India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గోదావరి పుష్కరాల నిర్వహణకు ముహూర్తం ఖరారయింది. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది. 2027 జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు ఈ పుష్కరాలు జరగనున్నాయి. ఈసారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. దీంతో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్ల నిధులతో ప్రతిపాదనలు అధికార యంత్రాంగం సిద్ధం చేసింది.
తిరుపతిలోని ఓ ప్రైవేటు లాడ్జిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత బాలిక 9వ తరగతి చదువుతోంది. వెస్ట్ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన సతీష్(22) చెన్నైలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. ఇతనికి అన్లైన్ ద్వారా ఓ బాలిక పరిచయమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అతనిపై అలిపిరి పోలీసులు కేసు నమోదుచేసి రిమాండుకు తరలించారు.
పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించారు. కొద్దిసేపు జిల్లా వ్యవహారాలపై చర్చించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శనివారం భీమవరం రానున్నారు. ఉదయం 9.30 గంటలకు టీడీపీ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. 10.30 గంటలకు స్థానిక మల్టీప్లెక్స్ ఆవరణలో కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, కూటమి నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 12 గంటలకు కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించనున్నట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి.
కార్తీక మాసం సందర్భంగా సముద్ర తీర ప్రాంతాలు, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు, కాలువల వద్ద పుణ్య స్నానాలు ఆచరించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని పంచారామ క్షేత్రాలైన పాలకొల్లు, భీమవరంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలీసు వారు సూచించే నిబంధనలు భక్తుల రక్షణ, భద్రత కోసమేనని చెప్పారు.
పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామంలో శుక్రవారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసిందని ఆయన అన్నారు.
ఏలూరు జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. నేడు ఉదయం 11.30కి రోడ్డు మార్గం ద్వారా రాజమండ్రి నుంచి ద్వారకాతిరుమల (M) జగన్నాథపురం చేరుకుని లక్ష్మీనరసింహస్వామి దర్శించుకోనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం 2 గంటలకు ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అక్కడ ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించనున్నారు. 2.55 గంటలకు గ్రామంలో పింఛన్లు ఇవ్వనున్నారు.
గోపాలపురం నియోజకవర్గంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉదయం 10 గంటలకు ద్వారకతిరుమల మండలం, జగన్నాథపురానికి వస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం దీపం పథకం కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఏలూరు తూర్పు వీధి గౌరమ్మ గుడి వద్ద గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో ఒకరు మృతి చెందారు. దీపావళి బాణసంచా తీసుకెళ్తుండగా బైక్ అదుపుతప్పి గోతిలో పడింది. ఈ సమయంలో బాణసంచా పేలిపోవడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఏలూరు 1టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉండ్రాజవరం మండలం సూర్యరావుపాలెంలో బాణసంచా కేంద్రంపై పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వెగిరోతు శ్రీవల్లి, గుమ్మడి సునీత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన ఐదుగురికి మెరుగైన వైద్యం అందించాలని, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.