India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వేసవిని తలపించే విధంగా ఎండలు కాసి ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందారు. శుక్రవారం సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తున్నాయి. రెవెన్యూ డివిజన్లో శనివారం 97.0 మిమీ, బ్రహ్మంగారిమఠం 12.2. కాశినాయన 28.2, కలసపాడు 30.4, పోరుమామిళ్ల 21.2,బి.కోడూరు 10.8, బద్వేలు 3.6,గోపవరం 3.2, అట్లూరులో 16.6,వర్ష పాతం నమోదైనట్లు వ్యవసాయ గణాంక అధికారిణి క్రిష్ణవేణి తెలిపారు.
కడప నగర శివారులోని ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేవీకే జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వీరయ్య తెలిపారు. ఈ శిక్షణ పై ఆసక్తి ఉన్నవారు 98488 09236 నంబర్‌కు కాల్ చేసి తమ పేరును నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు.
ముద్దనూరు మండలం సామాజిక పింఛన్లకు అనర్హులైన కొందరు లబ్దిదారులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పింఛన్లు పొందుతున్న 57 మందిని ప్రభుత్వం తొలగించినట్లు ఎంపీడీఓ చంద్రమౌళీశ్వర్ తెలిపారు. ఆ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు సంబంధించి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల తదితర పింఛన్లు 5,318 ఉన్నాయన్నారు. కొందరు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పింఛన్లు పొందుతున్నారన్నారు.
గాలివీడు మండలంలోని రెడ్డివారిపల్లెకు చెందిన మైనర్ బాలికకు ఆమె తల్లిదండ్రులు, వారి బంధువుల ప్రోద్బలంతో ఆగస్టు 22న వివాహం జరిపించారు. ఈ విషయమై ఐసిడిఎస్ సూపర్వైజర్ ఫిర్యాదు మేరకు బాల్య వివాహ నేర చట్టం క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారణ అనంతరం పెళ్లి కుమారుడు, వారి తల్లిదండ్రులు, బంధువులు మొత్తం 7 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
కడప నగరం వై.ఎస్. రాజారెడ్డి స్టేడియంలో ఆదివారం నిర్వహించాల్సిన అండర్- 14 కడప జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలు వర్షం కారణంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఏ. రెడ్డి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వర్షం తగ్గిన తర్వాత మళ్లీ ఎప్పుడు ఎంపికలు నిర్వహించేది. త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నారు
సింగిల్ విండో విధానంతో గణేశ్ ఉత్సవాల అనుమతులు పొందవచ్చని జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. విగ్రహ పర్మిషన్లు సులభతరం చేయటానికి ప్రత్యేక పోర్టల్ రూపొందించినట్లు వెల్లడించారు. గణేశ్ ఉత్సవ నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వివరాలకు 7995095800 మొబైల్ నంబర్ ద్వారా అనుమతులు కోరాలని తెలిపారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపటి నుంచి మూడు రోజులపాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటన వివరాలు తెలిపారు. రేపు ఆమె హైదరాబాద్ నుంచి కడప విమానాశ్రయం చేరుకొని ఇడుపులపాయకు వెళ్లి రాత్రి బసచేస్తారు. 2వ తేదీ తన తండ్రి YSR సమాధి వద్ద నివాళులర్పిస్తారు. 3వ తేదీ జిల్లా కలెక్టర్‌ను కలిసి కార్యకర్తలకు అందుబాటులో ఉంటారన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరికాసేపట్లో కడపకు రానున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో కడపకు రానున్నారు. పర్యటనలో భాగంగా పెండ్లిమర్రి మండలంలోని మాచునూరుతో పాటు మరో గ్రామంలో ఆయన పర్యటించనున్నారు. అనంతరం రోడ్డు మార్గాన పులివెందులలోని ఆయన నివాసానికి చేరుకుంటారు.
ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే పెన్షన్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామున నుంచి అట్టహాసంగా ప్రారంభమైంది. కడప నగరంలోని నాగరాజు పేటలో జిల్లా కలెక్టర్ శివశంకర్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. జిల్లా వ్యాప్తంగా నేడు 2,63,283 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి రూ.112.22 కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 100శాతం ఫించన్లను నేడే అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక పంపిణీ ప్రక్రియను జిల్లాలో నిర్దేశించిన బుకింగ్ కేంద్రాల్లో సజావుగా చేపడుతున్నట్లు కడప కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని స్టాక్ యార్డుల వద్ద ఇసుక పంపిణీ, వినియోగదారుల సంతృప్తి, రవాణా పై.. రాష్ట్ర మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప నుంచి కలెక్టర్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.