India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పులివెందులలో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై బీటెక్ రవి ఓ ఛానల్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జగన్ TDP ఏజెంట్లతో MLA ఓట్లు TDPకి వేసి, MP ఓట్లు తాము వేసుకుంటామని అన్నారు. అలా 30-40 బూత్‌ల నుంచి తనకు ఫోన్లు చేయించారన్నారు. అందుకు TDP ఏజెంట్లు తనను సరే అనమన్నారని .. తాను కుదరని ఎంపీగా భూపేశ్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టామని, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అలా చేయకండి’ అని తాను అప్పుడే చెప్పానని అన్నారు.
పులివెందుల పరిధిలోని బొగ్గుడిపల్లెలో గురువారం రాత్రి కారులో నిప్పు అంటించుకుని ప్రభాకర్ రెడ్డి (80) అనే వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. బోగుడిపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డికి గత కొద్దిరోజులుగా మతి స్థిమితం సరిగ్గా లేదు. గురువారం రాత్రి మద్యం మత్తులో కారులోకి వెళ్లి తనపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని మృతి చెందాడని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహాభారతానికి పెద్దముడియం మండలం భీమగుండంలోని బావికి సంబంధం ఉందని అక్కడి ప్రజలు భావిస్తారు. పాండవులు వనవాసంలో ఉండగా ద్రౌపది భీముడిని నీళ్లు తీసుకొని తీసుకురమ్మని చెప్తుంది. అక్కడ అంతా రాతిమయమవడంతో నీరెక్కడా కనిపించదు. భీముడు గదతో ఒక రాతిని 101 ముక్కులుగా చేసి భూమి నుంచి నీరు తెప్పించాడని గ్రామస్థులు చెప్తున్నారు. దీంతో ఆ ఊరిని భీమగుండంగా పిలుస్తారని వారు తెలిపారు. ఆ భావిని భీముని గుండంగా పిలుస్తారు.
ఈనెల 13వ తేదీన రాయచోటిలోని మాసాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ జట్టు ఎంపికలు జరుగుతాయని జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్వరరెడ్డి, సెక్రటరీ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలకు ఉమ్మడి వైయస్సార్ జిల్లాతో పాటు అన్నమయ్య జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారు హాజరు కావచ్చని తెలిపారు.
కడప ప్రభుత్వ పురుషుల కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసేందుకు ఆసక్తి, అర్హత కలిగిన వారికి ఈ నెల 15న వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. జి రవీంద్రనాథ్ తెలిపారు. కళాశాలలో ఖాళీగా ఉన్న హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జియాలజీ, జువాలజీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నెట్, సెట్, పీహెచ్డి చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని, పని గంటల ఆధారంగా వేతనం చెల్లిస్తామన్నారు.
కడప నగరంలోని ప్రకాశ్ నగర్‌కు చెందిన కాసుల మనీశ్ అనే కానిస్టేబుల్ గురువారం రాత్రి నగరంలోని ఆర్ట్స్ కళాశాల పక్కనున్న బీసీ హాస్టల్ వెనుక బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని తాళ్ల సహాయంతో బావిలోకి దిగి గాయపడిన మనీశ్ ను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
జిల్లాలో ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేయాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎన్ని ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయి, ఎంత ఇసుక లభ్యత ఉంది, నూతన ఇసుక విధానం ఏమిటి, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారని అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
సీజనల్ వ్యాధులు, డయేరియా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సాధించాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో కడప నగర కమిషనర్ ప్రవీణ్ చంద్, డీఆర్వో గంగాధర్ గౌడ్‌లతో కలిసి ప్రజారోగ్య భద్రతపై కలెక్టర్ మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖాజీపేట మండలం మిడుతూరులో 19 ఏళ్ల యువకుడు అనారోగ్యంతో మృతి చెందడం దిగ్భ్రాంతికి గురిచేసిందని కలెక్టర్ తెలిపారు.
కడప, కర్నూలు జిల్లా రేంజ్ డీఐజీగా కోయ ప్రవీణ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్వపు డీఐజీ సీహెచ్ విజయ్ రావును రాష్ట్ర పోలీస్ కార్యాలయంలో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశించారు. గత ఏడాది కర్నూలు రేంజ్ డీఐజీగా విజయరావు బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కర్నూలు రేంజి డీఐజీగా కోయ ప్రవీణ్‌ను నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
కడపలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు 23 మందికి జిల్లా న్యాయస్థానం జరిమాన విధించిందని కడప ట్రాఫిక్ సీతారామరెడ్డి తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారిపై BNS యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టులో హజరు పరిచామన్నారు. న్యాయస్థానం వారికి జరిమానా విధించింది. ఎవరైనా తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ CI V. సీతారామిరెడ్డి తెలిపారు.
Sorry, no posts matched your criteria.