India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం విస్తృతంగా జరిగింది. మొత్తం జిల్లాలో పెన్షన్‌దారులు 2,32,885 మందికి గాను 2,22,221 మందికి అందజేసినట్లు పేర్కొన్నారు. రాత్రి 9 గంటల వరకు 95.42% పెన్షన్లు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఏలూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం విస్తృతంగా జరిగింది. జిల్లాలోని మొత్తం పెన్షన్‌దారులు 2,68,353 మందికి గానూ 2,56,331 మందికి అందజేసినట్లు అధికారులు తెలిపారు. రాత్రి 9 గంటల వరకు 95.42% పెన్షన్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
ఫంక్షన్‌కని చెప్పి వెళ్లిన యువకుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు, పోలీసులు గాలింపు చేపట్టారు. ప.గో జిల్లా ఆచంట మండలం కరుగోరుమిల్లికి చెందిన వై.త్రిమూర్తులు పంక్షన్‌కు వెళ్తున్నానన చెప్పి ఆదివారం ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడం.. బైక్ నరసాపురంలోని స్మశానవాటిక దగ్గరలో ఉండటంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జాలర్లతో పడవ సాయంతో గోదావరిలో వెతికించారు.
తణుకు మండలం కొమరవరంలో ఇటీవల యువకుడిపై దాడిచేసి తీవ్రంగా గాయపరచిన ఘటనపై తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి సోమవారం విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన మేడే రాంమూర్తి బైక్‌పై వెళుతుండగా.. అదే గ్రామానికి చెందిన ముత్యాల సుబ్బారావు, సాయిలు గత నెల 26న దారి కాచి తీవ్రంగా గాయపర్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తణుకు రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్ నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన కొవ్వలి రాజు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కొద్దిరోజులుగా ఏలూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసిన సచివాలయ సిబ్బంది అడారి చందు, శివ శంకర్, కూటమి నేతలు తొలి రోజున ఎలాగైనా రాజుకు నగదు అందివ్వాలని నిర్ణయించుకున్నారు. సొంత ఖర్చులతో ఏలూరులోని ఆసుపత్రికి వెళ్లి మరీ పెంచిన పెన్షన్ అందించారు. ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
పశ్చిమ గోదావరి కలెక్టర్ చదలవాడ నాగరాణిని ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు సోమవారం మర్యాదపూర్వంగా కలిశారు. ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజవర్గ సమస్యలను కలెక్టర్ నాగరాణికి వివరించారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో పరిపాలనాధికారిగా పని చేస్తున్న చిర్రావూరి రత్న గిరి సోమవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన భౌతికకాయానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో పింఛన్ల ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమైంది. కాగా గ్రామానికి చెందిన సూర్యదేవర పద్మావతి అనే మహిళకు కూటమి నాయకులు రూ.7వేల పింఛన్ అందించారు. కాగా ఆమె తీసుకున్న పింఛన్‌కు రూ.3 వేలు కలిపి మొత్తం రూ.10వేలను తిరిగి కూటమి నాయకులకు ఇచ్చేసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం తన వంతు సాయంగా ఈ నగదు అందిస్తున్నట్లు ఆమె తెలిపింది.
ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ క్రమంలో వృద్ధుల కాళ్లు కడిగి పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పంపిణీ చేశామని స్పష్టం చేశారు. ఇక ప్రతి నెల పెరిగిన పింఛన్ లబ్ధిదారుల ఇంటికి చేరుతుందన్నారు.
వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు దెబ్బతిందని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ ఆరోపించారు. 2014కు ముందు ప్రాజెక్టు పనులు కేవలం 5 శాతం మాత్రమే జరగ్గా.. 2014- 2019 మధ్య టీడీపీ హయాంలో 68 శాతం పనులు జరిగాయన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం 3.8 శాతం పనులను మాత్రమే చేయగలిగిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టును సందర్శించి.. పనులను గాడిలో పెడుతుందని చెప్పారు.
Sorry, no posts matched your criteria.