India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చింతకొమ్మదిన్నె మండలంలోని రింగ్ రోడ్డు సర్కిల్ వద్ద రేకుల షెడ్డులో విద్యుత్ షాక్‌తో మోక్షిత్ అనే బాలుడు శనివారం మృతి చెందాడు. వర కుమార్ అనే వ్యక్తి చైతన్య స్కూల్ హాస్టల్ విద్యార్థులకు బట్టలు ఉతికే కాంట్రాక్టు తీసుకుని హాస్టల్ బయట ఉన్న రేకుల షెడ్డులో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. స్నానం కోసం వేడినీళ్ల కోసం బకెట్లో ఉంచిన ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ తగిలి అతని కుమారుడు మోక్షిత్ షాక్‌తో మృతి చెందాడు.

వల్లూరు మండలంలోని పుష్పగిరి పుణ్యక్షేత్రంలో శుక్రవారం పెన్నా నది నీటిలో గల్లంతైన గణేశ్ అనే యువకుడి కోసం శనివారం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు, బంధువులు, రెస్క్యూ టీంతో పాటు జాలర్ల ద్వారా ట్యూబులు, రబ్బరు బోటు సహాయంతో నది వెంబడి గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు యువకుడికి సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు.

ఈనెల 19వ తేదీ నుంచి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప జిల్లా పర్యటన ఖరారైందని ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ రాజా ఒక ప్రకటన ద్వారా తెలిపారు. శనివారం ఆయన తెలుపుతూ.. 19వ తేదీ మంగళవారం కడపలోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇడుపులపాయకు చేరుకుంటారన్నారు. 20న ఇడుపులపాయ నుంచి కడపకు చేరుకుని అక్కడి నుంచి కలెక్టరేట్‌కు వెళ్తారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో అందుబాటులో ఉంటారన్నారు.

మైదుకూరు పట్టణ పరిధిలోని నంద్యాల రోడ్డు 18వ వార్డులో నివాసం ఉంటున్న చొక్కమ్ అచ్చమ్మ మిద్దె మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి శనివారం కుప్పకూలింది. ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూలడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అధికారులు స్పందించి పరిహారం అందించి న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.

ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 18న ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ, సీడ్యాప్, జిల్లా ఉపాధి కార్యాలయం అధ్వర్యంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళాను నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ అశోక్ బాబు శనివారం తెలిపారు. షిరిడీసాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్, అమర్ రాజ, ఏఐఎల్ డిక్సన్, నవభారత ఫెర్టిలైజర్స్, యంగ్ ఇండియా కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.

అన్నమయ్య జిల్లా శెట్టిగుంట సమీపంలో శుక్రవారం రైలు<<14622107>> కిందపడి విద్యార్థినికి తీవ్ర గాయాలై<<>>న విషయం తెలిసిందే. విద్యార్థిని బద్వేలు మండలం రాజుపాలెంకి చెందిన రామసుధ(20)గా రైల్వే పోలీసులు విచారణలో గుర్తించారు. ఈమె తిరుపతిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతోంది. తిరుపతి నుంచి రైలులో ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

కడప నగరంలోని పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు నేటి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జరగబోయే ఉరుసు మహోత్సవాలకి ప్రముఖ నటుడు ‘రామ్ చరణ్, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్’ రానున్నారు. కాగా బుధవారం రోజు ప్రముఖ గాయకుడు మనో (నాగూర్ బాబు) దర్గాను దర్శించారు. నేడు జరగబోయే గంధ మహోత్సవంలో AR రెహమాన్, 18వ తేదీ ముషాయిరా కార్యక్రమానికి రామ్ చరణ్ వస్తున్నట్లు సమాచారం.

కడప నగరంలో ప్రసిద్ధిగాంచిన ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఉరుసు ఉత్సవాలలో భాగంగా.. మొదటి రోజు గంధ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటలకు పిఠాధిపతి ఇంటి వద్ద నుంచి మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకునివచ్చి దర్గాలోని మాజర్ల వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ గంధ మహోత్సవంలో కలెక్టర్‌తోపాటు ప్రముఖులు పాల్గొననున్నారు.

రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ నిర్మితమై ఉన్న సంస్థలను, అమరావతికి తరలించకుపోతూ, ఈ ప్రాంతాన్ని శ్మశానంగా చేస్తారా అని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి ప్రశ్నించారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. జగన్ మీద కోపంతో రాయలసీమ ప్రజలకు అన్యాయం చేయవద్దని, కరవు సీమలో హైకోర్టు ఏర్పాటు చేయకపోవడమే కాకుండా, ఉన్న న్యాయ సంస్థలు అమరావతికి తరలించడం ఏంటని నిలదీశారు. సీమకు అన్యాయం చేస్తుంటే ఊరుకోమన్నారు.

ప్రముఖ సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ రేపు కడపకు రానున్నారు. కడప పెద్ద దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాలలో భాగంగా గంధం వేడుకలకు ఆయన హాజరవుతారు. ఈ దర్గాలో జరిగే ప్రతి ఉరుసు కార్యక్రమంలో గత కొన్ని ఏళ్లుగా ఏఆర్ రెహమాన్ పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికే ఉరుసు ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం సిద్ధం చేస్తుంది.
Sorry, no posts matched your criteria.