India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని లబ్ధిదారులైన పేదలకు అందించడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల స్థాయి అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.
గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయంలో ఇరిగేషన్ అంశాలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పి.కేశవ్‌తో కలిసి గురువారం చర్చించారు. ఈ వారంలో ప్రపంచ బ్యాంకు బృందం పోలవరం పర్యటన, నిర్వాసితుల సమస్యల నేపథ్యంలో చర్చలు సాగాయి. చర్చల్లో జలవనరుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, జలవనరుల శాఖ సలహాదారులు వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజినీర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన దొండపాటి నాగరత్నం (60), ఆమె కొడుకు దొండపాటి రామదాసు విద్యుత్ షాక్‌కు గురై చనిపోయారు. దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. దీంతో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా ప.గో. జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ రోజు కరెంట్ షాక్‌తో భార్యాభర్తలు చనిపోయిన విషయం తెలిసిందే.
ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో ‘డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్’ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. కాగా దీనికి ‘కల్కి 2898AD’ సినీ నిర్మాత అశ్వినీ దత్ రూ.5 లక్షల విరాళం అందించినట్లు RRR తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉండి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు, రైతులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు విదేశీ నిపుణుల బృందం ఈనెల 30న వస్తున్నారని ప్రాజెక్టు ఈఈ మల్లికార్జునరావు తెలిపారు. ఈనెల 29వ రాత్రికి పోలవరానికి ఈ బృందం చేరుకుని ప్రాజెక్టు అతిథి గృహంలో బస చేస్తారని, 30 ఉదయం నుంచి పోలవరం ప్రాజెక్టులో ఎగువ, దిగువ కాపర్ డ్యాంలు, డయాఫ్రంవాల్ ప్రాంతాలను పరిశీలిస్తారని తెలిపారు. ఈనెల 27న ఈ బృందం రావాల్సి ఉండగా పలు కారణాల వల్ల తేదీలు మారినట్టు ఈఈ తెలిపారు.
పోలవరంలో మండలం వింజరం పంచాయతీలో చిరుతపులి మేకను చంపినట్లు అధికారులు గుర్తించారు. కోటేశ్వరరావు మేకలు మేపుకునే వాడు.అయితే అందులో ఒకటి కనిపించడం లేదని అడవిలో గాలిస్తుండగా బుధవారం కళేబరం కనిపించింది.సమాచారం అందుకున్న అధికారులు పోలవరం పరిసరాల్లో చిరుత సంచరిస్తోందని ఎవరూ అడవిలోకి వెళ్లొద్దని , జీవాలను బయటకు వదలొద్దని ఇన్‌ఛార్జ్ రేంజర్ ఎం.దావీద్ రాజ్ తెలిపారు.
నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలో గ్రీన్ అంబాసిడర్‌గా పనిచేస్తున్న చంద్రపాల్(55) బుధవారం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. తాగునీటి సరఫరా సమయంలో రేకుల షెడ్డులో ఉన్న మోటారు వేసే సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
బాధిత మహిళల సహాయం కోసం ఏర్పాటు చేసిన ‘వన్ స్టాప్ సెంటర్’లో మెరుగైన సహాయం అందించాలని ఏలూరు నూతన కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని ‘దిశ వన్ స్టాప్ సెంటర్’ను బుధవారం సాయంత్రం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాధిత మహిళలు, పిల్లలకు అందుతున్న సేవలను పరిశీలించారు. సెంటర్‌కు వచ్చిన మహిళలు, పిల్లలకు సిబ్బంది సరైన మార్గదర్శకం చేయాలన్నారు.
కమ్యూనికేషన్, టీం వర్క్, క్రిటికల్ థింకింగ్, భావోద్వేగ మేధస్సు వంటి నైపుణ్యాలను అలవర్చుకొని ఔత్సాహిక రంగాల్లో యువత అభివృద్ధి చెందాలని వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ టి.జానకిరామ్ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. స్టూడెంట్ అఫైర్స్ డీన్ సలోమి సునీత, అధ్యాపకులు పాల్గొన్నారు.
చిరుత దాడిలో మేక హతమైన సంఘటన పోలవరం మండలంలో కలకలం రేపింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీ క్షేత్ర అధికారి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సున్నాలగండి గ్రామానికి చెందిన కోటేశ్వరరావు తన పశువుల పాకలో కట్టేసిన మేక కనిపించడం లేదని సమీప అటవీ ప్రాంతంలో వెతికాడు. తల లేకుండా మొండెంతో ఉన్న మేక కళేబరం కనిపించింది. పాదముద్రల ఆధారంగా చిరుత దాడి జరిగినట్లుగా అధికారుల తేల్చారు.
Sorry, no posts matched your criteria.