరులో పింఛన్ సొమ్ము రూ.2,50,500 డ్రా చేసిన పంచాయతీ సెకండ్ కార్యదర్శి రాము సోమవారం విధులకు గైర్హాజరయ్యాడు. దీంతో పింఛన్ పంపిణీ ఆగిపోయింది. ఈ మేరకు మరో పంచాయతీ కార్యదర్శి రాజేశ్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై హరికృష్ణ తెలిపారు.

News July 2, 2024

పోలవరంలో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

image

పోలవరం ప్రాజెక్టులో గోదావరి నీటిమట్టం అనూహ్యంగా పెరిగింది. సోమవారం ఉదయానికి స్పిల్‌వే ఎగువన 25.700 మీటర్లు, దిగువన 15.700 మీటర్లు, కాపర్‌ డ్యాంనకు ఎగువన 25.750 మీటర్లు, దిగువన 14.400 మీటర్ల నీటి మట్టం నమోదైంది. అదనంగా వచ్చిన 29,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఈఈ వెంకటరమణ తెలిపారు.

News July 2, 2024

నేడు భీమవరంలో ‘ కల్కి’ మూవీ బుజ్జి కారు

image

‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో హీరో ప్రభాస్ నడిపిన బుజ్జి కారును భీమవరం మల్టీప్లెక్స్ ఆవరణలో మంగళవారం ప్రదర్శించనున్నట్లు థియేటర్ యాజమాన్యం సోమవారం రాత్రి తెలిపింది. ఈ సందర్భంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు మల్టీప్లెక్స్ ప్రాంగణంలో ఈ బుజ్జి కారు ఉంటుందని తెలిపారు.