India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మద్యం కోసం డబ్బు ఇవ్వలేదని కోపంతో బ్లేడుతో తల్లిపై కొడుకు దాడి చేసిన ఘటన కడపలో జరిగింది. నగరంలోని రాజారెడ్డి వీధిలో నివాసం ఉంటున్న కొండమ్మపై అమె కుమారుడు రాకేశ్ శనివారం బ్లేడుతో దాడి చేశాడు. తనకు మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఆమె కుమారుడు తల్లిపై బ్లేడుతో దాడి చేయడంతో ఆమె చేతికి గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
జాతీయ రహదారుల అభివృద్ధి పనుల్లో భాగంగా జిల్లాలో చేపడుతున్న భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వ లక్ష్యం మేరకు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ లోతేటి శివశంకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కడప కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారులు, రైల్వేలైన్ల నిర్మాణం, వాటి అభివృద్ధికి అదనంగా చేపడుతున్న భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
కడప జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా అదితిసింగ్‌ను నియమిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత జాయింట్ కలెక్టర్ గణేశ్ కుమార్‌ను బదిలీ చేస్తూ నూతన జేసీగా 2020 బ్యాచ్‌కు చెందిన అదితి సింగ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. త్వరలో ఈమె బాధ్యతలు చేపట్టనున్నారు.
కడప నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి తేజ్ భరత్‌ను నియమిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దాదాపు రెండేళ్ల పాటు నగరపాలక సంస్థ కమిషనర్‌గా సూర్య సాయి ప్రవీణ్ కడపలో పనిచేశారు.
కడప నగర పాలక సంస్థ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న 2019 ఐఏఎస్ అధికారి జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ సీఆర్డీఏ అదనపు కమిషనర్‌గా బదిలీ అయ్యారు. కడపను అభివృద్ధి చేయడంలోనూ, సుందరంగా తీర్చిదిద్దడంలోనూ ఈయన ఎనలేని సేవలందించారని నగర ప్రజలు అంటున్నారు. కడప నగరపాలక సంస్థ కమిషనర్‌గా 2018 ఐఏఎస్ అధికారి తేజ్ భరత్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత ఆ రాష్ట్ర సీఎం ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టడం ఆనవాయితీ అని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. శనివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఛైర్ పర్సన్ వైసీపీ కాబట్టి మాజీ సీఎం, మాజీ ఎమ్మెల్యేల ఫొటోలను మున్సిపల్ కార్యాలయంలో పెట్టాలనడం అది వారి అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. గతంలో మీరు ఫొటోలు మార్చినప్పుడు తాము పట్టించుకోలేదన్నారు.
✎ కడపలో కొడుకు హత్య.. బాధ లేదంటున్న తండ్రి
✎ వైసీపీ నేతలు రూ.కోట్లు దోచుకున్నారు: మండిపల్లి
✎ ప్రొద్దుటూరు ఎఫ్బీఓ సస్పెన్షన్
✎ వైసీపీపై భూపేశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
✎ జగన్‌కు బుద్ధి ఉందా: TNSF
✎ పుల్లంపేటలో రౌడీ షీటర్ సూసైడ్
✎ సమస్యలు ఉంటే నేరుగా కడప కలెక్టర్‌కు ఫోన్ చేయవచ్చు
✎ ప్రొద్దుటూరులో ఫొటోల వివాదం
✎ రాజకీయ లబ్ధి కోసమే జగన్ పర్యటనలు: బీటెక్ రవి
✎ ముద్దనూరులో వేపరాల వాసి మృతి
ముద్దనూరు – జమ్మలమడుగు రహదారి సమీపంలో ఉన్న వనంలో ఓ మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఎస్సై మైనుద్దీన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు షరాబు రామచంద్ర ఆచారి (49)అని ఎస్సై తెలిపారు. మైలవరం మండలంలోని వేపరాలకు చెందిన రామచంద్ర చికిత్స కోసం తిరుపతికి ఆసుపత్రికి వెళ్తున్నానని చెప్పి వారం రోజుల క్రితం ఇంటి నుంచి వచ్చాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సుండుపల్లి మండలం సానిపాయ అటవీ ప్రాంతంలో 8 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని, ఒకరిని అరెస్ట్ చేశామని టాస్క్ ఫోర్సు పోలీసులు తెలిపారు. సానిపాయ బేస్ క్యాంపు నుంచి రాయవరం మీదుగా ఆవుల దారి, ముడుంపాడు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తుండగా కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుంటూ వెళుతూ కనిపించారన్నారు. వారిలో ఒకరిని పట్టుకున్నామని తెలిపారు. 8 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
కడప జిల్లాలోని ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ శివశంకర్ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇకపై ప్రతి సోమవారం డయల్ యువర్ కలెక్టర్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో కలెక్టర్ తెలిపారు. ప్రతి సోమవారం 9:30 నుంచి 10:30 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్యలపై 08562-244437 నంబర్‌కు ఫోన్ చేసి నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. SHARE IT
Sorry, no posts matched your criteria.