WestGodavari

News June 2, 2024

ఉమ్మడి ప.గో.లో కాయ్ రాజా కాయ్..!

image

ఎన్నికల్లో గెలిచేదెవరు..? ఓడేదెవరో మరికొద్ది గంటల్లో తేలనుంది. ఎగ్జిట్ పోల్స్ సైతం విడుదల కావడంతో ఉమ్మడి ప.గో జిల్లాలో పందెంరాయుళ్లు రెచ్చిపోతున్నారు. కాయ్ రాజా కాయ్.. అని కవ్విస్తూ పందేలు కాస్తున్నారు. కూటమిదే గెలుపంటూ కొందరు.. YCPదే మళ్లీ అధికారమంటూ ఇంకొందరు భారీగా బెట్టింగ్స్ పెడుతున్నట్లు సమాచారం. ఏకంగా సోషల్ మీడియాలోనే పోస్టులు పెడుతున్నారంటే పందేలు ఎంతలా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

News June 2, 2024

ప.గో: గ్రామస్థులు కొట్టారని లెటర్ రాసి లైన్‌మెన్ అదృశ్యం

image

ప.గో జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరానికి చెందిన లైన్‌మెన్ N.శ్రీనివాసరావు శనివారం తెల్లవారుజాము నుంచి కనిపించడం లేదని తోటి ఉద్యోగులు తెలిపారు. గ్రామంలో శుక్రవారం ఓ విద్యుత్ స్తంభం ఎక్కి దిగేటప్పుడు సెటప్ బాక్స్ కింద పడిపోవడంతో స్థానికులు అతడితో వాగ్వాదానికి దిగారన్నారు. పలువురు శ్రీనివాసరావుపై దాడి చేసినట్లు తెలిపారు. మనస్తాపానికి గురైన శ్రీను లెటర్ రాసి కనిపించకుండా పోయాడని చెబుతున్నారు.

News June 2, 2024

జంగారెడ్డిగూడెం: భారీ చేప

image

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని కొంగవారిగూడెం ఎర్ర కాలువ జలాశయంలో మత్స్యకారులకు ఆదివారం 30 కేజీల భారీ చేప చిక్కింది. ఆదివారం కావడంతో మాంసాహార ప్రియులు చేపలు కొనేందుకు ఎగబడ్డారు. దీంతో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఈ భారీ చేప చిక్కింది. దీనిని రూ.7500కు విక్రయించినట్లు వారు తెలిపారు.

News June 2, 2024

మరోసర్వే.. ప.గో. MP స్థానాల్లో విజయం YCPదే

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని ఏలూరు, నరసాపురం ఎంపీ స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని సీ-ప్యాక్ సర్వే అంచనా వేసింది. కాగా నరసాపురంలో కూటమి నుంచి భూపతిరాజు శ్రీనివాస శర్మ, వైసీపీ నుంచి గూడూరి ఉమాబాల బరిలో ఉన్నారు. అటు ఏలూరులో కూటమి నుంచి పుట్టా మహేశ్, వైసీపీ- కారుమూరి సునీల్ పోటీ చేస్తున్నారు.
– మరి మీ కామెంట్..?

News June 2, 2024

ఏలూరు: బంధంచర్ల అడవిలో చిరుత.. జాగ్రత్త 

image

ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బంధంచర్ల అటవీ ప్రాంతంలో వారం రోజులుగా పులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బంధంచర్ల – చింతలపూడి సరిహద్దు అడవిలో పులి అడుగు జాడలను శనివారం బీట్‌ అధికారిణి భవానీ పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఆయా ప్రాంతాల్లో కనిపించిన కాలి ముద్రలను గుర్తించి జిల్లా ఫారెస్ట్ అధికారులకు పంపుతున్నట్లు తెలిపారు.

News June 2, 2024

చాణక్య ఎక్స్.. ఉమ్మడి ప.గో.లో టీడీపీకే పట్టం

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో 5 చోట్ల టీడీపీ, 3 చోట్ల జనసేన, వైసీపీ ఒక స్థానంలో విజయం సాధిస్తుందని చాణక్య ఎక్స్ సర్వే సంస్థ అంచనా వేసింది. కాగా.. కొవ్వూరు, ఆచంటలో టీడీపీకి, భీమవరంలో జనసేనకు, ఉంగుటూరులో వైసీపీకి ఎడ్జ్‌లో ఉన్నట్లు పేర్కొంది. ఇక దెందులూరు, గోపాలపురం స్థానాల్లో వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర పోటీ ఉండనుందని చెప్పింది.

News June 2, 2024

ప.గో.: మరొక్క రోజే.. ఉత్కంఠ

image

రాష్ట్రంలో పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు శనివారం వెల్లడించడంతో ఉమ్మడి ప.గో. జిల్లాలో గెలుపు అవకాశాలపై ఓ అంచనా ఏర్పడిందని చర్చ సాగుతోంది. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు గాను చాణక్య స్ట్రాటజీస్, పోస్ట్ పోల్, కేకే తదితర సంస్థలు కూటమే ఎక్కువ స్థానాలు గెలుస్తుందని చెప్పాయి. తుది ఫలితాలకు నేడు, రేపు మాత్రమే మిగిలిఉండగా ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది.
– సర్వే ఫలితాలపై మీ కామెంట్..?

News June 1, 2024

ప.గో.లో మరో సర్వే.. ఎవరికి ఎన్ని సీట్లు అంటే..?

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో 15 సీట్లలో NDA కూటమి 10- 11 గెలుస్తుందని బిగ్‌టీవీ సర్వే తెలిపింది. 4-5 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తంమీద 175 అసెంబ్లీ సీట్లలో 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.

News June 1, 2024

పోస్ట్ పోల్ సర్వే.. ఉమ్మడి ప.గో.లో 2 ఎంపీ స్థానాలు కూటమివే

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో కూటమి 11 నుంచి 12 స్థానాల్లో, వైసీపీ 3- 4 స్థానాల్లో విజయం సాధిస్తుందని పోస్ట్‌పోల్ సర్వే తెలిపింది. మరోవైపు జిల్లాలోని ఏలూరు పార్లమెంట్ స్థానంలో టీడీపీ, నరసాపురం నుంచి బీజేపీ గెలవనున్నట్లు చాణక్య ఎక్స్ అంచనా వేసింది.

News June 1, 2024

ప.గో.: ఎన్నికల ఫలితాలు క్లారిటీ వచ్చినట్లేనా..? మీ కామెంట్..?

image

ఓట్ల పండగ ముగిసినప్పటి నుంచి ఊరు.. వాడా ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టీ నెలకొంది. చాణక్య స్ట్రాటజీస్ సంస్థ ఉమ్మడి జిల్లాలో కూటమికి 12 వస్తాయని, కేకే సంస్థ టీడీపీ-9, జనసేన-6 గెలుస్తాయని ఫలితాలు విడుదల చేశాయి. కాగా తుది ఫలితం కాకపోయినప్పటికీ ఓ అంచనా వచ్చేందుకు దోహదపడుతోంది. ఏదేమైనప్పటికీ ఫలితాల కోసం మరో 3 రోజులు వెయిట్ చేయాల్సిందే.
– ఇంతకీ మీ అంచనా ఏంటి..?