India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయం వరకు కురిసిన వర్షానికి సింహాద్రిపురం మండల పరిధిలో అత్యధిక వర్షపాతం నమోదయింది. సింహాద్రిపురం మండలంలో 13.8 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కాగా, యర్రగుంట్లలో 6.8 మి. మీ., కడపలో 6.2 మి.మీ., చింతకొమ్మదిన్నె పరిధిలో 5.4 మి.మీ., ఖాజీపేటలో 3.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 64.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిల్లా సరాసరి 1.8 మి.మీ.,గా నమోదైంది.
జనాభా నియంత్రణపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని, పేదరిక నిర్మూలనకు జనాభా నియంత్రణ కీలకమని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా రాయచోటి ప్రాంతీయ వైద్యశాల నందు అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అధిక జనాభా వల్ల వచ్చే సమస్యలు, చిన్న కుటుంబాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.
మైలవరం మండలం నార్జంపల్లెలో పెట్రోల్, డీజిల్ ఖనిజాల కోసం ప్రముఖ కంపెనీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ సంస్థ సర్వే చేస్తున్నారు. గత రెండేళ్లుగా ఈ నియోజకవర్గంలో ఈ సంస్థ సర్వే నిర్వహిస్తుంది. నిన్నటితో పెద్దముడియం మండలంలో సర్వే ముగియడంతో నేటి నుంచి మైలవరం మండలంలో ఈ సర్వే ప్రారంభించారు. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ యాజమాన్యంలోని ఈ సంస్థ సర్వే చేస్తోంది.
ఖాజీపేట మండలంలోని మిడుతూరు గ్రామంలో డయేరియా మహమ్మారి విజృంభణ కలకలం రేపుతుంది. గురువారం గ్రామంలో 20 మందికి పైగా వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా డయేరియాతో సునీల్ (18) యువకుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక డాక్టర్లు పరిస్థితులను పరిశీలిస్తున్నారు.
సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు జిల్లా అధికారులు ప్రతిపాదనలను పంపారు. ఇందులో భాగంగా కడప కేంద్ర కారాగారం నుంచి 2023లో 11 మంది, 2024లో ఐదుగురు, తాజాగా నలుగురు ఖైదీలను కలిపి మొత్తం 20 మంది పేర్లతో కూడిన జాబితాను రాష్ట్ర జైల్ల శాఖ ప్రధాన కార్యాలయానికి పంపారు. రాష్ట్ర ప్రభుత్వం ఖైదీల విడుదలపై కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
నేడు అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని జనాభా అధ్యయన కేంద్ర గ్రోత్ రేట్ ఆధారంగా జనాభా గణాంకాలను విడుదల చేశారు. దీని ప్రకారం ప్రస్తుతం కడప జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 20,60,654 జనాభా ఉన్నట్లు తెలిపారు. కాగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి కడప జిల్లాలో 28,84,524 మంది ఉన్నారు. కాగా ఈఏడాది జిల్లాలో భారీగా జనాభా పెరిగిందని తెలిపారు.
TDP ప్రభుత్వం చెప్పిన ఉచిత ఇసుక అనేది అబద్ధమని MLC డీసీ గోవిందరెడ్డి విమర్శించారు. ఉచిత ఇసుక మాటలకే పరిమితమైందని, చంద్రబాబు కొత్త రకం దోపిడీకి తెరలేపారన్నారు. జగన్ హయాంలో పారదర్శకంగా ఇసుకను అందజేయడంతో రూ.కోట్ల ధనం ప్రభుత్వ ఖజానాలోకి వచ్చేదన్నారు. ఇప్పుడు ఆ డబ్బంతా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తుందని ఆరోపించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రజల నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా ఇసుక ఇవ్వాలన్నారు.
ప్రజలు వ్యయ ప్రయాసలకు గురి కాకుండా వాలిపోయిన స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి విద్యుత్ సమస్యలను వాట్సాప్ ద్వారా తెలపాలని విద్యుత్ శాఖ అధికారి రమణ అన్నారు. ఈ మేరకు ఫిర్యాదుదారుని పేరు, చిరునామా, వారి చరవాణితో వాట్సాప్ నంబర్ 9440814264కు పంపించాలని కోరారు. హెల్ప్ డెస్క్ సిబ్బంది సంబంధిత అధికారులకు తెలిపి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అనుసరిస్తారని వివరించారు.
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో జులై 21న స్వామివారి పౌర్ణమి కళ్యాణం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు బుధవారం వెల్లడించారు. రూ.1,000 ఆన్‌లైన్ ద్వారా గానీ, నేరుగా ఆలయంలో గాని సమర్పించి కళ్యాణంలో ఉభయదారులుగా వ్యవహరించవచ్చని వారు తెలిపారు. జులై 21న వ్యాస పౌర్ణమి కూడా ఉందని చెప్పారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
➤ IIITలో గంజాయి.. లోకేశ్ ఆగ్రహం
➤ కడప హైవేపై రోడ్డు ప్రమాదం
➤ కడప టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మృతి
➤ ఒంటిమిట్టలో నీళ్లు లేక భక్తుల ఇక్కట్లు
➤ జగన్ రాజీనామా వార్తల్లో నిజం లేదు: సురేశ్
➤ కొండాపురంలో ఏడుగురి అరెస్ట్
➤ సీఎంకు మండిపల్లి పాలాభిషేకం
➤ పౌర సరఫరాల శాఖలో భారీ అవినీతి: ఎమ్మెల్సీ రాం గోపాల్ రెడ్డి
Sorry, no posts matched your criteria.