Y.S.R. Cuddapah

News July 19, 2024

ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించాలి: కడప ఎస్పీ

image

పోలీసు వృత్తిపట్ల నిబద్దత, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ అధికారులకు సూచించారు. కడప పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభావవంతంగా విధులు నిర్వర్తించే ‘విజిబుల్ పోలీసింగ్’ పై ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆదేశించారు. ఫిర్యాదులను ప్రాధాన్యతతో నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు.

News July 19, 2024

లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు: కలెక్టర్

image

సమాజంలో ఆడపిల్లల శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒకరూ కృషి చేయాలని, లింగ వివక్షతను చూపే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి పేర్కొన్నారు. గర్భస్థ శిశు నిర్ధారణ పరీక్షల నిర్మూలనపై కడప కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరిగింది. బాలల లింగ నిష్పత్తిని గమనిస్తే.. బాలురతో పోలిస్తే బాలికల శాతం చాలా తక్కువగా ఉందన్నారు. ఈ అసమానతలను తొలగించి సమాజంలో ఆడపిల్లల శాతాన్ని పెంచాలన్నారు.

News July 18, 2024

కడప: మాజీ ఆర్జేడీపై విచారణ వేగవంతం

image

కడప జిల్లా పూర్వపు పాఠశాల అర్జేడీ రాఘవరెడ్డిపై అధికారులు విచారణ చేపట్టారు. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని, గవర్నర్‌ను కలిసి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్జేడీ రాఘవరెడ్డిని విద్యాశాఖకు సరెండర్ చేసి విచారణ అధికారిగా హెడ్ ఆఫీస్ లో పనిచేస్తున్న ప్రసన్న కుమార్‌ను నియమించారు. ఆయనకు వ్యతిరేకంగా పలువురు ఉపాధ్యాయులు వచ్చినట్లు సమాచారం.

News July 18, 2024

కడప ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా విశ్వనాథకుమార్

image

డాక్టర్ YSR ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా జి.విశ్వనాథ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఏ.యూ ఆర్కిటెక్చర్ విభాగం విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్నారు. విశ్వనాథ్ కుమార్‌ను ఇన్‌ఛార్జ్ వీసీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రేపు ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

News July 18, 2024

యోగివేమన యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా కృష్ణారెడ్డి

image

డప యోగివేమన యూనివర్సిటీకి ఇన్‌ఛార్జ్ ఉపకులపతిగా కృష్ణారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలకు ఇన్‌ఛార్జ్ వీసీలను నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కడప వైవీయూకు కృష్ణారెడ్డిని నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈయన గతంలో వైవీయూ ప్రిన్సిపల్‌గా వ్యవహరించారు.

News July 18, 2024

సిద్దవటం: పాము కాటుకు చిన్నారి మృతి 

image

సిద్దవటం మండలం మాచుపల్లిలో గురువారం విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కందుల భానుశ్రీ (7) పాము కాటుకు గురై చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు చిన్నారి తల్లి లక్ష్మీదేవి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. భానుశ్రీ నిన్న సాయంత్రం ఇంటి పక్కన తన చెల్లితో ఆడుకుంటుండగా పాము కాటు వేసింది. కుంటుంబ సభ్యులు చిన్నారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నేడు మృతి చెందింది.

News July 18, 2024

కమలాపురం: రైలు కింద పడి వ్యక్తి మృతి

image

కమలాపురంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రైల్వే గేటు సమీపంలోని పట్టాలపై వ్యక్తి డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

News July 18, 2024

వేముల: 21న రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు

image

వేముల మండలం భూమయ్యగారి పల్లెలో ఈనెల 21న గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన ఎద్దుల యజమానులకు మొదటి బహుమతి లక్ష రుపాయలు, ద్వితీయ బహుమతి రూ.80,000లు, 3వ రూ.60,000లు, 4వ రూ.50,000, 5వ రూ.40,000లు, 6వ రూ.30,000లు, 7వ రూ.20,000 8వ బహుమతి రూ.10,000లు అందించనున్నట్లు తెలిపారు.

News July 18, 2024

యునివర్సిటీ లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

పులివెందులకు చెందిన ఓ విద్యార్థిని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన ఘటన బుధవారం జరిగింది. విద్యార్థిని SKUలో MBA రెండో సంవత్సరం చదువుతోంది. వసతి గృహంలో ఉరివేసుకుంటున్న ఆమెను చూసి తోటి విద్యార్థినులు కేకలు వేయడంతో ప్లంబింగ్ పనులు చేస్తున్న సిబ్బంది కాపాడారు. అనంతరం ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

News July 18, 2024

‘పేరుకే రైల్వేకోడూరు.. ముఖ్యమైన రైళ్లు ఆగవు’

image

రైల్వేకోడూరులోని రైల్వేస్టేషన్లో డిజిటల్ బోర్డులు, పార్కింగ్, సి.సి కెమెరాలు, లిఫ్ట్ సౌకర్యం కల్పించాలని బీజేపీ రైల్వే కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. పేరుకే రైల్వేకోడూరు కానీ ఇక్కడ ముఖ్యమైన రైళ్లు ఆగవు అంటూ నిరసన తెలిపారు. హరిప్రియ ఎక్స్ప్రెస్, వాస్కోడిగామా, ముంబై ఎక్స్ప్రెస్ రైళ్లకు “స్టాపింగ్” కల్పించాలని రైల్వేస్టేషన్ మాస్టర్‌కు వినతి పత్రం అందజేశారు.