India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బి.సి, ఎస్.సి, ఎస్.టికి సంబంధించి ఉమ్మడి ప.గో జిల్లాలోని డి.ఎస్.సి.అభ్యర్థులకు వచ్చే నెల 11వ తేదీ నుంచి డి.ఎస్.సి. ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభిస్తున్నట్లు జిల్లా బి.సి సంక్షేమ అధికారిణి నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు బి.సి స్టడీ సర్కిల్ కార్యాలయంలో జులై 8వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
➠ SHARE IT..
కైకలూరు మండలం ఉప్పుటేరు చెక్ పోస్ట్ సమీపంలో లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కైకలూరు మండలం గుమ్మళ్లపాడుకు చెందిన యాళ్ల దేవరాజు(45) ద్విచక్ర వాహనంపై ఆకివీడు నుంచి స్వగ్రామానికి వెళుతున్న క్రమంలో ఉప్పుటేరు వద్ద వెనక నుంచి లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో దేవరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ జులై 1న తొలిసారి పిఠాపురం రానున్నారు. తనను గెలిపించిన ప్రజలకు అభినందనలు తెలపనున్నారు. ఉప్పాడ సెంటర్‌లో జరిగే వారాహి సభలో పవన్ ప్రసంగిస్తారు. 3రోజుల పాటు ఆయన పిఠాపురంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. అటు వారాహి సభకు ఉమ్మడి తూ.గో, ప.గో జిల్లాల నుంచి జనసేన నేతలు, అభిమానులు భారీగా తరలి రానున్నట్లు సమాచారం. ఏర్పాట్లపై కాకినాడ కలెక్టర్ షన్మోహన్ శుక్రవారం సమీక్షించారు.
దారికాసి మరీ యువకుడిపై ఇనుప రాడ్లతో దాడి చేసిన ఘటన ప.గో జిల్లా తణుకు మండలం కొమరవరంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎం.రామ్మూర్తి శుక్రవారం బైక్‌పై వెళుతుండగా, అదే గ్రామానికి చెందిన ముత్యాల సుబ్బారావు, ముత్యాల సాయి మరికొందరితో కలిసి అడ్డగించారు. వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్లుతో వెంటపడి మరీ కొట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి2898 AD’ మూవీలో కీలకమైన బుజ్జి రోబోని డిజైన్ చేసిన సభ్యులలో మన ఏలూరు జిల్లా కుర్రోడు ఒకరవడం విశేషం. చింతలపూడి మండలం బోయగూడెం గ్రామానికి చెందిన రాకేష్ విశాఖపట్టణంలోని గీతం కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ టీహబ్లో వర్క్ చేస్తున్నాడు. కల్కి మూవీలోని రోబో తయారీలో భాగస్వామ్యం అయినందుకు పలువురు అతణ్ని అభినందిస్తున్నారు.
☛ CONGRATS రాకేష్
ప.గో జిల్లా పెనుగొండ మండలం వదలిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. టి.గంగయ్య(50) అనే రైతు ఉదయం తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. కరెంట్ స్తంభం నుంచి తెగిపోయి నీటిలో పడి ఉన్న తీగను గమనించకుండా పొలంలో దిగాడు. షాక్ కొట్టడంతో పొలంలోనే గంగయ్య ప్రాణాలు వదిలాడు. గంగయ్య భార్య చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని స్థానికులు తెలిపారు.
ప్రజల అజాగ్రత్త.. అధికారుల నిర్లక్ష్యం.. కారణాలేవైనా ఉమ్మడి ప.గో.లో విద్యుత్ ప్రమాద మృతుల సంఖ్య పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే ఆగిరిపల్లిలో <<13521060>>తల్లీకొడుకు<<>>, తాడేపల్లిగూడెంలో <<13520724>>దంపతులు<<>> మరణించారు. 2022 APR 1 నుంచి దాదాపు 119మంది మృతిచెందారు. 2022-23లో 60 ప్రమాదాలు జరగ్గా 45మంది, 202324లో 58 ఘటనల్లో 49మంది చనిపోయారు. 2024-25లో ఇప్పటికే 49 విద్యుత్ ప్రమాదాలు జరగ్గా.. 25మంది ప్రాణాలొదిలారు.
ప.గో జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 42.0 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. నరసాపురంలో అత్యధికంగా 87.0, పాలకొల్లు 72.4, భీమవరం 79.4, ఉండి 68.8 , వీరవాసరం 59.2, పాలకోడేరు 52.2, గణపవరం 46.4, ఆకివీడు 47.4, యలమంచిలి 40.2, కాళ్ల 40.2, పెనుగొండ 38.2, ఆచంట 38.0, పెనుమంట్ర 37.8, పోడూరు 30.4, అత్తిలి 25.2, మొగల్తూరు 24.6, తాడేపల్లిగూడెం 19.4, పెంటపాడు 17.2, ఇరగవరం 16.2, తణుకు 9.4 మిమీ చొప్పున నమోదైంది.
ఉమ్మడి ప.గో జిల్లాలోని అన్ని కోర్టులో ఈనెల 29న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తమకుమార్ తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో ప్రామిసరీ నోటు దావాలు, ఆస్తి దావాలు, తనఖా, మోటారు వాహన ప్రమాద కేసులు, కార్మిక వివాదాలు, చిట్‌ఫండ్ సంబంధిత, ఆర్బిటేషన్ కింద రికవరీ కేసులు పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన కోయ రాజేంద్రరామ్(20) రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రామ్ భీమవరం నుంచి తుందుర్రు వెళ్తుండగా.. తాడేరు వద్ద ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టడంతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడి తమ్ముడికి తీవ్ర గాయాలు కావడంతో భీమవరంలోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై భీమరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.