India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అవినీతికి పాల్పడ్డ ముగ్గురు రెవెన్యూ అధికారులను కలెక్టర్ శివ శంకర్ సస్పెండ్ చేశారు. బద్వేల్ డివిజన్ మున్నెల్లి రెవెన్యూ గ్రామంలోని ZPH పాఠశాలకు చెందిన స్థలాన్ని అప్పటి డిప్యూటీ MRO విద్యాసాగర్, సర్వేయర్ ప్రవీణ్, వీఆర్వో గురవయ్య నిబంధనలకు వ్యతిరేకంగా వేరొకరికి ఆన్‌లైన్ చేశారు. దీనిపై బద్వేలు ఇన్‌ఛార్జ్ ఆర్డీవో విచారణ చేసి కలెక్టర్‌కు నివేదిక అందించడంతో ముగ్గురిని సస్పెండ్ చేశారు.
యోగి వేమన యూనివర్సిటీ ఇంగ్లిష్ డిపార్ట్‌మెంట్ ఆచార్యులు ప్రొఫెసర్ పి.పద్మ వైస్ ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమెకు నియామకపు పత్రాన్ని వీసి ప్రొ కె.కృష్ణారెడ్డి అందజేశారు. ఈ స్థానంలో పనిచేస్తున్న ప్రొ.షావలిఖాన్ కర్నూల్ ఉర్దూ యూనివర్సిటీకి వీసీగా నియమితులు కావడంతో ఆచార్య పద్మను నియమించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. రఘునాథ రెడ్డి పాల్గొన్నారు.
ప్రజలు నుంచి అందే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు ఎస్.పి(అడ్మిన్) సుధాకర్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ వెంకట రాముడు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితులతో మాట్లాడారు. బాధితులకు తక్షణ న్యాయాన్ని అందించాలన్నారు.
కడప – కమలాపురం రైల్వే మార్గంలో ఆదివారం నాగర్ సోల్ రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు. మృతునికి సంబంధించిన వివరాలు తెలిసినవారు కడప రైల్వే పోలీస్ స్టేషన్ SHO నాగరాజు నాయక్‌ను సంప్రదించాలని తెలిపారు.
నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కడప జిల్లాకు చెందిన MLAలు జిల్లాలోని సమస్యలపై తమ గళం విప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు దృష్టి సారించాలి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అటవీశాఖ అభ్యంతరంతో నిలిచిపోయిన పాపాగ్ని వంతెన నిర్మాణంపై దృష్టి సారించాలి. మరి మీ ఎమ్మెల్యే ఏ అంశంపై గళం విప్పాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.
గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ అభాసుపాలు చేసి తాము సచ్చీలులమని ప్రకటించుకున్న కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే విధ్వంసకర పాలన సాగిస్తోందని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డి మండిపడ్డారు. ఇదే కొనసాగితే ఐదు నెలల్లో కూటమి కుప్ప కూలక తప్పదని జోస్యం చెప్పారు. గత ప్రభుత్వం కన్నా ప్రస్తుతం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దయనీయంగా ఉండటం కలవరపాటుకు గురి చేసిందన్నారు.
ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ IIIT గ్రంథాలయం వేదికగా IIIT 2024-25 విద్యా సంవత్సర ప్రవేశాల ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు జులై 22, 23వ తేదీలలో ఆర్కేవ్యాలీ IIIT, 24, 25 తేదీలలో ఒంగోలు IIIT అడ్మిషన్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కాగా తొలి జాబితాలో ఎంపికైన విద్యార్థులకు సోమవారం ధ్రువపత్రాలు పరిశీలించి అడ్మిషన్లు కల్పించనున్నారు.
చారిత్రక నిర్మాణమైన గండికోటకు ప్రపంచస్థాయి పర్యాటక శోభను తీసుకొస్తామని కలెక్టర్ లోతేటి శివ శంకర్ అన్నారు. ఆదివారం గండికోటను ఆర్డీవో శ్రీనివాసులు, స్వదేశీ దర్శన్ 2.0 ప్రాజెక్టు అధికారులు, పర్యాటక శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. మొదటగా గండికోటలోని జుమా మసీదును పరిశీలించారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సభ్యులు గండికోట విశేషాలు తెలియజేశారు.
కడప నగరంలోని డీఈవో కార్యాలయంపై దాడి ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2 రోజుల క్రితం పాత ఆర్జేడిపై జరుగుతున్న విచారణకు ఆటంకం కలిగించేలా ఐదుగురు ఘర్షణకు దిగి దాడి చేసి తన సెల్ఫోన్ పగలగొట్టారని ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సుండుపల్లి ఎంఈవో వెంకటేశ్ నాయక్, ఉపాధ్యాయులు ఆదినారాయణ రెడ్డి, నాగమణి రెడ్డి, శివకుమార్ రెడ్డి, రామకృష్ణలపై కేసు నమోదు చేశారు.
కడప నగరంలో ఓ యువకుడు ఓవర్ స్పీడ్ కారణంగా తనకు గాయమైనట్లు 1 టౌన్ ఎస్సై మధుసూదన్ తెలిపారు. శనివారం సాయంత్రం రాజీవ్ పార్క్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించిన సమయంలో ఓ యువకుడు వేగంతో వచ్చిన బైక్‌ను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తన చేయి విరిగిందని ఎస్సై చెప్పుకొచ్చారు. కానీ.. బైక్ ఆపలేదనే నెపంతో తనను ఎస్సై కొట్టాడని ఆ <<13672081>>యువకుడు<<>> తెలిపిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.