WestGodavari

News June 30, 2024

DGPకి మాజీ MP హరిరామజోగయ్య ఫిర్యాదు

image

తన పేరు చెప్పి ఓ వ్యక్తి మాయమాటలతో రాజకీయ ప్రముఖుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ MP చేగొండి హరిరామజోగయ్య DGP ద్వారకా తిరుమలరావుకు శనివారం లేఖ రాశారు. నిందితుడి మాటలు నమ్మి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నాయకులు అతడికి డబ్బులు ఇస్తున్నారని, 6 నెలలు కిందట దీనిపై పాలకొల్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

News June 30, 2024

జంగారెడ్డిగూడెంలో యువత సంబరాలు

image

టీమిండియా T20 వరల్డ్ కప్ గెలవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. యువత కేరింతలతో హోరెత్తించారు. జంగారెడ్డిగూడెంలో అర్ధరాత్రి యువత బైక్ ర్యాలీ నిర్వహించి, బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

News June 30, 2024

నారా లోకేష్‌ని కలిసిన TDP ప.గో. జిల్లా అధ్యక్షుడు

image

పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు మంత్రి నారా లోకేష్‌‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లాలోని రాజకీయ పరిస్థితులను వివరించారు.

News June 29, 2024

CM చంద్రబాబును కలిసిన నిడదవోలు మాజీ MLA

image

గత రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించిన రైతులకు నగదు బకాయిలు చెల్లించాలని CM చంద్రబాబును నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కోరారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ధాన్యం బకాయిల కోసం రైతులు ఎదురు చూస్తున్నారని అన్నారు. స్పందించిన సీఎం త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

News June 29, 2024

ప.గో. కలెక్టర్‌ను కలిసిన SP

image

పశ్చిమగోదావరి జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాగరాణిని ఎస్పీ అజిత వేజెండ్ల శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పూలకుండీ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని లాండ్ ఆర్డర్‌పై వివరించారు.

News June 29, 2024

ఉండికి నటుడు రావు రమేశ్ రూ.3లక్షల విరాళం

image

ప్రముఖ సినీనటుడు రావు రమేష్ ఉండి నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు సాయంగా రూ.3 లక్షలు ఆర్థికసహాయం అందించారు. ఈ మేరకు ఉండి MLA కనుమూరి రఘురామ కృష్ణరాజుకు సంబంధిత చెక్కును అందించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించినందుకు ఎమ్మెల్యే RRR ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

News June 29, 2024

ప.గో.: కొంపముంచిన మొబైల్ యాప్.. మీరు జాగ్రత్త

image

ఆన్‌లైన్‌లో మోసపోయిన పలువురు కోనసీమ జిల్లా ద్రాక్షారామం పోలీసులకు ఫిర్యాదుచేశారు. వివరాలు.. రామచంద్రపురం, అంబాజీపేట తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు బుక్కూరి ఆనంద్, మద్దాల వినయ్, మోటుపల్లి కిరణ్ GMR యాప్‌ పరిచయం చేశారు. యాప్‌లో డబ్బులు పెడితే రెట్టింపు వస్తాయని నమ్మించారు. చాలామందికి నగదు వచ్చాయి. కొద్దిరోజులుగా నగదు రాకపోగా మోసపోయినట్లు గుర్తించారు. బాధితుల్లో తణుకుకు చెందిన వారు సైతం ఉన్నారు.

News June 29, 2024

ప.గో: అమ్మలకు తప్పని ‘కడుపు కోత’

image

ప.గో జిల్లా వ్యాప్తంగా కొన్నేళ్లుగా సాధారణ ప్రసవాల సంఖ్య భారీగా తగ్గి.. సిజేరియన్లు 80శాతం పైనే నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 2023-24లో ప్రవేట్‌లో మొత్తం 11,674 కాన్పులు కాగా.. 1,751 మాత్రమే సాధరణ కాన్పులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో 7,912 కాన్పులు కాగా, వాటిలో సాధారణ-3,568, సిజేరియన్లు-4,344 జరిగినట్లు గుణంకాలు చెబుతున్నాయి. ఆపరేషన్‌కు రూ.80వేలు- రూ.లక్ష వసూలు చేస్తున్నట్లు విమర్శలున్నాయి.

News June 29, 2024

భీమవరానికి మహర్దశ.. నగరపాలిక దిశగా అడుగు

image

ప.గో జిల్లాలోనే ముఖ్య పట్టణం భీమవరం. 1948లో 3వశ్రేణిగా, 1963లో 2వశ్రేణి, 1967లో ప్రథమ శ్రేణి, 1980లో ప్రత్యేక, 2011లో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా వర్గోన్నతి పొందింది. 39 వార్డులతో ఉన్న ఈ పట్టణం విలీన గ్రామాలతో కలిపి దాదాపు 2 లక్షల మంది జనాభాతో నగరపాలక సంస్థ హోదా దిశగా అడగులేస్తోంది. దీనికి సంబంధించి పురపాలిక కార్యాలయంలో ఎమ్మెల్యే రామాంజనేయులు శుక్రవారం అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News June 29, 2024

‘పోలవరం’ ఎగువన స్వల్పంగా పెరిగిన నీటిమట్టం

image

పోలవరం ప్రాజెక్ట్ ఎగువన సీలేరు జలాశయం నుంచి 2000 క్యూసెక్కుల గోదావరి జలాల విడుదలతో నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. శనివారం ఉదయం నాటికి గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 22.950 మీటర్లు, స్పిల్వే దిగువన 15.300 మీటర్లు, ఎగువ కాపర్ డ్యాంకు 23.000 మీటర్ల నీటిమట్టం, దిగువ కాపర్ డ్యామ్‌లో13.920 మీటర్ల నీటిమట్టం నమోదయింది.