India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మడకలవారిపల్లె సచివాలయ ప్లానింగ్ సెక్రటరీ శేఖర్‌ను కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు, బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని మడకలవారిపల్లె గ్రామంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా వాటిని అడ్డుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలోని 11 నగరవనాల అభివృద్ధికి డిప్యూటీ సీఎం, అటవీ శాఖా మంత్రి పవన్ కళ్యాణ్ రూ.15.4 కోట్లు మంజూరు చేశారు. కాగా అందులో కడపకు అవకాశం దక్కడం గమనార్హం. ఈ నిధులతో కడప జిల్లాలో అభివృద్ది పనులు చేపడతారు. పచ్చదనాన్ని పెంపొందిచే క్రమంలో ఆయాచోట్ల అభివృద్ధి పనులు చేపడతారు. మరోవైపు ఈనెల 30న నిర్వహించనున్న వనమహోత్సవంలో పాల్గొని అందరూ మొక్కలు నాటాలని పవన్ కోరారు.
గాలివీడులో రేపు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించనున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. మండలంలోని ప్యారంపల్లి గ్రామం గీదరవాండ్లపల్లెలో టీడీపీ నాయకులు గీదర ఈశ్వరెడ్డి కుమారులు గీదర ధర్మారెడ్డి, నాగభూషన్ రెడ్డి(ఎన్ఆర్ఐ)ఇస్తున్న విందులో ఆయన పాల్గొననున్నారు. ఆయనతో పాటు వారి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి, పలువురు టీడీపీ నాయకులు హాజరుకానున్నారు.
ప్రజలకు వేగవంతంగా రెవెన్యూ సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్‌లో సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, మండల తహశీల్దార్లు, రెవిన్యూ సిబ్బందితో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవిన్యూ సర్వీసులలో భాగంగా మ్యుటేషన్లు, నాలా కనెక్షన్, నీటి పన్ను తదితర అంశాలలో కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
సిద్దవటం మండలంలోని భాకరాపేట రైల్వే స్టేషన్ యార్డ్ వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి, గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు కడప రైల్వే స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. మృతుని వద్ద ఉన్న పర్సులో చరవాణి నంబర్లు బద్వేల్ ప్రాంతానికి చెందిన వారివిగా తేలాయని ఎస్ఐ చెప్పారు.
కాకినాడ జిల్లాకు చెందిన భువనేశ్వరి ఫిర్యాదుతో కడప జిల్లా జైలు వార్డెన్‌గా పనిచేస్తున్న మహేశ్‌పై తుళ్లూరు పోలీసులు శుక్రవారం హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మహేశ్‌తో భువనేశ్వరికి నాలుగు నెలల క్రితం వివాహం అయిందని సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు. రాయపూడిలో అద్దెకు ఉంటున్న వీరి మధ్య గురువారం గొడవ జరిగిందని, వంట గ్యాస్ వదిలి ఆమె గాయపడేలా చేసి అతను కూడా విషం తాగాడన్నారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.
ఉమ్మడి కడప జిల్లాలో ఈ ఏడాది పులుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో YSR జిల్లా వ్యాప్తంగా, రాయచోటి రేంజిలోని అటవీ ప్రాంతాల్లో సాంకేతిక డిజిటల్ కెమెరాల ద్వారా గణన చేపట్టారు. ఉమ్మడి కడప జిల్లాలో గతేడాది 5 పులులుండగా ప్రస్తుతం 3 మాత్రమే ఉన్నట్లు తేల్చారు. కారణం ఆవాసాలు అనుకూలంగా లేకపోవడంతో అవి ఇతర ప్రాంతంలోకి వెళ్లినట్లుగా అధికారులు వెల్లడించారు.
పోలీస్ జాగిలం ‘సన్నీ’ 11 ఏళ్ల పాటు విశిష్ట సేవలందించి, పలు కీలక విధులను సమర్థవంతంగా నిర్వర్తించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు తెలిపారు. శుక్రవారం కడప పెన్నార్ పోలీస్ హాలులో ‘సన్నీ’ పదవీవిరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. పేలుడు పదార్థాలను గుర్తించడంలో నేర్పరిగా పేరున్న లాబ్రడార్ జాతికి చెందిన జాగిలం ‘సన్నీ’ని జిల్లా ఎస్పీ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామసభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆయన అన్నమయ్య డ్యాం వరద బాధితులకు పలు హామీలు ఇచ్చారు. 300 ఇల్లు నిర్మణానికి రూ.6కోట్ల బిల్లులు సత్వరమే విడుదల చేస్తామన్నారు. 5 సెంట్లు భూమి కోల్పోయి కేవలం 1.5 సెంట్ల పరిహారం పొందిన వారికి 5 సెంట్లు ఇస్తామన్నారు. వరద నష్టం జరగకుండా ప్రొటెక్షన్ వాల్ నిర్మాణంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు.
అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లె సర్పంచ్ కారుమంచి సంయుక్త విజయం తన గుండెను కదిలించిందని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలంటేనే భయపడే సమయంలో ఆమె బరిలో నిలిచి విజయం సాధించారని కొనియాడారు. మిలిటరీలో పనిచేసిన భర్తను కోల్పోయి, ఆయన ఆశయ సాధన కోసం పోటీ చేసి సంయుక్త గెలిచారని పవన్ వివరించారు. ఇలాంటి ఆడబిడ్డలు రాజకీయాల్లో ఉండాలని చెప్పారు.
Sorry, no posts matched your criteria.