Y.S.R. Cuddapah

News October 20, 2024

ఎంత ఘోరం..!

image

బద్వేల్ <<14397895>>ఘటన<<>> ఆ యువతి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంటి నుంచి కాలేజీకి వెళ్లిన బిడ్డపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారని తెలియడంతో ఆ తల్లిదండ్రులు విలవిలలాడిపోయారు. వెంటనే కడప ఆసుపత్రికి వెళ్లారు. నిన్నటి నుంచి చికిత్స అందిస్తుండగా తమ కుమార్తె బతుకుతుందని ఎన్నో ఆశలతో ఉన్నారు. కానీ అలా ఆసుపత్రిలో ఆ తల్లిదండ్రుల కళ్ల ఎదుటే చనిపోవడంతో బోరున విలపిస్తున్నారు.

News October 20, 2024

విఘ్నేశ్‌కి పెళ్లై భార్య గర్భిణి..?

image

బద్వేల్‌ ఘటన కడప జిల్లాను ఒక్క సారిగా<<14397895>> ఉలిక్కిపడేలా చేసింది.<<>> విఘ్నేశ్ అనే యువకుడు ఇంటర్ చదివే(17) యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించడం అంతటా చర్చినీయాంశంగా మారింది. ఈ ఘటనలో కీలక ట్విస్ట్ వెలుగు చూసింది. యువతికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న విఘ్నేశ్‌కు ఇప్పటికే పెళ్లి జరిగినట్లు సమాచారం. అతడి భార్య ప్రస్తుతం గర్భిణి అంట. మాట్లాడదామంటూ కాలేజీలో ఉన్న యువతిని పిలిచి ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.

News October 20, 2024

కడప దర్గా ఉరుసు ఉత్సవాలకు షర్మిలకు ఆహ్వానం

image

నవంబర్ నెలలో అత్యంత వైభవంగా జరిగే ప్రాచీనమైన కడప అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరూసు ఉత్సవాలకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను దర్గా ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు ఆమెను కలిసి దర్గా ఉరుసు ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. కుల, మతాలకు అతీతంగా జరిగే ఉరుసు ఉత్సవాలలో పాల్గొనాలని షర్మిలను ఆత్మీయంగా ఆహ్వానించారు.

News October 19, 2024

బద్వేల్: విద్యార్థినిపై అత్యాచార ఘటనపై ఎస్పీ సీరియస్

image

బద్వేలు సమీపంలోని గోపవరం అటవీ ప్రాంతంలో ఇంటర్ విద్యార్థినిపై యువకుడు నిప్పు పెట్టి కాల్చిన ఘటనపై ఎస్పీ హర్షవర్ధన్ రాజు సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో నిందితుడు విగ్నేష్‌ను పట్టుకునేందుకు నాలుగు బృందాలుగా ఏర్పాటు చేసినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లినట్టు తెలుస్తోంది. నిందితుని వెంటనే పట్టుకునేలా కఠిన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.

News October 19, 2024

బద్వేల్లో యువతికి నిప్పు.. స్పందించిన సీఎం

image

గోపవరం మండలంలో ఇంటర్ విద్యార్థినిపై విగ్నేశ్ అనే యువకుడు హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. అధికారులతో మాట్లాడి విద్యార్థినికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. ప్రత్యేక బృందాలతో నిందుతుడిని అరెస్ట్ చేయాలని ఎస్పీని ఆదేశినట్లు టీడీపీ తన Xలో పోస్ట్ చేసింది.

News October 19, 2024

కడప జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ ఇతనే.!

image

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి కడప, కర్నూల్ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్‌గా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని అన్నారు. 2029లో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలన్నారు.

News October 19, 2024

పోలీసు అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం-ఎస్పీ

image

విధినిర్వహణలో వివిధ కారణాలతో మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబ సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడు కృషి చేస్తోందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. కడప పోలీస్ పెన్నార్ కాన్ఫరెన్స్ హాలులో విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబ సభ్యులతో జిల్లా ఎస్పీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వపరంగా అందాల్సిన సౌకర్యాలు, కారుణ్య నియామకాల గురించి, కుటుంబ స్థితిగతులు, బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

News October 18, 2024

సిబ్బంది సంక్షేమమే పరమావధి: కడప ఎస్పీ

image

కడప జిల్లాలోని పోలీస్ సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వర్తించి మంచి పేరు తీసుకుని రావాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. గార్డు విధుల్లోని ఏఆర్ సిబ్బంది సంక్షేమంలో భాగంగా.. జిల్లా ఎస్పీ నేడు వారికి సీలింగ్ ఫ్యాన్లు, బెడ్స్, వాటర్ డిస్పెన్సర్లు వంటి పరికరాలను అందించారు.

News October 18, 2024

కడప జిల్లాలో టెట్ పరీక్ష కేంద్రాలు ఇవే..!

image

☛ శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ కడప
☛ అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ కడప
☛ KSRM కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కడప
☛ శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజీ & సైన్సెస్ కడప
☛ KLM ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్ కడప
☛ SRIT ప్రొద్దుటూరు
☛ CBIT చాపాడు

News October 18, 2024

కడప: అతని కోసం డ్రోన్‌తో వెతుకులాట

image

కడప జిల్లా బద్వేలు పరిధిలోని అట్లూరు మండలానికి చెందిన మోకల కాపరి గంగిరెడ్డి గత 4 రోజులుగా కనిపించడంలేదు. దీంతో చివరికి డ్రోన్‌లను రంగంలోకి దించి అతని జాడకోసం వెతుకుతున్నారు. మరో వైపు గ్రామస్థులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేదు. కాగా గొర్రెల కాపరి గంగిరెడ్డి 4 రోజుల క్రితం అడవికి మేకలను తోలుకుని వెళ్లాడు. అప్పటినుంచి ఇంటికి రాకపోవడంతో గ్రామస్థుల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.