India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాయచోటిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. కె.రామాపురంలో ఓ మహిళ 20 ఏళ్లుగా చీటీలు నడిపింది. ఈ క్రమంలో 70 మందికి పైగా రూ. 2.75 కోట్లు చీటీలు కట్టారు. గడువు తీరినా డబ్బులు చెల్లించకపోవడంతో బాధితులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
ఒంటిమిట్ట మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పెన్న పేరూరులో కదిరి ప్రభాకర్ (52) అదే గ్రామానికి చెందిన వెంకట సుబ్బారెడ్డి నిర్వహిస్తున్న దుకాణం వద్ద శనివారం అరుగుపై కూర్చున్నాడు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని వెంకటసుబ్బారెడ్డి చెప్పాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి పెనంలోని వేడి నూనె ప్రభాకర్ పై పోసి, కులం పేరుతో దూషించాడు. దీనిపై కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.
నాగు పాముకు ప్రాంతీయ పశువైద్యశాల డీడీ రంగస్వామి వైద్యం చేశారు. శనివారం స్థానిక ఆసుపత్రికి నాగు పాముకు దెబ్బ తగిలిందని స్నేక్ క్యాచర్ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. అది గమనించిన జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ రాజశేఖర్ సంబంధిత ఏడీ డాక్టర్ నేతాజీ, డీడీ డాక్టర్ రంగస్వామి పాముకు పదునైన ఇనుప వస్తువు తగులుకుని పేగులు బయటికి వచ్చినట్లు నిర్ధారణ చేశారు. పేగులు లోపలికి తోసి కుట్లు వేసి చికిత్స అందించారు.
కడప జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజును ప్రభుత్వం నియమించింది. కడప ఎస్పీగా పనిచేస్తున్న సిద్ధార్థ కౌశల్‌ను బదిలీ చేసింది. ఎన్నికల అనంతరం ఉన్నత అధికారులను బదిలీ ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగా కలెక్టర్‌ను మార్పు చేసిన విషయం తెలిసిందే. ఎస్పీగా నియమించబడ్డ హర్షవర్ధన్ రాజు గతంలో తిరుపతి ఎస్పీగా పనిచేశారు.
దువ్వూరు మండలం చల్లబసాయ పల్లె గ్రామం వద్ద ఉన్న బ్రహ్మ సాగర్ ఎస్సార్ 1లో నీరు అడుగంటింది. జలాశయంలో ప్రస్తుతం అట్టడుగునా నీరు ఉంది. జులై నెల రెండు వారాలు పూర్తయినప్పటికీ వర్షాల జాడ కనిపించడం లేదని రైతులు చెప్తున్నారు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రిజర్వాయర్‌లో నీరు అందుబాటులో ఉంటే పంటలు సాగు చేసుకోవచ్చని ఏడాది ఆరుతడి పంటలకే పరిమితం కావలసి వస్తుందని రైతులు వాపోతున్నారు.
కడప జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలలకు 2024 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు పాస్ సర్టిఫికెట్లను సంబంధిత కళాశాలలకు పంపించామని ఇంటర్ ఆర్ఐఓ బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. విద్యార్థులు నేరుగా కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించి సర్టిఫికెట్లను పొందాలని తెలిపారు.
నగదు గోల్‌మాల్ చేశారనే ఆరోపణలతో ఓ కానిస్టేబుల్‌పై వేటు పడింది. వివరాల్లోకి వెళితే.. ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జునను ఎస్పీ కృష్ణారావు గురువారం సస్పెండ్ చేశారు. విధుల్లో భాగంగా రాజంపేట కోర్టుకు నిత్యం హాజరవుతూ న్యాయస్థానానికి సంబంధించి రూ.8 లక్షల నగదును గోల్‌మాల్ చేశారనే అభియోగంతో ఆయనను సస్పెండ్ చేశారని సమాచారం.
మైలవరం మం, దొడియంకు చెందిన రేష్మ(25)కు 10 ఏళ్ల క్రితం అమృత నగర్‌కు చెందిన అన్వర్ బాషాతో ప్రేమ వివాహం జరిగింది. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భర్త అనుమానం పెంచుకున్నాడు. 10 రోజుల క్రితం భర్తతో గొడవ పడి ఆమె తన పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. శుక్రవారం భర్త ఆమె వద్దకు వెళ్లి సరదాగా పార్కు వెళ్దామంటూ పిలిచాడు. ఎకో పార్కుకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపి పూడ్చి పెట్టి, స్టేషన్‌లో లొంగిపోయాడు.
రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని సన్నిధిలో ఇకపై ప్రతినెలా నాలుగో శనివారం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం భక్తులకు అందుబాటులో ఉండనుంది. టీటీడీ ఆధ్వర్యంలో ఒక లడ్డు రూ.50 చొప్పున విక్రయిస్తారు. ఉదయం 7:30 గంటల నుంచి భక్తులు కొనుగోలు చేయవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు.
అన్నమయ్య జిల్లాకు సంబంధించి 2024-25లో రూ.13,102 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆమోదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్లతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. 2024-25కు ప్రతిపాదిత వార్షిక రుణ ప్రణాళిక అంశాలపై జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ జి.ఆంజనేయులు కలెక్టరుకు వివరించారు.
Sorry, no posts matched your criteria.