India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం చంద్రబాబును సచివాలయంలో శుక్రవారం రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి కలిశారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు. రోడ్లు, రైల్వే కోడూరు ఆర్టీసీ బస్టాండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కోడూరు నుంచి వెంకటగిరి రోడ్డు, గాలేరు-నగరి కాలువ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరినట్లు ఆయన తెలిపారు.
కడప జిల్లా వ్యాప్తంగా రేపు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. 1వ తేదీన ఆదివారం అవడంతో ముందు రోజునే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. వంద శాతం పింఛన్ పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు
మైదుకూరు పట్టణానికి చెందిన జర్నలిస్ట్ నాగ శివారెడ్డి రెండో కుమార్తె మానస రెడ్డి 86 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా నాగశివారెడ్డి మాట్లాడుతూ.. అమెరికాలో ఎం.యస్ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. భారీ వేతనంతో మానస ఉద్యోగం సాధించడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందిస్తున్నారు.
సెప్టెంబరు నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఈ నెల 31వ తేదీన పంపిణీ చేయనున్నట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. సెప్టెంబరు 1న ఆదివారం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. 31వ తేదీన పెన్షన్లు అందకపోతే సెప్టెంబరు 2వ తేదీన పింఛన్లు అందజేస్తామన్నారు. 2 వ తేదీ తర్వాత పింఛన్లు అందవని, కావున పింఛనర్లు ఈ నెల 31న గ్రామాల్లో అందుబాటులో ఉండాలన్నారు.
కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేయర్ సురేష్ బాబు ఇంట్లోకి చెత్త వేసేందుకు టీడీపీ కార్యకర్తలను ప్రోత్సహించాడనే ఫిర్యాదు మేరకు కడపలోని ఓ టీవీ ఛానల్ రిపోర్టర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తేజమూర్తి తెలిపారు. ఈనెల 27న మేయర్ ఇంటి ముందు చేసిన ఆందోళనకు సంబంధించి మేయర్ ఫిర్యాదు మేరకు టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు తిరుమలేష్‌తో పాటు మరి కొంతమందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
కడప నగరంలోని వైయస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ మైదానంలో సెప్టెంబర్ 1వ తేదీన జిల్లాస్థాయి అండర్-14 క్రికెట్ ఎంపికలు నిర్వహించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైయస్సార్ డిస్టిక్ కార్యదర్శి రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 2010 సెప్టెంబరు 1 తర్వాత పుట్టిన వారై ఉండాలని తెలిపారు. అర్హత గల క్రీడాకారులు భర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికెట్‌తో హాజరు కావాలన్నారు.
అమెజాన్ కంపెనీ ఆధ్వర్యంలో వేర్ హౌస్ అసోసియేట్‌గా పనిచేసేందుకు అన్నమయ్య జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీ, యువకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి, పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఇంగ్లిషు పై అవగాహన ఉన్నవారు అర్హులని తెలిపారు. సెప్టెంబరు 9 లోగా జిల్లా గిరిజన సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలన్నారు.
మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు చాలా ముఖ్యపాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని కోటిరెడ్డి సర్కిల్ ప్రాంగణంలో 3కె రన్ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. విద్యార్థి, యువత దశలో క్రీడల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
➤ కడప జిల్లా వ్యాప్తంగా ITIలో కౌన్సెలింగ్
➤ బీటెక్ రవికి ఎమ్మెల్సీ?
➤ సెప్టెంబర్ 1న ఇడుపులపాయకు వైఎస్ షర్మిల
➤ కడప జిల్లాలో పర్యటించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
➤ వైఎస్ జగన్‌తోనే నా ప్రయాణం: మేడా రఘునాథ్ రెడ్డి
➤ బీజేపీలోకి ఎర్రగంగిరెడ్డి.. స్పందించిన పురందీశ్వరి
➤ కడప: JNTU కాలేజీలో ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్య
➤ పులివెందులలో భారీగా మద్యం పట్టివేత
➤ కొండాపురం వద్ద రెండు లారీల ఢీ
ఆటోలో వెళ్తున్న మహిళలు ఏమార్చి బంగారు చైన్ దొంగతనం చేసిన ఆటో డ్రైవర్ ను కడప చిన్న చౌక్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ తేజ మూర్తి తెలిపిన వివరాల మేరకు.. స్టేషన్ పరిధిలోని మద్రాస్ రోడ్డులోని చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ వద్ద ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళను ఏమార్చి మహిళ వద్ద ఉన్న బంగారు చైన్‌ను డ్రైవర్ జఫర్ దోచుకెళ్లారు. ఇవాళ విచారణ చేసి అతని వద్ద నుంచి 51 గ్రాముల బంగారు చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.