India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప.గో జిల్లా పాలకొల్లులోని 18వ వార్డుకు చెందిన 13నెలల పాప వైద్యానికి ఇచ్చిన మాటను మంత్రి నిమ్మల రామానాయుడు నిలబెట్టుకున్నారు. విజయవాడలోని ఆస్పత్రికి వెళ్లి చిన్నారి అక్షరను చూశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆ పాపకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులతో మాట్లాడారు. వార్డులోకి వెళ్లి ఆ చిన్నారి తల్లిదండ్రులను పలకరించారు. సీఎం సహాయ నిధి మంజూరు కోసం నిమ్మల గతంలోనే ఫోన్ చేసి మాట్లాడిన విషయం తెలిసిందే.
టమాట సీజన్ ముగియడంతో ధర పెరిగిపోతోంది. ప్రస్తుతం దిగుమతులు తగ్గడంతో నెల రోజుల్లోనే టమాట ధర రెట్టింపైంది. మంగళవారం తాడేపల్లిగూడెం బహిరంగ మార్కెట్లో కిలో టమాట రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయించారు. జిల్లాలోని పలు ప్రాంతాల రైతు బజార్లలో రూ.68 వరకు విక్రయిస్తున్నారు. సామాన్యులకు టమాట అందని పరిస్థితి నెలకొంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఈనెల 27 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా ప్రజా పరిషత్ సీఈవో సుబ్బారాబు ఓ ప్రకటన విడుదల చేశారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి ఏలూరు జిల్లా ప్రజా పరిషత్‌లోని ఛైర్‌పర్సన్ ఛాంబర్‌లో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా ముదినేపల్లిలో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తే ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. HYDలో ముద్దాయిని పట్టుకొని కైకలూరు కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపర్చినట్లు తెలిపారు.
ప.గో జిల్లాలో వీరవాసరం మండలం పెరికిపాలెం గ్రామానికి చెందిన జ్యోతి(38) ఈనెల 24వ తేదీన ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు గమనించి పాలకొల్లు ఆసుపత్రి తరలించగా.. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు భర్త పోతరాజు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు వీరవాసనం ఎస్సై రమేష్ తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంగళవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా సమస్యలపై చర్చించారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మంత్రి దుర్గేష్, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ మెయింటనెన్స్ దృష్ట్యా గతంలో రద్దు చేసిన 6 రైళ్లను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు విశాఖ-లింగంపల్లి(12805నెంబర్ రైలు), చంగల్‌పట్టు-కాకినాడ పోర్టు(17643) రైళ్లు.. జూన్ 26న విజయవాడ-కాకినాడ(17257), కాకినాడ పోర్టు-విజయవాడ(17258), లింగంపల్లి-విశాఖ(12806), కాకినాడ పోర్టు-చంగల్‌పట్టు(17644) రైళ్లు ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొన్నారు.
తాడేపల్లిగూడెంలో ఆదివారం గల్లంతయిన బాలుడి మృతదేహాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. మణికంఠ అనే బాలుడు సెలూన్ షాపుకు వెళ్లి యాగర్లపల్లి ఏలూరు కాలువలో దిగి గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన బాలుడి కోసం ఎన్.డి.ఆర్.ఎఫ్, పోలీసు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం తాడేపల్లిగూడెంలోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో మణికంఠ మృతదేహం గుర్తించారు.
ఏలూరు జిల్లాలో కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జేసీ బి. లావణ్యవేణి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా ధరల నియంత్రణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. టమాటా, ఉల్లి, కూరగాయల ధరలు బాగా పెరిగాయని, వాటి నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో పుష్పమణి , జిల్లా వ్యవసాయ శాఖాధికారి హబీబ్ బాషా, ఉద్యాన శాఖ ఏడీ రామ్మోహన్ పాల్గొన్నారు.
పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులను త్వరలో అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించనుంది. ఈ నెల 27న రాష్ట్రానికి కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టు పరిశీలనకు అమెరికా, కెనడా దేశాలకు చెందిన నలుగురు ఇంజినీరింగ్ నిపుణుల బృందం రానుంది. ప్రాజెక్టు వద్ద ఈసీఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణానికి సవాలుగా ఉన్న డయాఫ్రంవాల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల సీపేజీ అంశాలను పరిశీలించనున్నారు.
Sorry, no posts matched your criteria.